ప్రభుత్వ విద్యాను పరిరక్షించాలి.
వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 17 ; రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలని ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్,ఎ.ఐ.ఎఫ్.డి.ఎస్. జిల్లా ఇంచార్జ్ చంద్రశేఖర్,పి.డి.యస్.యు. జిల్లా ఇంచార్జ్ పాపారావు డిమాండ్ చేశారు. సోమవారం రోజున వామపక్ష విద్యార్థి సంఘాల ఆద్వర్యంలో "ప్రభుత్వ విద్యా పరిరక్షణకై" అనే అంశం పైన ఎస్.వి. పాఠశాలలో రౌండ్ టెబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది.అనంతరం వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాను నిర్వీర్యం చేసి కార్పొరేట్ విద్యను రాష్ట్రంలో ప్రవేశ పెట్టి విద్యను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని అన్నారు. రెసిడెన్సియల్ పేరిట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను మూసివెసెందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్ రీయంబర్స్ మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బాడిబాట కార్యక్రమం తూతు తూతు మంత్రంగా కొనసాగిందని అన్నారు.సంక్షేమ వసతి గృహలపై సవతి ప్రేమ చూపించి ఇప్పటికే వసతి గృహలను మూసివేశారని అన్నారు. రాష్ట్రంలో ఉన్న కార్పొరేట్ విద్యాసంస్థలను రద్దు చేసి ప్రభుత్వ విద్యను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆద్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చెపాడాతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఏఫ్ డివిజన్ కార్యదర్శి పుదారి సాయి,మండల కార్యదర్శి సాయి,నాయకులు కమలకర్,సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment