పోలీసులు విధి నిర్వహణ లో అంకిత భావం తో పని చేయాలి ; జిల్లా ఏస్పీ సన్ ప్రీత్ సింగ్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 21 ; (వుదయం ప్రతినిధి) పోలీసులు విధి నిర్వహణ లో అంకిత భావం తో ,సేవాతత్పరత తో శాంతి భద్రతలను పరిరక్షించాలి అని కుంరం భీం జిల్లా ఏస్పీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. జిల్లా లోని పోలీసులు ఆదర్శం గా నిలవాలి అని పేర్కొన్నారు. పోలిస్ అధికారుల నుంచి ఏళ్ల వేళలా సహాయ సహకారాలు ఉంటాయన్నారు. ఈ సందర్భంగా ఏ ఆర్ ఎస్ ఐ గా పదోన్నతి పొందిన డోలి ఓదెలు ను జిల్లా ఏస్పీ పదోన్నతి చిహ్నం తో అలంకరింప చేశారు. రెట్టింపు విశ్వాసం తో సేవాభావం తో శాంతి భద్రతలను కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమం లో ఎస్బి సీ ఐ వేంకటేశ్వర్లు ,ఎస్బి ఎసై శివకుమార్, డీసీబీ ఏసై రామ రావు, కుంరం భీం హెడ్ క్వార్టర్స్ ఇంచార్జి రిజర్వు ఇన్స్పెక్టర్ వామనమూర్తి, ఆర్ ఏసై లు ఎం .శ్రీనివాస్ ,అనిల్ ,శేఖర్ లు పాల్గోన్నారు .
No comments:
Post a Comment