ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టాలి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 15 ; ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టి సంరక్షించుకోవాలని ఎం పి డి ఓ సత్యనారాయణ సింగ్ అన్నారు. శనివారం రెబ్బెన మండల పరిధిలోని తుంగేడా, గంగాపూర్,గోలేటిలో జలనిధి కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు.కళాజాత బృందం సభ్యులు కళా ప్రదర్శనతో నీటి సంరక్షణపై పాటలు పాడి ప్రజల్లో అవగాహన కల్పించారు. అనంతరం ఎం పి డి ఓ సత్యనారాయణ సింగ్ మాట్లాడుతూ నీటిని వృథా చేయకుండా అవసరానికి సరిపడా పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మించుకోవాలన్నారు. నీటిని పొదుపు చేస్తే భవిష్యత్ తరాలకు నీటిని అందించవచ్చన్నారు. వానాకాలంలో పడ్డ ప్రతి వర్షపు చినుకును సంరక్షించుకుంటే నీటి ఎద్దడి నివారణ సాధ్యమని అన్నారు. గంగాపూర్ సర్పంచి రవీందర్, ఏపిఓ కల్పనా మరియు రాయలనర్సయ్య, కళాజాత బృందం ఇర్ఫాన్, తిరుపతి, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment