పార్టీ బలోపేతానికి అందరు కృషి చేయాలి ;జె పి పొడేల్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) ఏప్రిల్ 19 ; ప్రజల సమస్యలు తెలుసుకుంటూ గ్రామస్థాయి బూత్ కమిటీలను నియమిస్తున్నాం అని బి జె పి బలోపేతానికి నాయకులూ అందరు కృషి చేయాలని జె పి పొడేల్ అన్నారు. రెబ్బెన మండలం లోని తక్కలపెల్లి గ్రామంలో బూత్ లెవల్ కమిటీని వేయడం జరిగిందని అయన తెలిపారు. సమావేశంలో అయన మాట్లాడుతూ గ్రామాల వారీగా కమిటీలు వేస్తూ భాజపా నాయకులూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలి అన్నారు. తక్కలపెల్లి బూత్ అధ్యక్షులుగా ఆకుల గోపాల్, ఉపాధ్యక్షులుగా ఎలగల భీమేష్,కోట రాఘవేందర్, ప్రధాన కార్యదర్శిగా ఏడేదినేని చందు,కార్యదర్శులుగా కోట సురేష్,కోట సంతోష్ లను ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బి జె వై ఎం జిల్లా కార్యదర్శి అరిగేలా శేఖర్,రెబ్బెన మండల కార్యదర్శి బి జె వై ఎం కోట రాజేష్, నాయకులూ డి.పుల్లయ్య, సాయి, రాంబాబు, అశోక్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment