ఆరోగ్యశ్రీని సద్వినియోగం చేసుకోవాలి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 28 ; (వుదయం ప్రతినిధి) ; తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వo అమలుచేస్తున్న ఆరోగ్య శ్రీ పథకాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని రెబ్బన మండలం పిహెచ్ సి పరిధిలో గల ఆరోగ్యమిత్ర లావణ్య అన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నిరుపేదలకు ఆరోగ్యం కోసం కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించడానికి ప్రవేశపెట్టబడిందన్నారు. ఆరోగ్యోశ్రీ ఈ పథకం ద్వారా గుండె, కిడ్నీ, క్యాన్సర్, ప్రమాద గాయాలు, ఆర్తో, పుట్టిన చిన్నపిల్లల, గర్భాశయం, చెవి, ముక్కు, గొంతు, న్యూరో, అపెండిక్స్, సంబందించిన మొదలగు 948 రకాల వ్యాధులకు ప్రభుత్వం 2 లక్షలవరకు ఖర్చు చేస్తూ ఉచితంగా శస్త్ర చికిత్స లు నిర్వచిస్తుంది అన్నారు. ఈ ఆరోగ్యశ్రీ పథకం పొందే అర్హులనవారు తమ తెల్ల రేషన్ కార్డ్, అంత్యోదయ కార్డు, అన్నపూర్ణ, జర్నలిస్ట్, టి ఏ పి ,ఆర్ ఏ పి మొదలగు కార్డులు కలవారు. ఈ ఆరోగ్యశ్రీ పథకానికి అర్హులు అవుతారని లావణ్య తెలిపారు.
No comments:
Post a Comment