కౌన్సిలింగ్ ద్వారానే ఈపి ఆపరేటర్ల బదీలీలను చేపట్టాలి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) ఏప్రిల్ 06 ; ఈపి ఆపరేటర్ మరియు ట్రేడ్స్ మెన్ ల బదిలీలు కౌన్సిలింగ్ నిర్వహించి పారదర్శకంగా చేపట్టాలని ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి డిమాండ్ చేశారు.గురువారంనాడుగోలేటిలోని కేఎల్ మహేంద్ర భవన్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన కౌన్సిలింగ్ పద్ధతి ద్వారానే బదిలీల ప్రక్రియ జరిగేదని,కానీ దానికి విరుద్ధంగా గుర్తింపు సంఘoగా గెలిచినా టీబీజీకేఎస్ సింగరేణి యాజమాన్యంతో కుమ్మకై పైరవీల ద్వారా బదిలీలను జరుపుతున్నారని దీని వలన ఈ ప్రాంతంలో పనిచేస్తున్న సీనియర్ ఈపి ఆపరేటర్లు,ట్రేడ్స్ మెన్ లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.ఈ మధ్యకాలంలో బదిలీల ద్వారా కొత్తగా వచ్చిన ఆపరేటర్లకు సెట్లింగ్ అలవెన్స్ ఎగగొట్టె విధంగా యాజమాన్యం ఉత్తర్వులు జారీచేసిన,టీబీజీకేఎస్ నోరు మెదపడం లేదని అన్నారు.టీబీజీకేఎస్ కొత్త్త హక్కులు సాధించకపొగ,ఉన్న హక్కులను పోగొడుతూ కార్మిక వర్గాన్ని తీవ్రంగా మోసం చేసిందని అన్నారు.ఆపరేటర్లకు నిర్వహించిన "A" గ్రేడు టెస్టు ఫలితాలను వెంటనే విడుదల చేయాలని,వారికి ఉదోగోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు.బెల్లంపల్లి ఏరియాలోని ఈపి ఆపరేటర్లు మరియు ట్రేడ్ మెన్ లకు రావలిసిన D2సి గ్రేడ్ మరియు C2బి గ్రేడు పరీక్షలు నిర్వహించి వారికి ప్రమోషన్ లు వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.యాజమాన్యం వెంటనే సానుకూలంగా స్పందించి కౌన్సిలింగ్ ద్వారానే బదిలీలు చేపట్టాలని,ఆపరేటర్లకు రావలసిన సెట్లింగ్ అల్లవెన్సు ను మరియు ప్రమోషన్లు ఇవ్వాలని లేనిచో ఆందోళనలు నిర్వహిస్తామని ఆయన అన్నారు.ఈ సమావేశంలో బ్రాంచ్ ఉపాధ్యక్షులు బయ్యా మొగిలి,ఫిట్ కార్యదర్శులు బీకే.చక్రధర్,జూపాక రాజేష్,నాయకులూ ఎం.సత్యనారాయణ,సురేష్ కోరి,పోచమళ్లు,నర్సయ్యలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment