కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 28 ; (వుదయం ప్రతినిధి) ; ఉద్యానవనాలపై రెబ్బెన మండలంలోని గ్రామాలలో ఉద్యానవన పండ్ల తోటలను పరిశీలించి శుక్రవారం ఉద్యానవన అధికారి ఎం ఏ నదీమ్ రైతులకు అవగాహనా కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చే రాయితీల గురించి తెలియ చేశారు. ఈ సందర్బంగా ఎం ఏ నదీమ్ మాట్లాడుతూ రెబ్బెన మండలంలోని నంబాల,నార్లాపూర్,కిష్టాపూర్, తాకాలపల్లి, పులికుంట గ్రామాలలో ఉద్యాన పంటల గణాంకాలను నిర్వహించి రైతులకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలను వినియోగించుకొని పండ్ల తోటలలో పంటలలో లాభాలు గటించాలి అని అన్నారు. పండ్ల తోటలపై రాయితీలు కావాలన్నవారు వారి యొక్క వివరాల నమోదు చేసుకోవాలని సూచించారు. వీరితో పటు హెచ్ ఈ ఓ లు రమేష్,శంకర్ లు ఉన్నారు.
No comments:
Post a Comment