విద్యతో పాటు క్రమశిక్షణ ఎంతో అవసరం - బి . రమేష్ గౌడ్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 15 ; విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ ఎంతో అవసరం అని రెబ్బెన తహశీల్ధార్ బండారి రమేష్ గౌడ్ అన్నారు . శని వారం స్థానిక ఎస్ వి ఇంగ్లిష్ మీడియం హై స్కూల్ లో జరిగిన 9 వ వార్షికోత్సవానికి పాల్గొని మాట్లాడారు . విద్యార్థులు చిన్నతనము నుండే క్రమశిక్షణను అలవరచు కొంటె బావి తరాలకు ఎంతో ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు . ఎస్ వి ఇంగ్లిష్ మీడియం లో ని యాజమాన్యం కృషితో , పట్టుదలతో అంచెలంచెలుగా ఎదుగుతు వస్తుందని , 10 వ తరగతి వరకు ప్రబుభుత్వామోదితంతో ఉన్నతమైన విద్యను అందిస్తున్నారని తెలిపారు . ఆసిఫాబాద్ మార్కెటింగ్ వైస్ ఛైర్మెన్ కుందారపు శంకరమ్మ మాట్లాడుతూ ఎస్ వి ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో చదివిన పిల్లలు ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడ్డారని ఇక్కడ చదివే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆమె అన్నారు . ధనార్జనే ముఖ్యముగా కాకుండా సేవ భావముతో పాఠశాల యజమాన్యము కృషి చేస్తుందన్నదని అన్నారు . పేదవారికి ఎంతో మందికి ఉచిత విద్యను అందిస్తూ జిల్లాలోనే ఆదర్శనంగా నిలుస్తున్నారని , యాజమాన్యానికి ప్రత్యకంగా అభినందనలు తెలిపారు . అనంతరము పాఠశాలలో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనను తిలకించారు . విద్యార్థులు తాము చేసిన వైజ్ఞానిక చిత్రాలు తల్లి తండ్రులను ఎంతో ఆకట్టు కొన్నాయి . విద్యార్థు లు చేసిన సాంస్కృతిక నృత్యాలు చూపరులను అలరించాయి . ఈ కార్య క్రమములో స్థానిక సర్ఫఞ్చ ప్ వెంకటమ్మ ,ఏపీఎం వెంకట రమణ , ట్రస్మా కుమరంభీమ్ జిల ప్రధాన కార్యదర్శి ఫై దేవభూషణం , ట్రస్మా రాష్ట్ర నాయకు వొడ్నాల శ్రీనినివాస్ , ప్రత్యక అధికారి శ్రీనివాస్ , డైరెక్టర్ మధునయ్య , టీఆరెస్ నాయకులు మోడెమ్ సుదర్శన్ గౌడ్ , ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి దుర్గం రవీందర్ , భరద్వాజ్ , పాఠశాల సలహాదారులు బంగారు లక్ష్మణ్ , శ్యామ్ రావు , రాజు , అదే హన్మంతు పాఠశాల కరస్పాండెంట్ ఢీకొండ విజయ కుమారి , హెడ్మాస్టర్ సంజీవ్ కుమార్ యాహూ పాటు తల్లి తండ్రులు ఉన్నారు.
No comments:
Post a Comment