Friday, 14 April 2017

మొక్కలను శ్రద్ధగా పెంచాలి ; ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్

మొక్కలను శ్రద్ధగా  పెంచాలి  ; ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ 

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) ఏప్రిల్  14 ;   మొక్కలను శ్రద్ధగా  పెంచాలని ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ రవీందర్ గౌడ్ అన్నారు. శుక్రవారము రెబ్బన నర్సరీ నీ సందర్శించి మొక్కల పెంపకంలో మెలకువలను సూచించారు. రానురాను అడవి అంతరించడంతో నేటి మొక్కలే రేపటి వృక్షాలు వాటిని కాపాడవలసిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు . జూన్ లో కురిసే మొదటి వానకు నాటడానికి మొక్కలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. వీరితో పాటు అటవీక్షేత్రాధికారి రాజేంద్రప్రసాద్,ఉపక్షేత్రాధికారి శ్రీనివాస్ మరియు బీట్ అధికారి రవి ఉన్నారు.       

No comments:

Post a Comment