Monday, 24 April 2017

చౌకధర దుకాణంలో చక్కరను యధావిధి గా అందించాలి

చౌకధర దుకాణంలో  చక్కరను యధావిధి గా అందించాలి 


 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  ఏప్రిల్  24 ; (వుదయం ప్రతినిధి) ;    చౌకధర దుకాణంలో నీరు పేదలకు అందించే సరుకుల్లో చక్కరను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసే ప్రయత్నం  చేస్తుందని  దానిని వెంటనే విరమించు కోవాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్,  ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి దుర్గం రవీందర్ లు సోమవారం రెబ్బెన మండలం తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఊర్మిళ కు వినతి పత్రాన్ని  అందచేశారు. ఈ సందర్బంగా  అయన మాట్లాడుతూ చౌక దరల దుకాణంలోనిత్యావసర వస్తవులలో  పంపిణి చేస్తున్న చక్కరను రద్దు వల్ల  నీరు పేదలకు ఇబ్బంది కరంగా మారుతుంది అన్నారు. టి ఆర్ ఎస్ ప్రభుత్వం నిత్యావసర సరుకులకు కోతపెడుతూ భవిష్యత్ లో ప్రజా పంపిణి వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి పెట్టుబడిదారీ వ్యవస్థను రాష్ట్రంలో బాలోపితం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. పేద,బడుగు,బలహీన వర్గాల ప్రజలకు అందించే నిత్యావసర సరుకుల్లో కొతపెట్టకుండా యధావిధిగా  కొనసాగించాలని డిమాండ్  చేస్తున్నాము అని అన్నారులేని పక్షంలో పేద ప్రజల పక్షన సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి రాయల నర్సయ్య, గోగర్ల రాజేష్, చిన్నయ్య, భీమయ్య, హన్మంతు, సన్యాసి తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment