మహాత్మ జ్యోతిబా ఫూలే 191వ జయంతి వేడుకలు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) ఏప్రిల్ 11; భారతమాత ముద్దబిడ్డ, బడుగుబలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మజ్యోతిబాఫూలే అని ఆయన చేసిన సేవలు చిరస్మరణీమని జెట్ పి టీ సి బాబురావు అన్నారు. మంగళవారం రెబ్బెన అతిధి గృహంలో మహాత్మ జ్యోతిబా ఫూలే 191వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెబ్బెన తహసిల్దార్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ, అట్టడుగు వర్గాలకు విద్యావకాశాలు కల్పిస్తూ, నిరుపేద బడుగుబనహీన వర్గాల కోసం జీవితమంతా ఒంటిరిగా పోరాడిన మహావ్యక్తి ఫూలే అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు పెసరు వెంకటమ్మ,ముంజం రవీందర్, మాంతుమేర, డిక్కీ ఉభయ జిల్లాల ఇంచార్జి శోభన్ బాబు, సాక్షరా భారత్ కో ఆర్డినేటర్ సాయిబాబా, పిఏసిఎస్ డైరెక్టర్ మదునయ్య,ఏ ఐ ఎస్ ఎఫ్ నాయకులు దుర్గం రవీందర్, పూదరి సాయి, నాయకులు దుప్ప నాయక్, దేవాజి నాయక్, భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment