గోలేటిలో మండల స్థాయి కబడ్డీ పోటీలు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 26 ; (వుదయం ప్రతినిధి) ; రెబ్బెన మండలం గోలేటిలో ఈ నెల 30వ తేదీన ముదగిరి రమేష్ స్మారక మండల స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నామని ఈ పోటీలకు అండర్-16,పదహారు సంవత్సరాల లోపు అభ్యర్థులు అర్హులు అని కబడ్డీ పోటీల ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు జి.వంశీ,వర్కింగ్ అధ్యక్షుడు జె.సంజయ్ లు తెలియజేసారు.ఈ నెల 30న ప్రారంభం అయ్యి మే నెల 3 వ తేదీ వరకు పోటీలు సాగుతాయని ఆసక్తి గల అభ్యర్థులు,టీమ్ లు నమోదు చేసుకోవాలని కోరారు.పోటీలలో నెగ్గిన జట్టుకు మొదటి బహుమతి గ 4500,ద్వితీయ బహుమతి 2500 ప్రైజ్ మనీ అందజేయడం జరుగుతుందని అన్నారు.ఈ క్రింది నెంబర్ లను 9052492113,8367442521,9908108962 సంప్రదించాలని కోరారు.ఈ సమావేశంలో కమిటి సభ్యులు శ్రీకాంత్,దిలీప్,అజయ్,రాకేష్,శివసాయి,తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment