Thursday, 6 April 2017

విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించండి

విద్యార్థులను ప్రభుత్వ  పాఠశాలల్లోనే చేర్పించండి 



 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం ప్రతినిధి)  ఏప్రిల్  06 ;   ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనలో భాగంగా  బడి బాట కార్యక్రమన్ని   రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా   నిర్వహిస్తున్న క్రమంలో   గురువారం రోజున రెబ్బెన మండలంలోని నంబాల గ్రామంలో  ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలని చేర్పించాలని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,మండల పరిషత్ ప్రాధమిక  పాఠశాలల   విద్యార్థులు,ఉపాధ్యాయులు అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని,శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో విద్యార్థులను మేటీలు గా తీర్చిదిద్దేందుకు ఉపయోగకారిగా తోడ్పడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో  పాఠశాల యాజమాన్య కమిటీ  చైర్మన్ దెబ్బటి సత్యనారాయణ,పాఠశాల ఉపాధ్యాయులు  సత్తమ్మ,రాజేశ్వరి,ప్రకాష్ ,భాస్కర్,సత్యనారాయణ,నారాయణ,దత్తుమూర్తి,శ్రీనివాస మూర్తి,గణేష్,పిఇటి  విజయ్ చందర్,పిటిఐలు కృష్ణ,స్వప్న,కల్పన,శ్యామ్,క్లస్టర్ సిఆర్పీ మారుమొకం రాజేష్,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment