Thursday, 13 April 2017

సంక్షేమానికి మరో పేరు తెలంగాణ ప్రభుత్వం ; ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్

సంక్షేమానికి మరో పేరు తెలంగాణ ప్రభుత్వం ; ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్
   కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) రెబ్బెన ఏప్రిల్  13 ;  తెలంగాణ రాష్ట్ర గ్రామీణ  అభివృద్ధి  పథకాల ను ప్రవేశ పెట్టి అమల్లోకి తీసుకు వస్తు  వివిధ  సంక్షేమలను అమలు చేస్తుందని పల్లె ప్రగతి కోసం తెరాస ప్రభుత్వం తోనే సాధ్యం అవుతందని, సంక్షేమనికి మరో పేరు తెలంగాణ ప్రభుత్వం  అని ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్ అన్నారు . శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అభివృద్ధి కొరకు మంజూరైన నిధులు కల్యాణ మండపం కోసం  గురువారం రోజన ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ ,ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి  భూమి పూజ చేసారు. అనంతరం రెబ్బెన లోని అతిధి గృహం ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో ఇతర పార్టీ లో నుంచి నాయకులు యాన్ ఎస్ యు ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం భరద్వాజ్, నదీమ్ పాషా, కళావతి, సాయి తధీతర కార్యకర్తలు లు పార్టీ లో చేరి తెరాస  ఖండువాలు కప్పుకున్నారు.    ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పతకాలను చూసి ఇతర పార్టీ కార్యకర్తలు తెరాస లో చేరారన్నారు.  ఉమ్మడి రాష్ట్ర పాలనలో గత ప్రభుత్వాలు ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోవడం తో ఎంతో వెనకపడి పోయిన ఏరియా ని మన తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకొని మన ముఖ్య మంత్రి కెసిఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం రెండు వందల రూ  ఉన్న వృద్ధాప్య పింఛన్లు రెండు వేలకు గాను పెంచారు అలాగే వికలాంగులు  పింఛన్లు 500రూ నుండి 1500గాను , రేషన్ నాలుగు కిలోల నుండి ఆరు కిలోల వరకు పెంచిన ఘనత కెసిఆర్దే  అని అన్నారు. కల్యాణ లక్ష్మి పతాకం కింద ఎస్ సి , ఎస్ టి లేక్ పరిమితం కాకుండా బీసీ ఓసి లకు కూడా వర్తించేలా వారిలో కూడా నిరుపేదలు ఉన్నారని గుర్తించి తెరాస ప్రభుత్వం పతకాలను అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. చెరువులను ఎంతో అభివృద్ధి చేశామని, పేర్కొన్నారు . రక్షిత మంచి నీటి పథకము  పనులు వేగవంతముగా జరుగుతున్నాయని , ప్రతి ఒక్కరికి త్రాగు నీరు అందిస్తామని,  ఈ కార్య క్రమములో జెడ్ పి  టి సి అజ్మీర బాబు రావు, ఎంపిపి కార్నాథం సంజీవ్ కుమార్,  హసీల్ధార్ బండారి రమేష్ గౌడ్, ఏ ఎం సి  కుందారపు శంకరామ్మా, వైస్ ఎంపిపి రేణుక ,  సర్పంచ్ వెంకటమ్మ, తోట లక్ష్మన్,    సుశీల, జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ జైస్వాల్, ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, టి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి,   ప్రధాన కార్య దర్శి చెన్న సోమ శేకర్,  మోడెమ్ సుదర్శన్ గౌడ్,  ఎంకటేశ్వర గౌడ్ , మధునయ్య, రాజేశ్వర్ రావు ఆశోక్, చిరంజీవి గౌడ్,  మల్రాజ్ శ్రీనివాస్ రావు,కోఆప్షన్ సభ్యుడు జాకీర్ ఉస్మాని, సింగల్ విండో డైరెక్టర్లు మధునయ్య, సత్యనారాయణ, గుడిసెల వెంకన్న గౌడ్, రమేష్ తధీతరులు ఉన్నారు.

No comments:

Post a Comment