Monday, 24 April 2017

పోలీసు సిబ్బంది ప్రజలకు జవాబుదారిగా ,సమస్యల పరిష్కారమే ద్యేయం గా పని చేయాలి : ఎస్పి సన్ ప్రీత్ సింగ్ .

పోలీసు సిబ్బంది ప్రజలకు జవాబుదారిగా ,సమస్యల పరిష్కారమే ద్యేయం గా పని చేయాలి : ఎస్పి సన్ ప్రీత్ సింగ్ .

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  ఏప్రిల్  24 ; (వుదయం ప్రతినిధి) ;  పోలీసు సిబ్బంది ప్రజలకు జవాబుదారిగా ,వారి సమస్యలను పరిష్కరించేందుకు ఏళ్ల వేళ ల అందుబాటులో ఉండాలి అని ఎస్పి సన్ ప్రీత్ సింగ్  తెలిపారు .సోమవారం గ్రీవెన్స్ డే సందర్భం గా జిల్లా పోలీసు ప్రధాన కార్యలయం లో జిల్లా లోని వివిధ మండలం ల నుంచి వచ్చిన ప్రజాఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ మాట్లడుతూ ఫిర్యాదుల పైన స్టేషను హౌస్ ఆధికారులు తక్షణం స్పందించి న్యాయం చేయాలన్నారు సోమవారము దహెగాం నుంచి వచ్చిన మండల వెంకటేశం  జిల్లా ఎస్పి ను  కలసి తన యొక్క కూతురు గంట వనిత అధిక కట్నం కోసం అత్తింటి వేధింపుల వల్ల మృతి చెందింది అని తల్లి మరణించినప్పటి నుంచి పిల్లలు అయిన విశ్వనాథ్ తేజ్ ,విష్ణుప్రియ లను తాను యే పెంచుతున్నాను ,త్వరితగతిన కేస్ పరిష్కారం అయ్యేలా  చూసి తమకు నష్టపరిహారం ఇప్పించేలా చూడాలి అని కన్నీటి పర్యంతం అవ్వగా తక్షణం స్పందించిన జిల్లా ఎస్పి గారు చరవాణి లోనే దహెగం ఏసై ను కాగజ్ నగర్ డిఎస్పీ ను బాధితులకు న్యాయం జరిగేలా చూడాలి అని ఆదేశించారు. ఈ కార్యక్రమం లో ఎస్బి సీ ఐ వెంకటేశ్వరులు ,ఎస్బి ఎసై శివకుమార్ ,డిసీబీ ఎసై రామరావు ,అసిఫాబాద్ టౌన్  సీ ఐ సతీశ్ గారు ,ఎస్పి సీ సీ శ్రీనివాస్ ,ఫిర్యాదుల విభాగం అధికారిని సునీత  పాల్గొన్నారు.

2 comments: