Thursday, 6 April 2017

హామీల అమలులో తెరాస విఫలం ; బీజేపీ జిల్లా అధ్యక్షులు పౌడెల్

హామీల అమలులో తెరాస విఫలం 
                       బీజేపీ జిల్లా అధ్యక్షులు పౌడెల్ 



 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం ప్రతినిధి)  ఏప్రిల్  06 ;   రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ప్రజల సమస్యలను తీర్చకుండా కేవలం హామీలకె పరిమితం అయిందని కొమురం భీం ఆసిఫాబాద్  భాజపా జిల్లా అధ్యక్షులు జేబీ.పౌడెల్ అన్నారు. భాజపా ఆవిర్భవ దినోత్సవ సందర్బంగా  గురువారంనాడు రెబ్బెన మండలం గోలేటిలోని జిల్లా పార్టీ కార్యాలయంలో పాతకావిష్కరణ చేసినారు.అదేవిధంగా రెబ్బెన మండల కేంద్రంలో మండల శాఖ అధ్యక్షులు కుందారపు బాలకృష్ణ,ఆసిఫాబాద్ మండల శాఖ అధ్యక్షులు కాండ్రే విశాల్  ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జెండా ఆవిష్కారణ చేసారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 2019 ఎన్నికలలో తెలంగాణలో భాజపా   గెలుపే లక్ష్యoగా ముందుకు సాగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.జిల్లాలోని అన్ని మండలాలు మరియు గ్రామాలలో  పూర్తి  స్థాయిలో కమిటీలను ఎన్నిక చేసి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు  కృషి చేయాలనీ అన్నారు.ఆ యా కార్యక్రమాలలో భాజపా జిల్లా కార్యదర్శి  ఆంజనేయులుగౌడ్,అసెంబ్లీ కన్వీనర్ గుల్భము చక్రపాణి,ఎంపీటీసీ సురేందర్,కిషన్ గౌడ్,మండల కార్యదర్శి రాంబాబు,కిసాన్ మోర్చా  జిల్లా అధ్యక్షులు సునీల్ చౌదరి, పంబల శ్రీనివాస్, మధుకర్, సంజువ్, అరిమడ్ల మనోహర్,ప్రశాంత్,శేఖర్,కోట రాజేశ్వర్,తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment