Saturday, 15 April 2017

వైజ్ఞానిక ప్రదర్శనలు మేధా శక్తిని పెంచుతాయి-సర్పంచ్

వైజ్ఞానిక ప్రదర్శనలు మేధా శక్తిని పెంచుతాయి-సర్పంచ్ 



  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) ఏప్రిల్  15 ;  విద్యార్థుల మేధా శక్తిని పెంపొందించటం కోసం వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతో ఉపయోగ పడతాయని రెబ్బెన సర్పంచ్ పెసర వెంకటమ్మ ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ కుందారపు శంకరమ్మ అన్నారు . శనివారం రెబ్బెనలోని ఎస్ వి ఇంగ్లిష్ మీడియం హై స్కూల్ నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించి, మాట్లాడారు .  ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు తమ తెలివి తేటలతో ఇంత అబ్దుతంగా సైన్స్ ఎగ్జిబిట్స్  తయారు చేయటం గర్వాంగా ఉందన్నారు . పాఠశాల యాజమాన్యం ఎంతో పట్టుదలతో విద్యార్థుల పట్ల శ్రద్ధ చూపుతూ పాఠశాలను 10వ తరగతి వరకు గవెర్నమెంట్ అనుమతితో  అభివృద్ధి చేయడం మండలానికి ఎంతో మంచిదని అన్నారు . విద్యార్థి భావితరాల భవిష్యత్ కోసం ఎస్వీ ఇంగ్లిష్ మీడియం యాజమాన్యం చేస్తున్న  కృషినిఅభినందించారు .  ఈ కార్య క్రమములో స్థానిక సర్ఫఞ్చ ప్ వెంకటమ్మ ,ఏపీఎం వెంకట రమణ , ట్రస్మా కుమరంభీమ్ జిల ప్రధాన కార్యదర్శి ఫై దేవభూషణం , ట్రస్మా రాష్ట్ర నాయకు వొడ్నాల శ్రీనినివాస్ , ప్రత్యక అధికారి శ్రీనివాస్ , డైరెక్టర్ మధునయ్య , టీఆరెస్ నాయకులు మోడెమ్ సుదర్శన్ గౌడ్ , ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి దుర్గం రవీందర్ , భరద్వాజ్ , పాఠశాల సలహాదారులు బంగారు లక్ష్మణ్ , శ్యామ్ రావు , రాజు , అదే హన్మంతు పాఠశాల కరస్పాండెంట్ ఢీకొండ  విజయ కుమారి , హెడ్మాస్టర్ సంజీవ్ కుమార్ యాహూ పాటు తల్లి తండ్రులు ఉన్నారు .

No comments:

Post a Comment