Saturday, 22 April 2017

కోతుల దాడిలో వ్యక్తికీ గాయాలు

కోతుల దాడిలో వ్యక్తికీ గాయాలు  

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  ఏప్రిల్  22 ; (వుదయం ప్రతినిధి)  రెబ్బెన మండల కేంద్రంలో కోతులు బీవత్సవం నానాటికి పెరుగుతుండడంతో వాటి వలన  ప్రజలకు  తీవ్ర కష్టాల ఎదురవుతున్నాయి. మండల కేంద్రం లో కోతుల బారిన పడి ఇప్పటికే పలువురు హాస్పటల్ పాలయ్యారు. శనివారం మండల కేంద్రానికి చెందిన  పూసల వ్యాపారి పాసులూటి కృష్ణ కోతుల దాడిలో గాయాల పలు అయ్యారు. గతం లో కూడా పలువురు కోతుల బారిన పడి  గాయాల పాలై హాస్పటల్ లో చికిత్స తీసుకున్నారు. కోతుల నివారణకు గ్రామా పంచాయితీ వారు రెండు కొండగాలు కొనుగోలు చేసినప్పటికీ కోతులను నివారించలేక పోయారు.కోతులు గుంపులు గుంపులుగా వచ్చి దాడులు చేస్తున్నప్పటికీ వాటి బారిన పడీ హాస్పత్రి పలు తప్ప చేసేది ఏమిలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కానీ గ్రామా పంచాయితీ వారు కానీ  కోతుల నివారణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.

2 comments:

  1. Anjanna lu m cheyavu nv cenema cheyaku Sunil

    ReplyDelete
  2. Anjanna lu m cheyavu nv cenema cheyaku Sunil

    ReplyDelete