గిరిజన సంక్షెమమనికి కృషి చేస్తున్న జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 23 ; (వుదయం ప్రతినిధి) ; గ్రామ ప్రజల సహకారం ఉంటె ఏమి అయిన సాధించవచ్చుఅని కుమరంభీమ్ అసిఫాబాద్ జిల్లా ఎస్పి సన్ ప్రీత్ అన్నారు. తిర్యాణి మండలం గిరిజనుల గ్రామంలో గ్రామస్తులతో కలసి ఆదివారం జిల్లా ఎస్పి స్వయం గా రోడ్డురోలర్ ను నడిపి చురుకుగా గిరిజన గ్రామలకు రోడ్డును నిర్మించ్చారు. కుమరంభీమ్ అసిఫాబాద్ లో చాలా ప్రాంతాలు రోడ్డు లేక సరైన రవాణా సదుపాయాలు లేక వాహనాలు రాలేని మారుమూల గ్రామాలను గమనించిన జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ గారు వారిలో చైతన్యం తీసుకువచ్చి వారిని కూడా అభివృద్ధిలో భాగస్వామ్యులు ను చేయాలనీ నిశ్చయిచుకున్నారు. ఇందులో భాగం గా 28 -12 -2016 రోజున తిర్యాణి మండలం గోపేర గ్రామంలో గిరిజనుల వైద్యము కొరకు మెడికల్ క్యాంపు ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పి కాలినడకన చేరుకున్నారు. గ్రామ ప్రజలందరినీ కలిసి మాట్లాడగా వారు కనీసం తమ గ్రామానికి నాలుగు చక్రాల వాహనం రాలేని స్థితి లో ఉన్నామని, అత్యవసర వైద్య సదుపాయం కావలిసి వస్తే రోగి ను మంచం పైన పడుకోబెట్టి నలుగురం మోస్తూ తీసుకు వెళ్తునం అని ఈ దుస్థితి ను తొలగించమని గ్రామ ప్రజలందరూ కోరారు. దీనికి చలించి పోయిన జిల్లా ఎస్పి మీ అందరి సహకారం ఉంటె ఏమి అయిన సాధించవచ్చు అని త్వరలోనే రోడ్డు తప్పక నిర్మించుకుందాం అని హమీ ఇచ్చారు. గతం లో ఇంజనీర్ అయినటువంటి జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ గారు ప్రత్యేకంగా కొండ ,కొనలనుంచి రోడ్డు ను నిర్మించటానికి స్వయంగా " రూట్ మ్యాప్ "ను తన స్వ హస్తములతో తయారు చేసారు . మరియు రోడ్డు నిర్మాణం లకు అవసరం అగునట్టి వస్తువులను ,యంత్రాలను సమకూర్చారు ,ప్రజలను యొక్క సహకారం తో పనులు ప్రారంభించారు అక్కడి గ్రామాలూ అయిన మోడిగూడ ,గోపేర ,గోయినా ,కోలం గూడ ,పెద్దగూడ & చిన్న,చిన్న తండాల ప్రజలను పనుల లో శ్రమదానం తో జిల్లా ఎస్పి స్వీయ పర్యవేక్షణ లో మరియు క్షేత్ర స్థాయి పర్యవేక్షకుడిగా తిర్యాణి ఎసై బుద్దే స్వామీ ను జిల్లా ఎస్పీ గారు నియమించారు. ఆ ఊరి గిరిజన గ్రామస్తులు కోవా సోనేరావు ,ఆత్రం లచ్చు లు మాట్లాడుతూ మా ఊరికి రోడ్డు సౌకర్యం కలిపించి మా బతుకులలో వెలుగుచూపిన జిల్లా ఎస్పి గారు మాకు దేవుడి తో సమానం అని ఆయనకు జన్మాంతం రుణపడి ఉంటాం అని ,ఒక సారి రోడ్డు నిర్మాణం పూర్తి అయిన మా కష్టాలు దూరం అవుతాయి అని తెలిపారు. ఈ కార్యక్రంలో కాగజ్ నగర్ డీఎస్పీ హబీబ్ ఖాన్, తిర్యాణి ఎసై బుద్దే స్వామీ, జైనూర్ సీఐ, ఎస్బి సీ ఐ వెంకటేశ్వరులు, ఎస్బి ఎసై శివకుమార్ తిర్యాణి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment