Monday, 17 April 2017

హలో నిరుద్యోగి ఛలో ఉస్మానియా.. ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్


హలో నిరుద్యోగి ఛలో ఉస్మానియా..
ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) ఏప్రిల్  17 ;  రాష్ట్రంలో విద్యార్థులు,యువకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని విద్యార్థి సంఘాల ఆద్వర్యంలో నేడు జరిగే ధర్మయుద్ధం ఉస్మానియాలో బహిరంగ సభ నిర్వహిస్తున్నమని ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ తెలియజేశారు. రెబ్బెనలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్స్ ను వెంటనే విడుదల చేయాలని,ఉద్యోగ నియామకాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ ను రూపొందించి అమలు చేయాలని,రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలలో టీచింగ్ ,నాన్ టీచింగ్ సిబ్బందిని వెంటనే భర్తీ చేయాలని,ఉద్యోగ ఉపాధి అవకాశాలను విస్తృత పరచాలని,ప్రైవేట్ రంగంలో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి,యువజన సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆద్వర్యంలో ఈ నెల 18న ఉస్మానియాలో ధర్మయుద్ధం పేరిట బహిరంగ సభ నిర్వహిస్తున్నమని ఈ కార్యక్రమానికి విద్యార్థులు,యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఏఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు కస్తూరి రవికుమార్,డివిజన్ కార్యదర్శి పుదారి సాయి,మండల అధ్యక్షుడు మహిపాల్,కార్యదర్శి సాయి తదితరులు పాల్గొన్నారు.                                             

No comments:

Post a Comment