Friday, 14 April 2017

ఘనంగా అంబేద్కర్126 వ జయంతి వేడుకలు

ఘనంగా అంబేద్కర్126 వ జయంతి వేడుకలు

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) ఏప్రిల్  14 ;   డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ 126 వ  జయంతిని శుక్రవారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ మరియు ప్రవేట్ కార్యాలయాల్లో,ప్రజలు జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఆసిఫాబాద్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు.ర్యాలీ నిర్వహించి ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో  ముఖ్య అతిధులుగా  కలెక్టర్ చంపాలాల్, ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్, డి ఎస్ పి భాస్కర్ లు హాజరై మాట్లాడారు.  దళితులకు చేసిన సేవల గురించి మాట్లాడారు వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం పోరాడిన మహనీయుడు భారత రాజ్యాంగ కర్త  డాక్టర్ భీమ్రావు  అంబేద్కర్ అని అన్నారు.    రెబ్బెనలో బారి ర్యాలీ నిర్వహించి బస్టాండ్ ప్రాంగణంల్లో పతాక ఆవిష్కరణ చేశారు. గంగాపూర్ చౌరస్తాలోని విగ్రహానికి పూలమాలలు వేశారు. వివిధ కార్యాలయాల్లో చిత్ర పటానికి పూలమాలలు వేసి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మండలం లో గ్రామాలలో వాంకులం,నంబాల, గంగాపూర్, గొల్లేటి, రెబ్బెన, కొండపల్లి, ఖైర్గం, బూరుగుడ మొదలగు  గ్రామాలలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సంజీవ్ కుమార్,జడ్.పి.టి.సి. బాబూరావు,తహసిల్దార్ రమేష్ గౌడ్,సర్పంచ్ లు వేంకటమ్మ, రవీందర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకరమ్మ, ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్,  ఎంపిటిసి వనజ, అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు మొండయ్య,హన్మంతు, ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్, దుర్గం సోమయ్య, చిరంజీవి, భరద్వజ్, దేవాజి, రాజేష్ తధీతరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment