Sunday, 24 July 2016

కేటీఆర్ జన్మదిన సందర్భంగా మొక్కలు నాటిన సేవా సంస్ధ

కేటీఆర్  జన్మదిన సందర్భంగా మొక్కలు  నాటిన  సేవా సంస్ధ

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); కేటీఆర్  జన్మదిన సందర్భంగా స్నేహ కల్చరల్ ఆర్ట్స్ &సేవా సంస్ధ వారు  రెబ్బెన మండలం లోని గోలేటి గ్రామపంచాయితీ లో ఆదివారము  రోజున  ఐ టి డిఎ  ప్రాధమిక పాఠశాల అవరణలో మొక్కలు  నాటారు. అనంతరం పాఠశాల విద్యార్థులు  మిఠయిలు పంచుకోని వేడుకలు జరుకున్నారు. ఈ సందర్భంగా  అసిపాబాద్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్, స్నేహ కల్చరల్  సంస్ధ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ   మాట్లాడుతు ఈ రోజున కేటీఆర్ జన్మదిన సందర్భంగా మొక్కలు నాటామ్మన్నారు విద్యార్థలకు చిన్నతము నుంచే పర్యావరణాన్ని కాపాడేవిధంగా మొక్కలు నాటే అలవాటు చేసుకోవాలని  అవగాహన కలిపించారు. అనంతరం విద్యార్థులు పచ్చదనం ప్రగతికి మెట్లు అని నినాదాలు చేస్తూ ప్రధాన వీధులగుండా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  అధ్యక్షులు బి గోపాలకృష్ణ , బానోత్ దేవయ్య , బోయిని శంకరమ్మ , యల్ ప్రభాకర్ , రమేష్ , నాగయ్య , స్వామి తదితరాలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment