ఎం సెట్ -2 లీకేజి కి భాద్యులైన వారిని కఠినంగా శిక్షించాలి -
ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ఎం సెట్ -2 లీకేజికి భాద్యులైన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ అన్నారు . శనివారం రాష్ట్రీయ రహదారిపై ప్రభుత్వ దిష్టి బొమ్మను చేశారు . ఆయన మాట్లాడుతూ తెలంగాణ ,అంటూ అక్రమాలు లేవంటూ గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ముఖ్య మంత్రి కె సి ఆర్ ఇప్పుడు మాట్లాడడం ఎందుకు లేదని పేర్కొన్నారు . లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని శిక్షణ తీసుకొన్నారని కో, ఇప్పుడు కొంతమంది తప్పు చేయడముతో ఎంతో మంది విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని తెలిపారు . మల్లి పరీక్షలు నిర్వాహిస్తే రాంకులు వస్తాయో లేదో అని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని అన్నారు . ఎంసెట్ -2 కు భాద్యులైన ఎంసెట్ కన్వీనర్ రామన్న రావు , రాజగోపురం పై క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు . రెండు సార్లు ప్రవేశ పరీక్షలు పెట్టి టి ఆర్ ఎస్ ప్రభుత్వం విఫలమైందని తెలిపారు . నిర్లక్ష్య ధోరణి ప్రభుత్వం ప్రవేశ పరీక్షలు నిర్వహించడముతో ప్రతిభావంతులైన విద్యార్థులు నష్టపోతున్నారని అన్నారు . విద్యార్థుల జీవితాలతో ఆటలాడు కోవడం ప్రభుత్వాలకు మంచిది కాదని హితవు పలికారు . ఈ కార్య క్రమములో మండల కార్యదర్శి పుదారి సాయి , నాయకులూ శ్రీకాంత్ . మహేష్ , సాయి , శ్రీనివాస్ , నాగరాజు లు ఉన్నారు.
No comments:
Post a Comment