ఎన్ స్ యూ ఐ చలో క్యాంపస్ యాత్రను విజయవంతం చేయండి ; దుర్గం భరద్వాజ్
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); విద్య సంస్థల సమస్యల ఫై చేపట్టిన చలో క్యాంపస్ యాత్రను విజయ వంతం చేయాలనీ ఎం స్ యూ ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం భరద్వాజ్ అన్నారు. రెబ్బెన జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో కరపత్రాలను విడుదల చేసి అనంతరం మాట్లాడారు. విద్యాసంస్థల సమస్యలపై ప్రభుత్వం విఫలం అయ్యేందని కేజీ టూ పిజి పాఠశాలలో అమలు చేయుటకు మరియు మొదలగు విద్య సంస్థల సమస్యలు ఎన్ స్ యూ ఐ ద్వారానే పరిష్కారం అవుతుంది అని అన్నారు. ఈ నెల 27 తేదీ నుంచి మొదలైన చలో క్యాంపస్ యాత్ర 1తేదీ వరకు మంచిర్యాలకు చేరుతుంది . విద్య సమస్యలపై పోరాడే యాత్ర ఆగస్టు 7 తేదీన ఓ యూ ఆర్ట్స్ కాలేజీలో ముగుస్తుంది . అయితే ఈ యాత్రకు ప్రతి ఒక్కరు సహకరించి విజయ వంతం చేయాలనీ పిలుపు నిచ్చారు. ఈ కార్య క్రమంలో ఎన్ స్ యూ ఐ మండల అధ్యక్షులు ముజాయిద్ , జుబేర్ నాయకులూ రజిని కాంత్ ,లింగయ్య ,శ్రీకాంత్ ,రాజశేఖర్ ,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment