Monday, 11 July 2016

కార్మికుల సమస్యలపై పోరు యాత్ర - సీతా రామయ్య

కార్మికుల సమస్యలపై పోరు యాత్ర - సీతా రామయ్య 




 రెబ్బెన: (వుదయం ప్రతినిధి); సింగరేణి  కార్మికుల సమస్యల పోరు యాత్ర కొనసాగిస్తున్నట్లు ఏ ఐ టి యు సి ప్రధాన కార్యదర్శి వాసి రెడ్డి సీత రామయ్య అన్నారు . బెల్లంపల్లి ఏరియా రెబ్బెన మండలంలోని గోలేటి  లోని డోర్లి గని  నుండి సంగరేణిలో పోరుయాత్ర సభలో సోమవారం ఆయన మాట్లాడారు. సింగరేణిలో గుర్తింపు సంఘం కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. టీబీజీకేఎస్‌ గుర్తింపు సంఘంగా ఎన్నికై నాలుగు సంవత్సరాలు పూర్తి కావస్తున్నప్పటికి కార్మికులకు సంబంధించిన ప్రధాన సమస్యల్లో ఏ ఒక్కటి పరిష్కరించలేకపోయిందని అన్నారు. చిన్నచిన్న సమస్యలను పరిష్కరించి తామేదో గొప్పలు సాధించినట్లుగా ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్నారని పేర్కొన్నారు. మరో ఆరునెలల్లో సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో ప్రభుత్వం కార్మికులను మాయచేసేందుకు కుట్రపన్నుతుందని విమర్శించారు. సకల జనుల సమ్మె వేతనాలు ఇవ్వడములో , కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు ఇవ్వడములో టి బి జి కె ఎస్ పూర్తిగా విఫలమైందని తెలిపారు . కార్మికుల సమస్యలను తెలియజేయడం కోసం ఈ పోరు యాత్ర ను సాగిస్తున్నట్లు , ఈ నెల 17 వరకు ఉంటుందని 18 న కొత్తగూడెం హెడ్ ఆఫీస్ లో మాహా సభ ఉంటుందని పేర్కొన్నారు . కార్మికులంతా ఒక్కటేనని , కార్మిక భలం తెలియ జేయాలన్త్వే అందరూ పెద్దస మొత్తములో తరలి వఛ్చి జయప్రదం చేయాలని అన్నారు . అనంతరం  పోరు యాత్ర వాహనాన్ని ప్రారంభిచి ,  గోలేటి లో మోటారు సైకిళ్లపై ర్యాలీ నిర్వహించారు .ఈ సమావేశములోరాష్ట్ర నాయకులు యై గట్టయ్య , అడిషనల్ ప్రధానకార్యదర్శి రంగయ్య , సి పి ఐ  జిల్లా ప్రధాన కార్యదర్శి కలవేణి శంకర్ , గోలేటి బ్రాఞ్చ కార్యదర్శి ఎస్ తిరుపతి , నాయకులు బయ్యా మొగిలి , జగ్గయ్య , చిప్ప నర్సయ్య , శేషు , సంపత్ , శోకాలు శ్రీనివాస్ , రామారావు తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment