Friday, 29 July 2016

. మత్స్యకారులను ఆదుకోవాలి అధికారులకు వినతి

. మత్స్యకారులను ఆదుకోవాలి అధికారులకు  వినతి 




రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని మత్స్యకారులు 30  సంవత్సరాల నుండి మండలంలో ఉన్న చిన్నచిన్న చెరువులలో చేపలు వేసి వాటిని పెంచి వాటినే జీవనాధారంగా చేసుకొని బ్రతుకుతున్నామని కొందరు అడ్డు పడుతూ పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తున్నారని నంబాల గ్రామానికి చెందిన మత్స్యకారులు రెబ్బెన తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించచారు. ఉప తహసీల్దార్ రాంమోహన్ రావుకు వినతి పత్రము అందజేశారు. మత్స్యకారసంఘం అధ్యక్షుడు బి సత్యనారాయణ మాట్లాడుతు చెరువులలోచేపలు వేసి పెంచి వాటిపై మత్స్య కారుల కుటుంబాలు  జీవనోపాధి పొందుతున్నామని ప్రభుత్వం 2011 లోనే మమ్ములను మత్స్యకార సంఘం సొసైటీగా గుర్తించింది .  అలాగే 30సంవత్సరాల నుండి గ్రామా పంచాయితీకి రుసుములు చెల్లిస్తూ ఉండగా కొందరు అక్రమంగా పెత్తనం చెలాయిస్తూ మాకు  జీవనోపాధి లేకుండా చేస్తున్నారని అన్నారు , కావున ఉన్నత అధికారులు మత్స్యకారుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు .  వీరికి నంబాల యం పి టి సి కొవూరి శ్రీనివాస్ మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో మత్స్య కార సంఘం ఉపాధ్యక్షులు బి బాను ప్రసాద్ కార్యదర్శి బి పోచయ్య , మరియు కార్యవర్గ సభ్యులు సురేష్ , పోచయ్య , లక్ష్మణ్ , పోచం , రమేష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment