14న విద్యాసంస్థల బందును విజయవంతం చేయండి; దుర్గం రవిందర్
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ప్రభూత్వ విద్యారంగ సమష్యలు పరిష్కరించాలని , ప్రైవేటు విద్యాసంస్థల ఆగడాలను అరికట్ట్టాలని వామపక్ష విద్యార్ధ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 14న తలపెట్టిన విద్యాసంస్థల బందు విజయవంతం చేయాలని ఎ ఐ యస్ యఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవిందర్ అన్నారు రెబ్బెన మండలం గోలేటి కె యల్ మహేందర్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు . టి ఆర్ యస్ ప్రభుత్వ ప్రభుత్వ విద్యారంగంలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలం అయిందన్నారు . అలాగే పాఠశాల లో ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తి చేయకపోవడం తో విద్యార్థుల సంఖ్య తగ్గు ముఖం పడుతుందని , కావున ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తి చేయాలని అన్నారు. మధ్యాహ్న భోజనం, సంక్షేమ వసతి గృహాలలో పిల్లలకు పెడుతున్న భోజనం లో నాణ్యత లోపం ఉందన్నారు, అలానే వసతి గృహాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తి చేయాలన్నారు. ప్రైవేట్ పాఠశాలలో కనీస వసతులు లేకుండా ఫిజుల పేరులతో వేలాది రూపాయలు వసులు చేస్తున్నారని అన్నారు మండల విద్యార్థి అదికారులు పరోక్షంగా ప్రైవేట్ పాఠశాలలకు మద్దతు పలుకుతూ ప్రభుత్వ పాఠశాలలను మరుగున పడేస్తున్నారు ప్రైవేట్ స్కూళ్లలో పుస్తకాల సామాగ్రిలా పేరుతో దండుకుంటున్నారు. వామపక్ష విద్యార్ధ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 14న తలపెట్టిన విద్యాసంస్థల బందు విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశం లో కె సాయి,చరణ్ ,ప్రేమ్ సాగర్ ,అశోక్,పుదారి సాయి,కస్తూరి రవి ,మహిపాల్ ,శేఖర్ ,రాజు, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment