రెబ్బెన: (వుదయం ప్రతినిధి); సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏ ఐ టి యు సి ఆధ్వర్యంలో నేటి నుంచి జరిగే పోరుయాత్ర ను కార్మికులు సమస్యల పరిష్కారానికై మద్దతు పలకాలని ఏ ఐ టి యు సి గోలేటి బ్రంచ్ కార్యదర్శి యస్ తిరుపతి అన్నారు. ఆదివారం రెబ్బెన మండలం గోలేటి ఏ ఐ టి యు సి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. నేటి నుంచి జరిగే పోరుయాత్ర ను కార్మికుల ఏరియా లో తిరుగుతూ కార్మికుల సమస్యలను తెలుసు కుంటు వారి సమస్యల పరిష్కారానికై ఏ ఐ టి యు సి ముందుంటుందన్నారు 18 న కొత్తగూడెం ప్రధాన కార్యాలము ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు . ఈ ధర్నాను పార్టీలకు అతీతంగా అధిక సంఖ్యలో పాల్గొనాలని అన్నారు . ఈ కార్య క్రమములో నాయకులు బయ్యా మొగిలి , సంపత్కుమార్ , సత్యనారాయణ ,రాజేష్ నర్సింగరావు , తదితరులు పాల్గొన్నారు .
No comments:
Post a Comment