Thursday, 7 July 2016

రెబ్బెన లో రంజాన్ సంబరాలు

రెబ్బెన లో రంజాన్ సంబరాలు 
రెబ్బెన లో రంజాన్ సంబరాలు 



రెబ్బెన: (వుదయం ప్రతినిధి); నెలరోజుల ఉపవాసాల అనంతరం నెలవంక కనిపించిన అనంతరం పవిత్ర రంజాన్‌  పర్వదినం ను పురస్కరించుకుని  గురువారం నాడు రెబ్బెన మండలంలోని ఈద్గా వద్ద ప్రార్థనలు చేశారు. ఈ  సందర్భంగాముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో ఈద్గాల వద్ద చేరుకొని ప్రార్థనలు చేశారు.సర్వ మానవాళి క్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ప్రత్యేక ప్రార్థనల కోసం చేసిన ఏర్పాట్లను ముస్లిం మత పెద్దలు  ముస్లింలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ ఏర్పాట్లు చేశారు. పండుగ రోజు బంధువు, మిత్రులను కలిసి ముస్లిం సోదరులు ఆలింగనము చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు.ఈసందర్బంగా ముస్లీం సోదరులకు రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ఈద్గాల వద్దకు వెళ్లి రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఈద్గాల వద్ద హరిత హారములో భాగంగా మొక్కలు నాటారు . 

No comments:

Post a Comment