Wednesday, 6 July 2016

రెబ్బెనలో గ్రామసభ

రెబ్బెనలో గ్రామసభ 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  రెబ్బెన గ్రామ పంచాయితీలో నిర్వహించిన గ్రామ సభలో  గ్రామ ప్రజలు అంతర్గత రోడ్లు అద్వాన్నంగా ఉన్నాయని , గ్రామాధికారులను నిలదీశారు . మంగళ వారము నిర్వహించిన గ్రామ సభలో  మురికి కాలువలు రోడ్లపై వర్షం కురిసిన నీరు  నిలుచి  నడవడానికి చాలా ఇబ్బందిగా ఉందని అన్నారు . అర్హులైన వారికి  పెన్షన్లు , మరుగు దొడ్ల బిల్లులు , ఇంకుడు గుంతల బిల్లులు రాలేదని ప్రజలు తెలిపారు . కార్యదర్శి మురళీధర్ మాట్లాడుతూ పెన్షన్ల బిల్లులు , మరుగు దొడ్ల బిల్లులు రాణి వారికి త్వరలోనే వస్తాయని అన్నారు . వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని మురికి కాలువలు శుభ్రం చేశామని , బిలీచింగ్ పౌడర్ చల్లమని అన్నారు బురద అయ్యే రోడ్లపై మట్టిని పోపించి బురద కాకుండా చేస్తామని ,ప్రజలు యొక్క సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం తీర్మానం చేయించి పనులు సకాలంలో చేస్తామన్నారు అలాగే వర్ష కాలం దృష్టిలో ఉంచుకుని నీరు కలుషితం కాకుండా బావులలో  బిలీచింగ్ పౌడర్ ను వెయ్యాలని పౌడర్ పొట్లాలను  ప్రజలకు పంచిపెట్టారు   ఈ కార్య క్రమములో సర్పంచ్ వెంకటమ్మ , వైస్ ఎం పి పి   జి రేణుక , ఏ  పి  ఎం వెంకటరమణ ఎఫ్ ఏ తుకారాం,ఏ ఎన్ ఎం లు ,అంగన్వాడీ కార్యకర్తలు,పాఠశాల ప్రధాన ఊపాద్యాయులు ,వార్డ్ మెంబర్లు తదితరులు గ్రామప్రజలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment