హరిత హారంలో మేము ముందుంటాం ; కళాశాల విద్యార్థులు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); హరిత హారంలో మేము ముందుంటామని రెబ్బెన ప్రభుత్వ కళాశాల యూవతి యువకులు నినాదాలు చేస్తూ నూతనంగా నిర్మించినా కళాశాల భవనం వరకు సుమారు రెండు కిలో మీటర్లు కాలినడకన ర్యాలీ నిర్వహించారు. కళాశాల ప్రిన్స్ పాల్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేసి ఆర్ కలలు కన్నా బంగారు తెలంగాణ సాధ్యం కావాలంటే ప్రతి గ్రామం పచ్చదనంతో నిండి హరిత హారంలో భాగంగా రాష్ట్రమంతటా హరిత వనంకావాలని కొత్త కళాశాల చుట్టూ విద్యా బోధకులు మరియు విద్యార్థులు చెట్లు పెట్టి పచ్చదనాన్ని నింపారు ఈ కార్యకరంలో విద్యా బోధకులు రాజకుమార్, ప్రవీణ్, గంగాధర్, ప్రకాష్, అమరేందర్ రెడ్డి, శ్రీనివాస్, రామారావ్, జాన్సీ , మంజుల, మల్లీశ్వరి, సంధ్య రాణి, శాంత మరియు విద్యార్థులు పాలుగోన్నారు.
No comments:
Post a Comment