మొక్కలతో ప్రాణవాయువు లభిస్తుంది ; యం ఎల్ ఎ కోవ లక్ష్మి
మొక్కలతో ప్రాణవాయువు లభిస్తుందని యం ఎల్ ఎ కోవ లక్ష్మి అన్నారు రెబ్బెన గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణంలో రెండో విడత హరిత హర భాగంగా మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి తలపెట్టిన మహాత్సర కార్యాన్ని ప్రతి ఒక్కరు తమ వంతు భాద్యతగా మొక్కలు నాటుతూ సమాజ శ్రేయస్సు కు పాటుపడాలన్నారు ఇప్పుడు నాటిన మొక్కలను సంరక్షిస్తే రేపటి వృక్షాలు అవుతాయి . వాటితో సమస్త జీవకోటి మానవాళికి ప్రాణవాయువు , భూగర్భ జలాలు కాపాడుకునే వారిమి అవుతామన్నారు . అలాగే అడవిని పెంచినట్లయితే వన్యప్రాణుల ను సంరక్షి చించిన వారమౌతాము . మొక్కలు వృక్షాలైతే వాటి నీడలో ప్రాణులు సేద తిర్చుకోవచ్చని అన్నారు . ఈ కార్యక్రమంలో యం పిపి కార్నతం సంజీవ్ కుమార్ , జడ్ పిటిసి బాబురావు , సర్పంచ్ పెసరు వెంకటమ్మ , వైస్ యం పిపి గొడిసెల రేణుక , తహసీల్దార్ బండారి రమేష్ గౌడ్ , యంపిడిఓ లక్ష్మి నారాయణ , మార్కెట్ కమిటీ వైస్ చేర్మెన్ కుందారపు శంకరమ్మ ,టిఆర్ యస్ జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ కుమార్ జైశ్వాల్ , ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ కుమార్ , టి ఆర్ ఐ జిపి ఎపియం రాజ్ కుమార్ , టిఆర్ యస్ మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి , కోఆఫ్సన్ సభ్యుడు జాకిర్ ఉస్మాని , టౌన్ అధ్యక్షుడు రాపర్తి అశోక్ , నాయకులు చిరంజీవి గౌడ్ , సుదర్శన్ గౌడ్ , డి భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు .
No comments:
Post a Comment