విద్యా సమస్యలపై బంద్ విజయవంత చేయండి -పుదారి సాయికిరణ్
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ప్రభూత్వ విద్యారంగ సమష్యలు పరిష్కరించాలని వామపక్ష విద్యార్ధ సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన విద్యాసంస్థల బందును విజయవంతం చేయాలని రెబ్బెన ప్రభుత్వ పాఠశాలలో బుధవారం గోడపత్రాలు విడుదల చేశారు. నేడు జరగ బోయే బంద్ ని విజయవంతం చేయాలని ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు పుదారి సాయి మాట్లాడారు. పాఠశాల లో ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తి చేయకపోవడం తో విద్యార్థుల సంఖ్య తగ్గు ముఖం పడుతుందని , కావున ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తి చేయాలని అన్నారు. మధ్యాహ్న భోజనం, సంక్షేమ వసతి గృహాలలో పిల్లలకు పెడుతున్న భోజనం లో నాణ్యత లోపం ఉందన్నారు. వామపక్ష విద్యార్ధ సంఘాల ఆధ్వర్యంలో నేడు విద్యాసంస్థల బందును విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశం లో మహిపాల్, సాయి,చరణ్, ప్రేమ్ సాగర్ ,అశోక్, రవి, శేఖర్, రాజు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment