Thursday, 14 July 2016

సంక్షేమ వసతి గృహాలపై చిన్నచూపు ;పుదారి సాయికిరణ్

సంక్షేమ వసతి గృహాలపై చిన్నచూపు ;పుదారి సాయికిరణ్


తెలంగాణ ప్రభుత్వంసంక్షేమ వసతి గృహాలపై చిన్నచూపు చూస్తూ విద్యాకాలం మొదలైన ఇంతవరకు వసతి గృహాల విద్యార్థులకు పుస్తకాలు తగు సామాగ్రి అందజేయకుండా నిర్లక్ష్యo  వహిస్తున్నారని  ఏ ఐ  ఎస్ ఎఫ్ మండల కార్యదర్శి  పుదారి సాయికిరణ్  మంగళవారం రెబ్బెన లోని బి సి వసతి గృహంలో ధర్నా నిర్వహించి  అడిగి తెలుసుకుని  మాట్లాడురు.   ప్రభుత్వం సంక్షేమ వసతి వసతి గృహాల్లో సమస్యలు  ఉన్నాయని సమస్యలు పరిష్కరించకపోవడం వలన విద్యార్థులు సంఖ్య  క్రమంగా తగ్గి హాస్టళ్లు మూసివేయుటకు దారి తీస్తున్నాయని అన్నారు.  రెబ్బెన లోని  బి సి  వసతి గృహంలో చివరి సంవత్సరం వరకు ఎస్ సి  హాస్టల్ కొనసాగించారని చుట్టపు చూపు ప్రదర్శిస్తూ  వసతి గృహానికి రావడం లేదని అన్నారు.  విద్యార్థులను రాత్రి సమయములో ఉండాల్సిన వార్డెన్ వాచ్  మెన్ లేకపోవడం వలన విద్యార్థులు బిక్కు బిక్కు మంటూ సమయం వెల్లడిస్తున్నారు నిరుపయోగం గా వున్న మరుగుదొడ్లను పట్టించుకునే వారే లేరని దాని వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్నారని అన్నారు.  జిల్లా వ్యాప్తంగా వున్న వసతి గృహాల్లో వార్డెన్ వాచ్ మేం వంటి పోస్ట్లు ఖాళీగా ఉన్నాయని దాని వల్ల హాస్టల్ విద్యార్థుల సంఖ్య తగ్గి హాస్టళ్లు మూసి వేటకు దారి తీస్తున్నాయని అన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే వసతి గృహ సమస్యలు పరిష్కరించాలని కోరారు .  ఈ కార్యక్రమంలో ,నాయకులు తిరుపతి, కిషోర్ కుమార్ అభిలాష్ ,సాయి ,సుభాష్ ,నవతేజ, తదితరులు  పాల్గొన్నారు.

No comments:

Post a Comment