విద్యార్థుల ఆధ్వర్యంలో హరిత హారం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు శుక్ర వారం రోజున ప్రధాన రోడ్డు పై హరిత హారంలోని మొక్కల ప్రత్యేకత పై ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాళి స్థలాల్లో మొక్కలు నాటారు. మండలంలో 12 గ్రామాలు ఉన్నాయని ప్రతి గ్రామానికి 40 వేల మొక్కలు నాటాలని పూర్తి మండలం లో 2.40.000 మొక్కలను నాటాల్సిందిగా అధికారుల ఆదేశాలు ఉన్నాయని ఈ సందర్బంగా స్థానిక సర్పంచ్ పెసరు వెంకటమ్మ అన్నారు. ప్రతి గ్రామంలోని వారు ఇంటింటా కనీసం 5 మొక్కలు నాటుతే మానవాళికి రక్షణ కలుగుతుందని ప్రధాన ఉపాద్యాయురాలు స్వర్ణలత తెలిపారు . ఇందులో భాగంగా పలు విద్య సంస్థల విద్యార్థులు చెట్లు పెట్టి పచ్చదనాన్ని నింపారు ఈ కార్యకరంలో విద్య బోధకుడు సదనందం,దేవేందర్,రవి,తోపాటు విద్యార్థులు పలుగున్నారు.
No comments:
Post a Comment