సింగరేణి బెల్లంపల్లి ఏరియాలో సంక్షేమానికి పెద్ద పీట
(రెబ్బెన వుదయం ప్రతినిధి) సింగరేణి బెల్లంపల్లి ఏరియాలోకార్మికుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నట్లు
బెల్లంపల్లి ఏరియా జి ఎమ్ రవిశంకర్ అన్నారు. రెబ్బెన మండలంలోని గోలేటి జి ఎమ్ కార్యాలయం లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. రానున్నన రోజుల్లో బొగ్గు ఉత్పత్తితో పాటు పటు కార్మికుల సంక్షేమం కోసం,ప్రతి నెల సేవ సమితి ఆధ్వర్యంలో , యోగా శిబిరాలు, ఆయుర్వేదిక శిబిరాలు ,నిరుద్యోగ యువతి యువకులకు ఉచితముగా కానిస్టేబుల్ ,ఆర్మీ ,వృత్తి కోర్సులకు శిక్షణ ఇస్తున్న మన్నారు . బెల్లంపల్లి ఏరియా లోని ఆసుపత్రుల భవన నిర్మాణం కోసం బడ్జెట్ కేటాయించి మరమత్తులు చేయిస్తామన్నారు అర్ ఓ అర్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి మంచినీటిని అందచేయడం జరుగుతుందన్నారు డోర్లి 1,2 మధ్య గుట్ట భాగంలో బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు తెలవడంతో గుట్ట భాగానికి డ్రిల్ చేసి నిక్షేపాలని వెలికి తీస్తామన్నారు అదేవిధముగా ఉపరితల గనులలో నుంచి బయటికి తోడే నీటి పంపులను మరమత్తు చేపించి మరియొక్క పంపులను అమర్చినట్లు తెలిపారు అలాగే బయటికి తోడేసిన నీటి గళాలో పేరుకుపోయిన ఇసుకను తీపించి శుభ్రం చేయించామన్నారు వచ్చే డిసెంబర్ నెలలో సి ఎచ్ పి ఏర్పాటు చేసి దుమ్ము దూళి ,మరియు ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చేస్తా మన్నారు గోలేటి 1 లో విదులు నిర్వహిస్తున్న బదిలీ కొరకు పెట్టుకున్న వారికీ వారి ఇష్టమున్న చోటికి బదిలిచేయడం జరుగుతుందన్నారు అలాగే విడతల వారీగా పంపించడం జరుగుతుంది అని అన్నారు బెల్లంపల్లి ఏరియా కు ఈ సంవస్తరం నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి కంటే ఎక్కవ అభివృద్ధి చెందింది అన్నారు ఈ కార్యక్రమంలో డి జి ఎం చిత్రంజన్ కుమార్, ఎస్వోటు జి ఎం కొండయ్య,ఐ ఇ డి యోహాన, డి వై పి ఎం . రాజేశ్వర్,అనురాధ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment