Thursday, 14 July 2016

మొక్కలతో జీవకోటి మానవాళికి ప్రాణవాయువు ; మంత్రి జోగు రామన్న

మొక్కలతో జీవకోటి మానవాళికి ప్రాణవాయువు ; మంత్రి జోగు రామన్న



 రెబ్బెన: జులై 14 (వుదయం ప్రతినిధి); మొక్కలతో సమస్త జీవకోటి మానవాళికి ప్రాణవాయువు లభిస్తుందని అందుచే మనం అందరం మొక్కలు నాటాలని మంత్రి జోగు రామన్న అన్నారు. గురువారం  రెండో విడత హరిత హర కార్యక్రమంలో భాగంగా కాలేజి ప్రాంగణంలో మొక్కలు నాటారు.రాష్ట్ర ముఖ్యమంత్రి తలపెట్టిన బృహత్తర కార్యక్రమాన్ని  ప్రతి ఒక్కరు తమ వంతు భాద్యతగా మొక్కలు నాటుతూ సమాజ శ్రేయస్సు కు పాటుపడాలన్నారు.ఇప్పుడు నాటిన మొక్కలను సంరక్షిస్తే రేపటికి వృక్షాలు అవుతాయని  . వాటితో  ప్రాణవాయువు లభిస్తుందని తెలిపారు , భూగర్భ జలాలు కాపాడుకునే వారిమి అవుతామన్నారు . అలాగే అడవిని పెంచినట్లయితే వన్యప్రాణుల ను సంరక్షి చించిన వారమౌతాము. మొక్కలు మనిషి జననం నుండి మరణం వరకు ప్రత్యక్షంగానూ,పరోక్షంగానూ ఉపయోగపడుతున్నాయి అన్నారు. తెలంగాణ జూన్ 2 ఆవిర్భావదినోత్సవం ముందు పోడు భూములు సాగుచేస్తున్న సన్నకారు చిన్నకారు రైతులు ఆర్హతాలిస్తామని 5ఎకరాలు మంజూరు చేస్తామన్నారు అదే పోదు భూములు అడ్డు పెట్టుకుని భూస్వాములు రిలెస్టేట్ చేసేవారికి చర్యలు తీసుకుంటామని అన్నారు . ఆదిలాబాద్ జిల్లా మొత్తం 86వేల మొక్కలు నటి ముందు వున్నాం అన్నారు .   నేటి మొక్కలే రేపటి వృక్షాలైతే వాటి నీడలో జీవ ప్రాణులు సేద తిర్చుకోవచ్చని ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్  అన్నారు. హరిత హారం లో నాటిన మొక్కలను సంరక్షిస్తే రేపటి వృక్షాలై మన తెలంగాణ హరిత తెలంగాణ మారుతుందని ఎం ఎల్ ఏ కోవా లష్మి అన్నారు .  ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ,మార్కెట్ చైర్మెన్ గంధం శ్రీనివాస్ ,డి ఎఫ్ ఓ వెంకటేశ్వర్లు,యం పిపి కార్నతం సంజీవ్ కుమార్, జడ్ పిటిసి బాబురావు  , సర్పంచ్ పెసరు వెంకటమ్మ ,  వైస్ యం పిపి గొడిసెల రేణుక , తహసీల్దార్ బండారి రమేష్ గౌడ్, యంపిడిఓ లక్ష్మి నారాయణ , మార్కెట్ కమిటీ వైస్ చేర్మెన్ కుందారపు శంకరమ్మ ,టిఆర్ యస్ జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ కుమార్ జైశ్వాల్ ,   ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ కుమార్ ,   టి ఆర్ ఐ జిపి ఎపియం రాజ్ కుమార్ ,ఎం ఈ ఓ వెంకటేశ్వర్లు, టిఆర్ యస్ మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి , మండల,సర్పంచులు ,ఎం పి టి సి లు ,విద్యార్థులు , నాయకులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment