Sunday, 30 April 2017

అగ్నిప్రమాదం జరిగిన కుటుంబాలకు అర్దక సహాయం అందజేత

అగ్నిప్రమాదం జరిగిన కుటుంబాలకు అర్దక సహాయం అందజేత

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 30 ; (వుదయం ప్రతినిధి) ;   రెబ్బెన మండలంలో నార్లపూర్ గ్రామానికి చెందిన దుర్గం సోంబాయి దుర్గం శంకర్ దుర్గం రాంచందర్ దుర్గం మహేందర్ దుర్గం క్రిష్ట. దుర్గం లక్ష్మన్ జాడి లక్ష్మయ్య చెందిన 7 కుటుంబాల ఇంళ్లు  శనివారం రోజున అగ్నికి అహుతి అయ్యాయి. అదివారం కొమ్రం భీం జిల్లా బాజాపా అద్యక్షుడు  జే బి పొడేల్ కుటుంబాల ను పరామర్శించి ఆర్థిక సహయంతో పాటు క్వింటల్ నర బియ్యం వంట సామాగ్రిలను అదించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్థికంగా నష్ట పోయిన కుటుంబాలకు ప్రభుత్వం తరుపున మూడు ఎకరాల భూమీతో పాటు   రెండు పడకల ఇళ్లను మాంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తెరాస ప్రభుత్వం ప్రకటిచింన పథకాలను అమలు చేయటమం లో విఫలం అయిదన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షడు కుందారపు బాలకృష్ణ, చక్రపాణి, ఆశుముఖే లాల్ తదితరులు పాలుగునారు.

భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శిగా చెర్ల మురళి

భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శిగా చెర్ల మురళి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 30 ; (వుదయం ప్రతినిధి) ;  బారతీయ జనత పార్టీ కుమ్రంభీం జిల్లా ప్రధాన కార్యదర్శి గా ఆసిఫాబాద్ కు చెందిన చెర్ల మొరళి ని ఏకగ్రీవంగా ఏన్నుకున్నట్లు కొమ్రం భీం జిల్లా బాజాపా అద్యక్షుడు  జే బి పొడేల్ తెలిపారు.  ఈ సందర్భంగా ఎన్నికయిన చెర్ల మొరళి మాట్లాడుతూ భాజాపా పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తామన్నారు. 2019 సంవత్సరం లొ అధికారమే లక్ష్యం గా ముందుకు సాగుతామన్నారు మోధీ నాయకత్వం దేశం అభివృద్ధి చెందు తుందన్నారు. తన ప్తె నమ్మకంతో తనకు జిల్లా ప్రధనా కార్యదర్శి గా ఎన్నికున్నందుకు జిల్లా అధ్యక్షుడు పొడేల్, కేసరి ఆంజనేయ గుడ్ ,బోవనగిరి సతీష్ బాబు, నమిత డాలీ, కృష్ణ కుమారి లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. 

Saturday, 29 April 2017

శివాలయ వార్షికోత్సవం సందర్బంగా ప్రత్యేకపూజలు

శివాలయ వార్షికోత్సవం సందర్బంగా ప్రత్యేకపూజలు 

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  ఏప్రిల్  29 ; (వుదయం ప్రతినిధి) ;   రెబ్బెన మండలం నంబాలలోని శ్రీ ప్రసన్న పరమేశ్వరాలయం ఆలయ వార్షికోత్సవం సందర్బంగా శనివారం ఆలయ వార్షికోత్సవ ఉత్సవం ఘనంగా  నిర్వహించారు.  ఈ సందర్బంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శివుడి కి రూద్రాభిషేకం,మృత్యుంజయ హోమం,రుద్రహోమం పశుపతి హోమంలను జరిపారు ఈ పూజలను వీక్షించడానికి మండలం లోని ప్రజలు భారీ సంఖ్యలో హాజరు అయి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.  ఈ కార్యక్రమం లో నంబాల సర్పంచ్ గజ్జెల సుశీల , సింగిల్ విండో డైరెక్టర్ గజ్జెల సత్యనారాయణ ,   ఆలయ కమిటీ అధ్యక్షులు పూదరి వెంకటేష్, కమిటీ సభ్యులు పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.   

దారి మ్తెసమ్మ గుడికి భూమి పూజ

దారి మ్తెసమ్మ గుడికి భూమి పూజ

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  ఏప్రిల్  29 ; (వుదయం ప్రతినిధి) ;  రెబ్బెన మండలంలోని ఇందిరా నగర్ సమీపంలో గల దారి మ్తెసమ్మ గుడి కోసం శనివారం భూమి పూజ చేశారు. గత కొంతకాలం గా స్దానిక రెబ్బెన మండలము లొని త్రీవిలర్ & ఫోర్ విలర్ ఆటో ట్రాలీ సంక్షేమ సంఘంవారు మ్తెసమ్మ పూజలు  చెస్తున్నారు అదే గ్రామానికి చెందిన గోగర్ల రమేష్ గూడి కోసం మూడు గుంటల భూమిని దానం చేయాడానికి ముందుకు రావడం తో గుడి నిర్మాణం చెప్పటినట్లు వారు పేర్కొన్నారు.  ఈ కార్యక్రమం లో జడ్పి టి సి అజ్మెర బాపు రావు ఎం పి పి  కార్నధం సంజీవ్ కుమార్ ఆసిఫాబాద్ మార్కెట్ కమిటి వ్తెస్ చెర్మన్ కుందారం శంకర్మ, సర్పంచ్ పెసరు వెంకటమ్మ. ఉప సర్పంచ్  బోమ్మినేని శ్రీధర్ నవీన్ కుమార్ జ్తేశ్వల్  చెన్నసోమశేఖర్ మోడెం సుధర్శన్ రాపర్తి అశోక్ పెసరు మధునయ్య మాడిశేటి శంకర్  రాపాల శ్రీనివాస్ సోల్లు లక్ష్మి కార్నధం పెంటయ్య చంద్రయ్య స్వరూప వివిధ మండలాలోని పూజారులు పాల్గొన్నారు.

అగ్ని ప్రమాదానికి బారి ఆస్తి నష్టం

       అగ్ని ప్రమాదానికి బారి ఆస్తి నష్టం 


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  ఏప్రిల్  29 ; (వుదయం ప్రతినిధి) ;   రెబ్బెన మండలం లోని నారాయణపుర్ ఏ సి కాలనీలో  లో ప్రమాధవశాత్తు ఏడు ఇళ్లకు నిప్పు అంటుకొని బారి ఆస్తినష్టం జరిగినట్లు రెబ్బెన కార్యాలయ సిబ్బంది ఆర్ ఐ అశోక్ చౌహన్, గ్రామాధికారి ఉమ్ లాల్ లు  తెలిపారు. శనివారం ఉదయం సుమారు 11గంటల ప్రాంతం లో ఊరిలో బంధువుల ఇంట్లో పెళ్ళికి వెళ్లగా అకస్మాత్తుగా ప్రమాదం జరిగిందన్నారు. దుర్గం సోమయ్య, దుర్గం శంకర్, దుర్గం రాంచందర్, దుర్గం కృష్ణ, దుర్గం, లక్ష్మణ్  జాడి లక్ష్మయ్య  ఇల్లు పూర్తిగా దహనం అయ్యాయని పేర్కొన్నారు.  సుమారు నాలుగు లక్షల తొంబై రెండు వేల విలువైన  ఆస్తి  నష్టం జరిగిందని అన్నారు. ఆస్తితో పటు ముగా జీవులు ఆయన ఆవు,మేకలు కూడా ఉన్నట్లు స్థానికులు అంటున్నారు.  సంఘటన స్థలానికి ఆసిఫాబాద్ అగ్ని మాపక సిబ్బంది చేరుకునే లోపల పూర్తిగా దహనం అయి పోయాయి.  స్థానికంగా ఉన్న అగ్ని ని చల్లార్చారు సంఘటన స్థలానికి మండల నాయకులు  పరిశీలించి బాధితులకు స్వల్ప సహాయం కింద వంట సామగ్రి పంపిణి చేశారు. మండలం లో అగ్ని మాపక దళ శిబిరాలు కేటాయించాలని మండల వాసులు కోరుకుంటున్నారు.ఏ  విధమైన  అనుకోని అగ్ని  ప్రమాదాలు జరిగినపుడు దూర భారం నుండు అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు ప్రమాదం కాస్త జరిగిపోతుంది అని, మండలం లోనే అగ్ని మాపక సిబ్బంది ఉంటె సకాలంలో అరికట్టచ్చు అంటున్నారు.  

Friday, 28 April 2017

గీత కార్మికులను ఆదుకోవాలి

గీత కార్మికులను ఆదుకోవాలి 
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  ఏప్రిల్  28 ; (వుదయం ప్రతినిధి) ;    ఈతచెట్లు దహనం అయి గీతకార్మికులకు అన్యాయం జరిగిందని తెలంగాణ గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్ మంగళవారం రెబ్బెన తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ ఐ అశోక్ కి  వినతి పత్రం అందచేసి మాట్లాడారు. రెబ్బెన మండలంలోని దుగ్గపూర్ శివారులో అయిదు వందల ఈత చెట్లు ప్రమాదవశాత్తు అగ్గికి ఆహుతి అయ్యాయని దీనితో 15గీత కార్మికుల కుటుంబాలు జీవనాధారం కోల్పోతున్నారని వీరిని ప్రభుత్వం గుర్తించి ఉపాధి కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అరిగేలా మధుకర్ గౌడ్,కేసరి సాయి గౌడ్ కొయ్యడ సత్యనారాయణ గౌడ్ కే. నారాయణ, కే. కైలాసం గౌడ్, కే.లష్మినారాయణ గౌడ్, కే. శ్రీనివాస్ గౌడ్, కే.బాపు గౌడ్, కే. కిసాన్ గౌడ్, చేపూరి నవీన్ గౌడ్ తదితరులు ఉన్నారు.


    












  

ఆరోగ్యశ్రీని సద్వినియోగం చేసుకోవాలి

       ఆరోగ్యశ్రీని సద్వినియోగం చేసుకోవాలి 
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  ఏప్రిల్  28 ; (వుదయం ప్రతినిధి) ;     తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వo అమలుచేస్తున్న ఆరోగ్య శ్రీ పథకాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని  రెబ్బన మండలం పిహెచ్  సి పరిధిలో గల ఆరోగ్యమిత్ర లావణ్య అన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నిరుపేదలకు ఆరోగ్యం కోసం కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించడానికి ప్రవేశపెట్టబడిందన్నారు. ఆరోగ్యోశ్రీ ఈ పథకం ద్వారా గుండె, కిడ్నీ, క్యాన్సర్, ప్రమాద గాయాలు, ఆర్తో, పుట్టిన చిన్నపిల్లల, గర్భాశయం, చెవి, ముక్కు, గొంతు, న్యూరో, అపెండిక్స్, సంబందించిన మొదలగు 948 రకాల వ్యాధులకు ప్రభుత్వం 2 లక్షలవరకు ఖర్చు చేస్తూ ఉచితంగా శస్త్ర చికిత్స లు నిర్వచిస్తుంది అన్నారు. ఈ ఆరోగ్యశ్రీ పథకం పొందే అర్హులనవారు తమ తెల్ల రేషన్ కార్డ్, అంత్యోదయ కార్డు, అన్నపూర్ణ, జర్నలిస్ట్, టి ఏ పి ,ఆర్ ఏ పి మొదలగు కార్డులు కలవారు. ఈ ఆరోగ్యశ్రీ పథకానికి అర్హులు అవుతారని లావణ్య తెలిపారు.

ఉద్యానవనాలపై సమగ్ర సర్వే

              ఉద్యానవనాలపై సమగ్ర సర్వే  
  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  ఏప్రిల్  28 ; (వుదయం ప్రతినిధి) ;    ఉద్యానవనాలపై  రెబ్బెన మండలంలోని  గ్రామాలలో ఉద్యానవన పండ్ల  తోటలను పరిశీలించి  శుక్రవారం ఉద్యానవన అధికారి  ఎం ఏ నదీమ్ రైతులకు అవగాహనా కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చే రాయితీల గురించి తెలియ చేశారు. ఈ సందర్బంగా ఎం ఏ నదీమ్ మాట్లాడుతూ రెబ్బెన మండలంలోని నంబాల,నార్లాపూర్,కిష్టాపూర్, తాకాలపల్లి, పులికుంట గ్రామాలలో ఉద్యాన పంటల గణాంకాలను నిర్వహించి  రైతులకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలను వినియోగించుకొని  పండ్ల తోటలలో పంటలలో లాభాలు గటించాలి అని అన్నారు. పండ్ల తోటలపై రాయితీలు కావాలన్నవారు వారి యొక్క వివరాల నమోదు చేసుకోవాలని సూచించారు. వీరితో పటు హెచ్  ఈ ఓ  లు రమేష్,శంకర్ లు ఉన్నారు. 

Wednesday, 26 April 2017

నిత్యం మహంకాళికి పూజలు

నిత్యం మహంకాళికి పూజలు 

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  ఏప్రిల్  26 ; (వుదయం ప్రతినిధి) ;   రెబ్బెన  మండల కేంద్రం  లోని ఇందిరా నగర్ గ్రామంలో వెలసిన మహంకాళి దేవత అనునిత్యం అశేష పూజలు అందుకుంటుంది, మండలంలోని భక్తులే కాకుండా ఆసిఫాబాద్ , కాగజనగర్ , రెబ్బెన తాండూర్, తిర్యాణి, తదితర మండలాల నుండి ప్రతిరోజు భక్తులు వస్తూపోతూ ఉంటారు . గత నాలుగు సంవత్సరాల నుండి నిత్యం పూజారి దేవరా వినోద్ ఆధ్వర్యం లో జరుగుతుంటాయి. మీ 2వరకు జాతర జరగుతుందని ,   మే నెలలో న మహంకాళి దేవత పుట్టిన రోజు సందర్బంగా ప్రత్యేక పూజలు , కుంకుమార్చనలు నిర్వహించబడతాయని , చుట్టూ పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకోవాలని పూజారి వినోద్, ఆలయ కమిటీ అధ్యక్షలు మోడెమ్ తిరుపతి తెలిపారు.

ఆలయ వార్షికోత్సవానికి హాజరు కాగలరు

ఆలయ వార్షికోత్సవానికి హాజరు కాగలరు 

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  ఏప్రిల్  26 ; (వుదయం ప్రతినిధి) ;   రెబ్బెన మండలం నంబాలలోని శ్రీ ప్రసన్న పరమేశ్వరాలయం ఆలయ వార్షికోత్సవం సందర్బంగా ఈ నెల 29వ తేదీనాడు ఉదయం 09-10 గంటలకు ఆలయ వార్షికోత్సవ ఉత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ అధ్యక్షులు పూదరి వెంకటేష్ తెలిపారు.కావున ఈ సందర్బంగా ఆలయంలో ఏకాదశ,రూద్రాభిషేకం,మృత్యుంజయ హోమం,రుద్రహోమం పశుపతి హోమం,అను విశేష హోమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని  తెలియజేసారు.28వ తేదీనాడు శుక్రవారం రోజున ఏక్కహం ప్రారంభం అయ్యి 29వ తేదీ శనివారం వరకు కొనసాగుతుందని అన్నారు.హోమంలో పాల్గొనదలచిన భక్తులు ఈ క్రింది చరవాణి నంబర్ లను 9866003618, 9908748681, 9704112395 సంప్రదించాలని కోరారు.

గోలేటిలో మండల స్థాయి కబడ్డీ పోటీలు

గోలేటిలో మండల స్థాయి కబడ్డీ  పోటీలు 


 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  ఏప్రిల్  26 ; (వుదయం ప్రతినిధి) ;  రెబ్బెన మండలం గోలేటిలో ఈ నెల 30వ తేదీన  ముదగిరి రమేష్ స్మారక మండల స్థాయి  కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నామని ఈ పోటీలకు అండర్-16,పదహారు సంవత్సరాల లోపు అభ్యర్థులు  అర్హులు అని కబడ్డీ పోటీల ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు జి.వంశీ,వర్కింగ్ అధ్యక్షుడు జె.సంజయ్ లు తెలియజేసారు.ఈ నెల 30న ప్రారంభం అయ్యి మే నెల 3 వ తేదీ వరకు పోటీలు సాగుతాయని ఆసక్తి గల అభ్యర్థులు,టీమ్  లు నమోదు చేసుకోవాలని  కోరారు.పోటీలలో నెగ్గిన జట్టుకు  మొదటి బహుమతి గ 4500,ద్వితీయ బహుమతి 2500 ప్రైజ్ మనీ అందజేయడం జరుగుతుందని అన్నారు.ఈ క్రింది నెంబర్ లను 9052492113,8367442521,9908108962 సంప్రదించాలని కోరారు.ఈ సమావేశంలో కమిటి సభ్యులు శ్రీకాంత్,దిలీప్,అజయ్,రాకేష్,శివసాయి,తదితరులు ఉన్నారు.

Tuesday, 25 April 2017

తెలుగు దేశం పార్టీ రెబ్బెన మండల గ్రామ కార్యవర్గం ఎన్నిక

తెలుగు దేశం పార్టీ రెబ్బెన మండల  గ్రామ  కార్యవర్గం ఎన్నిక 
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  ఏప్రిల్  25 ; (వుదయం ప్రతినిధి) ;  తెలుగు దేశం పార్టీ గ్రామా కమిటీలను మంగళవారం రోజున రెబ్బెన అతిధి ఆవరణంలో ఎన్నుకున్నట్లు పార్టీ అధ్యక్షులు సంగేమ్ శ్రీనివాస్ తెలిపారు . కిష్టాపూర్ గ్రామ అధ్యక్షుడిగా దుర్గం రాము  , ఉప అధ్యక్షుడిగా ఎర్రం రాజయ్య, కార్యదర్శిగా దాగం దామోదర్ ని నియమించినట్లు తెలిపారు. ఆలాగే వాంకులం గ్రామానికి అధ్యక్షుడిగా కుక్కల వెంకటరాజం ఉప అధ్యక్షుడిగా పి .వెంకటి ప్రధాన కార్యదర్శిగా పెప్పెర బాబాజీ ఎన్నుకున్నారు. గంగాపూర్ గ్రామానికి అధ్యక్షుడిగా లెండుగురే నాందేవ్ ఉప అధ్యక్షుడిగా షిండే అన్నాజీ కార్యదర్శిగా పెద్దది మనోహర్ ఎన్నుకున్నారు. తక్కళ్లపల్లి గ్రామానికి అధ్యక్షుడిగా కోడిపె వెంకటేష్ ఉప అధ్యక్షుడిగా జంబి రవి కార్యదర్శిగా మాడే తిరుపతి రెబ్బెన గ్రామానికి అధ్యక్షుడిగా తక్షండే ధర్మారావు ఉపాధ్యక్షుడిగా తండి రమేష్ కార్యదర్శిగా గట్టుపల్లి కనకయ్య లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. మిగిలిన గ్రామాలకు మరో రెండు రోజులలో ఎన్నుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేంచేసిన మన తెలుగు దేశం జిల్లా మహిళ అధ్యక్షులు సొల్లు లక్ష్మి హాజరైనారు. ఈమెతో పటు  అజ్మీరా రమేష్ , అజయ్ జైస్వాల్ , వెంకటేష్, నవీన్ , పోతురెడీ, నానాజీ తదితరులు పాల్గొన్నారు. 

అంబెద్కర్ జయంతి ఉత్సవాల రెబ్బెనలో ఘనంగా

 అంబెద్కర్ జయంతి  ఉత్సవాల రెబ్బెనలో ఘనంగా 


 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  ఏప్రిల్  25 ; (వుదయం ప్రతినిధి) ;  అంబెద్కర్  జయంతి ఉత్సవాల సందర్బంగా రెబ్బెన మండల కేంద్రం లోని రోడ్డు భావన అతిధి గృహం లో అంబెద్కర్ సంఘ నాయకులూ  ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసారు. రెబ్బెన మండల కేంద్రం లోని రోడ్డు భావన అతిధి గృహం లో అంబెద్కర్ సంఘ నాయకులూ  ఏర్పాటుచేసిన సభలో  ముఖ్య అతిధులుగా ఎమ్మెల్యే కోవలక్ష్మి హాజరై దళితులకు చేసిన సేవల గురించి మాట్లాడారు. ముందుగా  భారీ  ర్యాలీ నిర్వహించి గంగాపూర్ చౌరస్తాలోని విగ్రహానికి పూలమాలలు  అంబేద్కర్ వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం పోరాడిన మహనీయుడు భారత రాజ్యాంగ కర్త  డాక్టర్ భీమ్రావు  అంబేద్కర్ అని అన్నారు.    రెబ్బెనలో  ఈ కార్యక్రమంలో ఎంపిపి సంజీవ్ కుమార్,జడ్.పి.టి.సి. బాబూరావు,తహసిల్దార్ రమేష్ గౌడ్, ఆర్ టి ఓ శ్యామ్  నాయక్, సర్పంచ్ లు రవీందర్  ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, వైస్ ఎంపీపీ రేణుక మాజీ సర్పంచ్ దుర్గం  హనుమంతు  కమిటీ దుర్గం శివాజీ మండల్ కో ఆప్షన్ సభ్యులు జాకిర్ హుస్సేన్ , నరేష్ ఎంపిటిసి వనజ, అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు మొండయ్య,హన్మంతు, ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్, దుర్గం సోమయ్య, భరద్వజ్, దేవాజి, రాజేష్ తధీతరులు పాల్గొన్నారు.

యాదవులకు ప్రవేశపెట్టిన అభివృద్ధి అభివృద్ధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలి ; ఎంపీపీ సంజీవ్ కుమార్

 యాదవులకు ప్రవేశపెట్టిన అభివృద్ధి అభివృద్ధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలి 

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  ఏప్రిల్  25 ; (వుదయం ప్రతినిధి) ;  తెరాస ప్రభుత్వం  యాదవులకు ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ సంజీవ్ కుమార్, జడ్పీటీసీ బాబురావు లు అన్నారు. మంగళవారం రెబ్బెన మండలం కేంద్రం లోని ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులకు యాదవులకు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.మన ముఖ్యమంత్రి కెసిఆర్ గారు  75 శాతం సబ్సిడీ పై గొర్రెలను సంఘాలుగా ఏర్పడిన యాదవులకు పంపిణి చేయడం జరుగుతుందన్నారు యాదవ కులస్తులను బలోపేతం చేయడానికి ఈ పథకాలను ప్రవేశపెట్టామన్నారు.  గ్రామాలలో యాదవ కులస్తుల సొసైటీ  లను ఏర్పాటు చేసి  వారికీ గొర్రెలను పంపిణి చేయడం జరుగుతుందన్నారు ఒక్కొక యూనిట్ కు 20 ఆడ గొర్రెలతో పాటు ఒక మగ  గొర్రెపిల్లను అందజేయడం జరుగుతుందన్నారు. మొదటి విడత యాదవ సంఘాలకు సగం మందికి సబ్సిడీ అందజేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని యాదవులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు . అటవీ ప్రాంతంలో కూడా గొర్రెలను మేపడానికి అనుమతులు ఉన్నాయని గొర్రెల పెంచుకోవచ్చని సూచించారు . పశువుల సంరక్షణకు సంచార పశువైద్యశాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మండలంలో  గొర్రెల అమ్మకానికి ప్రత్యేక సంతలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యనారాయణ  సింగ్, తహసీల్దార్ రమేష్ గౌడ్, పశువైద్యాధికారి సాగర్, ఏపీఎం వెంకటరమణ శర్మ , సర్పంచులు పెసర వెంకటమ్మ , తోట లక్ష్మణ్ , రవీందర్,  భేమేష్, వెంకటేశ్వర్లు, ఏపీఓ కల్పన, ఎంపీటీసీలు వనజ , శ్రీనివాస్,మాజీ సర్పంచ్లు పర్వతాలు భగవాన్ తదితరులు పాల్గొన్నారు.

Monday, 24 April 2017

పోలీసు సిబ్బంది ప్రజలకు జవాబుదారిగా ,సమస్యల పరిష్కారమే ద్యేయం గా పని చేయాలి : ఎస్పి సన్ ప్రీత్ సింగ్ .

పోలీసు సిబ్బంది ప్రజలకు జవాబుదారిగా ,సమస్యల పరిష్కారమే ద్యేయం గా పని చేయాలి : ఎస్పి సన్ ప్రీత్ సింగ్ .

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  ఏప్రిల్  24 ; (వుదయం ప్రతినిధి) ;  పోలీసు సిబ్బంది ప్రజలకు జవాబుదారిగా ,వారి సమస్యలను పరిష్కరించేందుకు ఏళ్ల వేళ ల అందుబాటులో ఉండాలి అని ఎస్పి సన్ ప్రీత్ సింగ్  తెలిపారు .సోమవారం గ్రీవెన్స్ డే సందర్భం గా జిల్లా పోలీసు ప్రధాన కార్యలయం లో జిల్లా లోని వివిధ మండలం ల నుంచి వచ్చిన ప్రజాఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ మాట్లడుతూ ఫిర్యాదుల పైన స్టేషను హౌస్ ఆధికారులు తక్షణం స్పందించి న్యాయం చేయాలన్నారు సోమవారము దహెగాం నుంచి వచ్చిన మండల వెంకటేశం  జిల్లా ఎస్పి ను  కలసి తన యొక్క కూతురు గంట వనిత అధిక కట్నం కోసం అత్తింటి వేధింపుల వల్ల మృతి చెందింది అని తల్లి మరణించినప్పటి నుంచి పిల్లలు అయిన విశ్వనాథ్ తేజ్ ,విష్ణుప్రియ లను తాను యే పెంచుతున్నాను ,త్వరితగతిన కేస్ పరిష్కారం అయ్యేలా  చూసి తమకు నష్టపరిహారం ఇప్పించేలా చూడాలి అని కన్నీటి పర్యంతం అవ్వగా తక్షణం స్పందించిన జిల్లా ఎస్పి గారు చరవాణి లోనే దహెగం ఏసై ను కాగజ్ నగర్ డిఎస్పీ ను బాధితులకు న్యాయం జరిగేలా చూడాలి అని ఆదేశించారు. ఈ కార్యక్రమం లో ఎస్బి సీ ఐ వెంకటేశ్వరులు ,ఎస్బి ఎసై శివకుమార్ ,డిసీబీ ఎసై రామరావు ,అసిఫాబాద్ టౌన్  సీ ఐ సతీశ్ గారు ,ఎస్పి సీ సీ శ్రీనివాస్ ,ఫిర్యాదుల విభాగం అధికారిని సునీత  పాల్గొన్నారు.

చౌకధర దుకాణంలో చక్కరను యధావిధి గా అందించాలి

చౌకధర దుకాణంలో  చక్కరను యధావిధి గా అందించాలి 


 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  ఏప్రిల్  24 ; (వుదయం ప్రతినిధి) ;    చౌకధర దుకాణంలో నీరు పేదలకు అందించే సరుకుల్లో చక్కరను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసే ప్రయత్నం  చేస్తుందని  దానిని వెంటనే విరమించు కోవాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్,  ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి దుర్గం రవీందర్ లు సోమవారం రెబ్బెన మండలం తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఊర్మిళ కు వినతి పత్రాన్ని  అందచేశారు. ఈ సందర్బంగా  అయన మాట్లాడుతూ చౌక దరల దుకాణంలోనిత్యావసర వస్తవులలో  పంపిణి చేస్తున్న చక్కరను రద్దు వల్ల  నీరు పేదలకు ఇబ్బంది కరంగా మారుతుంది అన్నారు. టి ఆర్ ఎస్ ప్రభుత్వం నిత్యావసర సరుకులకు కోతపెడుతూ భవిష్యత్ లో ప్రజా పంపిణి వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి పెట్టుబడిదారీ వ్యవస్థను రాష్ట్రంలో బాలోపితం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. పేద,బడుగు,బలహీన వర్గాల ప్రజలకు అందించే నిత్యావసర సరుకుల్లో కొతపెట్టకుండా యధావిధిగా  కొనసాగించాలని డిమాండ్  చేస్తున్నాము అని అన్నారులేని పక్షంలో పేద ప్రజల పక్షన సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి రాయల నర్సయ్య, గోగర్ల రాజేష్, చిన్నయ్య, భీమయ్య, హన్మంతు, సన్యాసి తదితరులు పాల్గొన్నారు. 

ఆర్ ఆర్ ఎస్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

ఆర్ ఆర్ ఎస్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం 

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  ఏప్రిల్  24 ; (వుదయం ప్రతినిధి) ;   కొమురం భీం జిల్లా కేంద్రంలో ని కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో సోమవారం ఆర్ ఆర్ ఎస్ స్వచ్చంద సేవ సంస్థ ఆధ్వర్యంలో స్టార్ హోటల్, అసిఫాబాద్ యజమానులు పి. రాకేష్ మరియు ఎల్. రాజేందర్ లు  అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.  సోమవారం ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి వచ్చే ప్రజల సౌకరాయాన్ని బట్టి ఇట్టి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అయన తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి ప్రజలనుండి మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం లో పాల్గొన్న ఆర్ ఆర్ ఎస్  సంస్థ సభ్యులు  పవన్ మాసాదే, ఇరుకుల్ల సంతోష్, మేథారి నగేష్, వరగరే ప్రతాప్, శ్రీనివాస్  ఇతర సభ్యులు  పాల్గొన్నారు.

గ్రంధలయం పుస్తక పఠనం వాళ్ళ జ్ఞానం పెరుగుతుంది ; సింగరేణి డైరెక్టర్ బి. రమేష్ కుమార్


గ్రంధలయం పుస్తక పఠనం వాళ్ళ జ్ఞానం పెరుగుతుంది ; సింగరేణి డైరెక్టర్ బి. రమేష్ కుమార్

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  ఏప్రిల్  24 ; (వుదయం ప్రతినిధి) ;    గ్రంధాలయం పుస్తక పఠనం వల్ల జ్ఞానం పెరుగుతుంది అని సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్స్ బి. రమేష్ కుమార్ అన్నారు. బెల్లంపల్లి ఏరియా లోని గోలేటి టౌన్ షిప్ లో సింగేరేని సేవ సమితి అద్వర్యం లో నడిచే గ్రంధాలయాన్నీ సోమవారం ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. పుస్తక పఠనం అనేది మంచి అలవాటు. పుస్తక పఠనంతో జ్ఞానం పెరుగుతుందని,సింగరేణి సేవ సంస్థ ఏర్పాటు చేసిన గ్రంధాలయాన్ని వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రంలో  బెల్లంపల్లి జనరల్ మేనేజర్ కే రవిశంకర్, డిజిఎం చిత్తరంజన్ కుమార్,ఎస్ ఓ టూ జి ఎం కొండయ్య,ప్రాజెక్టు ఆఫీసర్ సంజీవ్ రెడ్డి,మోహన్ రెడ్డి, బి జి ఎం సివిల్ ప్రసాద్ రావు, డిజిఎం ఇ ఎక్స్ పి ఎల్ సీతారామారావు, ఏరియా ఇంజనీరింగ్ రామారావు, యూనియన్ నాయకులు టీబీజీకేఎస్ ఎన్. సదాశివ్ ఏఐటియూసి ఏరియా సెక్యూరిటీ బి. మోగ్లీ,బి వై పి ఎం ,రాజేశ్వర్, రామశాస్రి, సేవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

పశువుల సంత 7. 72వేలకు వేలం

పశువుల సంత 7.  72వేలకు వేలం 

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  ఏప్రిల్  24 ; (వుదయం ప్రతినిధి) ;    రెబ్బెన మండలం లోని గంగాపూర్ గ్రామా శివారులో పశువుల వార సంత  సోమవార వేలం పాట నిర్వహింహించారు. గంగాపూర్ కి చెందిన చంద్రయ్య 7లక్షల 72వేలకు సొంతం చేసుకున్నట్లు ఈ ఓ పి ఆర్డీ కిరణ్, పంచాయితీ కార్యదర్శి మురళీధర్  తెలిపారు. ఈ సందర్బంగా మంగళవారం జరుగు వరసంతకు కవాల్సిన సదుపాయాలను ఏర్పాటుచేయన్నట్లు పంచాయితీ కార్యదర్శి మురళీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రవీందర్, ఉప సర్పంచ్ ఏ . శ్రీనివాస్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Sunday, 23 April 2017

గిరిజన సంక్షెమమనికి కృషి చేస్తున్న జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్

గిరిజన సంక్షెమమనికి కృషి చేస్తున్న జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ 

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  ఏప్రిల్  23 ; (వుదయం ప్రతినిధి) ; గ్రామ ప్రజల సహకారం ఉంటె ఏమి అయిన సాధించవచ్చుఅని కుమరంభీమ్ అసిఫాబాద్ జిల్లా ఎస్పి సన్ ప్రీత్ అన్నారు. తిర్యాణి మండలం గిరిజనుల గ్రామంలో  గ్రామస్తులతో కలసి ఆదివారం జిల్లా ఎస్పి స్వయం గా రోడ్డురోలర్ ను నడిపి  చురుకుగా గిరిజన గ్రామలకు రోడ్డును నిర్మించ్చారు.  కుమరంభీమ్ అసిఫాబాద్ లో చాలా ప్రాంతాలు రోడ్డు లేక సరైన రవాణా సదుపాయాలు లేక వాహనాలు రాలేని మారుమూల గ్రామాలను గమనించిన జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్  గారు వారిలో చైతన్యం తీసుకువచ్చి వారిని కూడా అభివృద్ధిలో భాగస్వామ్యులు ను చేయాలనీ నిశ్చయిచుకున్నారు.  ఇందులో భాగం గా 28 -12 -2016 రోజున తిర్యాణి మండలం గోపేర గ్రామంలో గిరిజనుల వైద్యము కొరకు మెడికల్ క్యాంపు ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పి కాలినడకన చేరుకున్నారు. గ్రామ ప్రజలందరినీ కలిసి మాట్లాడగా వారు కనీసం తమ గ్రామానికి నాలుగు చక్రాల వాహనం రాలేని స్థితి లో ఉన్నామని, అత్యవసర వైద్య సదుపాయం కావలిసి వస్తే రోగి ను మంచం పైన పడుకోబెట్టి నలుగురం మోస్తూ తీసుకు వెళ్తునం అని ఈ దుస్థితి ను తొలగించమని గ్రామ ప్రజలందరూ కోరారు.  దీనికి చలించి పోయిన జిల్లా ఎస్పి మీ అందరి సహకారం ఉంటె ఏమి అయిన సాధించవచ్చు అని త్వరలోనే రోడ్డు తప్పక నిర్మించుకుందాం అని హమీ ఇచ్చారు. గతం లో ఇంజనీర్ అయినటువంటి జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ గారు ప్రత్యేకంగా కొండ ,కొనలనుంచి రోడ్డు ను నిర్మించటానికి స్వయంగా " రూట్ మ్యాప్ "ను  తన స్వ హస్తములతో  తయారు చేసారు . మరియు రోడ్డు నిర్మాణం లకు అవసరం అగునట్టి  వస్తువులను ,యంత్రాలను సమకూర్చారు ,ప్రజలను యొక్క సహకారం తో పనులు ప్రారంభించారు అక్కడి గ్రామాలూ అయిన మోడిగూడ ,గోపేర ,గోయినా ,కోలం గూడ ,పెద్దగూడ & చిన్న,చిన్న తండాల ప్రజలను పనుల లో శ్రమదానం తో జిల్లా ఎస్పి స్వీయ పర్యవేక్షణ లో మరియు క్షేత్ర స్థాయి పర్యవేక్షకుడిగా తిర్యాణి ఎసై బుద్దే స్వామీ ను జిల్లా ఎస్పీ గారు నియమించారు. ఆ ఊరి గిరిజన గ్రామస్తులు  కోవా సోనేరావు ,ఆత్రం లచ్చు లు మాట్లాడుతూ  మా ఊరికి రోడ్డు సౌకర్యం కలిపించి మా బతుకులలో వెలుగుచూపిన జిల్లా ఎస్పి గారు మాకు దేవుడి తో సమానం అని ఆయనకు జన్మాంతం రుణపడి ఉంటాం అని ,ఒక సారి రోడ్డు నిర్మాణం పూర్తి అయిన మా కష్టాలు దూరం అవుతాయి అని తెలిపారు. ఈ కార్యక్రంలో కాగజ్ నగర్  డీఎస్పీ హబీబ్ ఖాన్, తిర్యాణి ఎసై బుద్దే స్వామీ, జైనూర్ సీఐ, ఎస్బి సీ ఐ వెంకటేశ్వరులు, ఎస్బి ఎసై శివకుమార్ తిర్యాణి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Saturday, 22 April 2017

కోతుల దాడిలో వ్యక్తికీ గాయాలు

కోతుల దాడిలో వ్యక్తికీ గాయాలు  

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  ఏప్రిల్  22 ; (వుదయం ప్రతినిధి)  రెబ్బెన మండల కేంద్రంలో కోతులు బీవత్సవం నానాటికి పెరుగుతుండడంతో వాటి వలన  ప్రజలకు  తీవ్ర కష్టాల ఎదురవుతున్నాయి. మండల కేంద్రం లో కోతుల బారిన పడి ఇప్పటికే పలువురు హాస్పటల్ పాలయ్యారు. శనివారం మండల కేంద్రానికి చెందిన  పూసల వ్యాపారి పాసులూటి కృష్ణ కోతుల దాడిలో గాయాల పలు అయ్యారు. గతం లో కూడా పలువురు కోతుల బారిన పడి  గాయాల పాలై హాస్పటల్ లో చికిత్స తీసుకున్నారు. కోతుల నివారణకు గ్రామా పంచాయితీ వారు రెండు కొండగాలు కొనుగోలు చేసినప్పటికీ కోతులను నివారించలేక పోయారు.కోతులు గుంపులు గుంపులుగా వచ్చి దాడులు చేస్తున్నప్పటికీ వాటి బారిన పడీ హాస్పత్రి పలు తప్ప చేసేది ఏమిలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కానీ గ్రామా పంచాయితీ వారు కానీ  కోతుల నివారణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.

బావుల మరమ్మతుల కోసం పరిశీలన

    బావుల మరమ్మతుల కోసం పరిశీలన 
      కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  ఏప్రిల్  22 ; (వుదయం ప్రతినిధి) ;  రెబ్బెన మండలంలో మంచినీటి బావుల మరమ్మతుల కోసం ఎస్ సి కాలనీ లోని బావులను సర్పంచ్ పెరుగు వెంకటమ్మ,ఆర్ డబ్ల్యూ ఎస్ జె ఇ సోనీలు. శనివారం బావులను పరిశీలించారు. ఈ సందర్బంగా సర్పంచ్ వెంకటమ్మ మాట్లాడుతూ వేసవి కలం నీటి అడ్డది లేకుండా నీరు ఉన్న చేత బావులను త్వరిత గతిన మరమ్మతులు చేసి బావులను వినియోగం లోనికి తీసుకు రావాలని సూచించారు. వీరి వెంట సింగల్ విండో డైరెక్టర్ మాదానయ్య లు  ఉన్నారు.

పశువుల సంతకు వేలం పాట

పశువుల సంతకు వేలం పాట 
  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) ఏప్రిల్  15 ;      రెబ్బెన మండలం లోని గంగాపూర్ గ్రామా శివారులో పశువుల వార సంతకు ఈ నెల 24న సోమవారం రోజున  వార సంత వేలం పాట నిర్వహించబడునని పంచాయితీ కార్యదర్శి మురళీధర్  ఒక ప్రకటనలో తెలిపారు. పంచాయితీ నియమాల ప్రకారం వేలం పాట నిర్వహించబదుతుందని, 30వేలు డిపాజిట్ చేసిన వారు హర్వులు అని పేర్కొన్నారు. వేలం పాటలో పాల్గొనేవాళ్ళు గ్రామపంచాయితీకి ఎటువంటి బకాయిలు ఉండరాదని తెలిపారు

పాము కాటుతో వ్యక్తి మరణం

 పాము కాటుతో వ్యక్తి మరణం 
  
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  ఏప్రిల్  22 ; (వుదయం ప్రతినిధి)    రెబ్బెన మండలం లోని జక్కలపల్లి మేడి హన్మంతు (40) పాము కాటుకు గురి అయి హాస్పటల్ కి తరలిస్తుండగా  మార్గ మధ్యలో   చనిపోయినట్లుగా బంధువుల  పిర్యాదు మేరకు ఎస్ ఐ దారం సురేష్ తెలిపారు. పొలం పని నిమిత్తం వెళ్లిన మేడి హన్మంతు ఇంటికి రాకపోవడం తో  శుక్రవారం ఉదయం ఆచూకీ కోసం అన్న కొడుకు రమేష్, బంధువులు వల్లి  చూడగా  పాముకార్చిందని తెలపడంతో ఆటో లో మంచిర్యాల్ హాస్పటల్ కి తరలించగా పరిశీలించి డాక్టర్లు చనిపోయారని తెలిపారు. బంధువుల  పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూన్నట్లు తెలిపారు.

రక్షక భటుల నిలయాలకు ఆధునిక పరికరాల పంపిణి

  రక్షక భటుల నిలయాలకు  ఆధునిక పరికరాల పంపిణి

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  ఏప్రిల్  22 ; (వుదయం ప్రతినిధి) ; రక్షక భటులా నిలయాలకు అత్యాధునిక ప్రింటింగ్ మిషిన్ లను  శనివారం జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్  19 పోలీస్ స్టేషన్ల కు పంపిణి  చేశారు. కుమరంభీమ్ అసిఫాబాద్ జిల్లా లో  మారుమూల గిరిజన కొండ ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతల లో ఉన్న జైనూర్ ,లింగాపూర్ మరియు కొత్త మండలాలు అయిన పెంచికలపేట ,చింతలమానెపల్లి లాంటి పోలీసు స్టేషను లను సందర్శించిన జిల్లా ఎస్పి అక్కడ ప్రింటింగ్ ,జిరాక్స్ ,కరెంటు లేకపోవడం లాంటి సమస్యలను గమనించి ప్రాతిపదికన ప్రవేశపెట్టి, అత్యాధునిక మైన నూతన జిరాక్స్ & ప్రింటింగ్ మెషిన్ లను జిల్లా కు తెప్పించి జిల్లా ల లోని అన్ని పోలీసు స్టేషను లకు ,సర్కిల్ ఆఫీసులకు ,జిల్లా పోలీసు సాయుద దళం కు మంజూరు చేసి ఇవ్వటం జరిగింది  అన్నారు.  ఈ కార్యక్రమం లో కాగజ్ నగర్' డిఎస్పి హబీబ్ ఖాన్ ,ఎస్బి సీ ఐ వెంకటేశ్వరులు ,అసిఫాబాద్ సీ ఐ సతీశ్ కుమార్ ఎస్బి ఎసై శివకుమార్ ,ఎస్పి సీ సీ శ్రీనివాస్ ,డీసీబీ ఎసై రామరావు ల పాల్గోన్నారు.

Friday, 21 April 2017

పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారులతో విడియోకాన్ఫెరెన్స్







పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారులతో విడియోకాన్ఫెరెన్స్

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  ఏప్రిల్  21 ; కుంరం భీం జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐ పి స్ గారు స్థానిక కలెక్టర్ ఆఫీస్  లోని కాన్ఫరెన్స్ హాల్ లో  తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారులతో విడియోకాన్ఫెరెన్స్ లో మాట్లాడి  నూతనముగా ఎంపిక కాబడిన కానిస్టేబుల్ అభ్యర్థుల యెక్క పూర్వాపరాలు ను ,.వారి యెక్క  శిక్షణ ,శిక్షణ కేంద్రాల గురించి వారికి సమకూర్చాల్సిన సామాగ్రి ను గురించి తెలంగాణ పోలీస్ నియామక మండలి అధికారులతో మాట్లాడారు.

భూ నిర్వాశితుల సమస్యలు పరిష్కరించాలి; ఏ బి వి పి నాయకులూ

భూ  నిర్వాశితుల సమస్యలు పరిష్కరించాలి; ఏ బి వి పి  నాయకులూ

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  ఏప్రిల్  21 ; (వుదయం ప్రతినిధి)  అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ అద్వర్యం లో రాష్ట్ర వ్యాప్తంగా  సామజిక సర్వే నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మండలం లోని గోలేటి గ్రామ పంచాయితీ పరిధిలోని సింగేరేని భూ నివాశితుల స్థితి గతులపై సర్వ్ చేయడం జరిగింది వాళ్ళకి కనీసం మౌలిక వసతులు కల్పించడం లో అధికారులు విఫలం అయ్యారని ఇకనైనా ప్రభుత్వం స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ బి వి పి  నాయకులూ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు కృష్ణదేవరాయలు నాయకులూ అరుణ్ కుమార్,ప్రశాంత్,సాయి కృష్ణ, వెంకటేష్, రాజేష్ తదితరులు ఉన్నారు.

వాక్సీ బోర్డు వ్యవసాయ భూముల వేలం పాట

 వాక్సీ బోర్డు వ్యవసాయ భూముల వేలం పాట 

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  ఏప్రిల్  21 ; (వుదయం ప్రతినిధి)    వాంకిడి  మండలం లోని వెల్గి  గ్రామం శివారులో గల వాక్సీ బోర్డు వ్యవసాయ భూములు ఓకే సంవత్సరం సాగు కోసం వేలం పాట వేయడం జరుగుతుందని పి  మల్లికార్జున్, కొమురం భీం ఆసిఫాబాద్ వాక్సీ బోర్డు ఇన్స్పెక్టర్ ఎం ఏ సాజిద్ లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వాక్సీ బోర్డ్ వ్యవసాయ భూమి సాగు కోసం ఆసక్తి గలవారు ఈ నెల 27న ఉదయం 11గంటలకు వాంకిడి మండలం లోని వెల్గి గ్రామంలో వేలంపాట నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర పలికిన వారికీ ఒక సంవత్సరం వరకు సాగుకు హర్వులు అవుతారని వేలం పాటలో పడిన సాగ భాగం వెంటనే చెల్లించి మిగితా మొత్తం 13రోజుల్లో చెల్లించాలని పేర్కొన్నారు.

పోలీసులు విధి నిర్వహణ లో అంకిత భావం తో పని చేయాలి ; జిల్లా ఏస్పీ సన్ ప్రీత్ సింగ్

 పోలీసులు విధి నిర్వహణ లో అంకిత భావం తో పని చేయాలి ;  జిల్లా ఏస్పీ సన్ ప్రీత్ సింగ్



కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  ఏప్రిల్  21 ; (వుదయం ప్రతినిధి)    పోలీసులు విధి నిర్వహణ లో అంకిత భావం తో ,సేవాతత్పరత తో శాంతి భద్రతలను పరిరక్షించాలి అని కుంరం భీం జిల్లా ఏస్పీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు.  జిల్లా లోని పోలీసులు ఆదర్శం గా  నిలవాలి అని పేర్కొన్నారు. పోలిస్ అధికారుల నుంచి ఏళ్ల వేళలా  సహాయ  సహకారాలు ఉంటాయన్నారు.  ఈ సందర్భంగా ఏ ఆర్ ఎస్ ఐ  గా పదోన్నతి పొందిన డోలి ఓదెలు ను జిల్లా ఏస్పీ  పదోన్నతి చిహ్నం తో అలంకరింప చేశారు. రెట్టింపు విశ్వాసం తో సేవాభావం తో శాంతి భద్రతలను కాపాడాలని సూచించారు.  ఈ కార్యక్రమం లో ఎస్బి సీ ఐ వేంకటేశ్వర్లు  ,ఎస్బి ఎసై శివకుమార్, డీసీబీ ఏసై రామ రావు, కుంరం భీం హెడ్ క్వార్టర్స్ ఇంచార్జి రిజర్వు ఇన్స్పెక్టర్  వామనమూర్తి, ఆర్ ఏసై  లు ఎం .శ్రీనివాస్ ,అనిల్ ,శేఖర్ లు పాల్గోన్నారు .

Wednesday, 19 April 2017

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో వైద్య సేవలను మెరుగు పరుస్తాం;కలెక్టర్ చంపాలాల్

                        ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో వైద్య సేవలను మెరుగు పరుస్తాం;కలెక్టర్ చంపాలాల్

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం ప్రతినిధి)  ఏప్రిల్  19 ;   ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో వైద్య సేవలను మెరుగు పరుస్తామని కొమురం భీం జిల్లా కలెక్టర్ అన్నారు. బుధవారం రెబ్బెన ప్రాథమిక ఆరోగ్య కేంద్రన్నీ సందర్శించి విలేకర్లతో మాట్లాడారు. అతర్రాష్ట్ర రహదారికి సమీపంలో  ఉన్న ఆరోగ్య కేంద్రానికి మరింత మెరుగైన సేవలందించడానికి ప్రత్యేక  నిదుల నుండి పది లక్షల రూపాయలను కేటాయించి రెండు అదనపు గదులను నిర్మించి ఒకటి మహిళల వార్డ్ మరియు పురుషుల వార్డ్ లను నిర్మించే ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఒకటే వార్డ్ ఉంది అందులో ఆరు పడకలు  ఉండటం వాళ్ళ రోగులకు సరిపోవడం లేదని అయన అన్నారు. ఆరోగ్య కేంద్రం లో పని చేస్తున్న యొక్క హాజరు పట్టికను పరిశీలించి   అందుబాటులో ఉన్న ముందులను పరిశీలించారు. ఆయనతో పటు డి ఆర్ డి ఓ శంకర్, డి ఎం హెచ్ ఓ సుబ్బారాయుడు, డి వై డి ఎం హెచ్ ఓ సీతారాం, ఎం ఆర్ ఓ రమేష్ గౌడ్, ఎం పి డి ఓ సత్యనారాయణ సింగ్, ఎపిఓ కల్పనా, సర్పంచ్ వెంకటమ్మ, కో అప్షన్ సబ్బుడు జాకీర్ హుస్మని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దగ్గరలో గల ఇజిఎస్ నర్సరీని పరిశీలించి మొక్కలను సకలం లో నాటేలా మొక్కల్ని పెంచాలన్నారు. అదే విదంగా రెబ్బెన గ్రామ పంచాయితీని సందర్శించి స్వచ్ భరత్ పరిశుభ్రతలో మంజూరు ఆయన మరుగు దొడ్లు తాలూకా చెక్ కులను పంపిణి చేశారు.

విద్యార్థులు కష్టబడి కాదు,ఇష్టపడి చదవాలి - ఎం ఎల్ సి పురాణం సతీష్,ఎం ఎల్ ఎ కోవలక్ష్మి


విద్యార్థులు కష్టబడి కాదు,ఇష్టపడి చదవాలి
 -ఎం ఎల్ సి పురాణం సతీష్,ఎం ఎల్ ఎ  కోవలక్ష్మి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం ప్రతినిధి)  ఏప్రిల్  19 ;  విద్యార్థులు కస్టపడి  కాకుండా ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహింహాలని   అధిరోహించాలని ఎం ఎల్ సి పురాణం సతీష్,ఎం ఎల్.ఎ కోవ లక్ష్మి అన్నారు.రెబ్బన మండలంలోని విశ్వశాంత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 24వ వార్షికోత్సవం సందర్బంగా మంగళవారం రాత్రి వారు మాట్లాడారు.ముందుగా జ్యోతిప్రజాలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సంద్దర్బంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండే చదువు  పై ఆసక్తిని పెంపొందించుకోవాలన్నారు. క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించి తల్లిదండ్రులు,గురువులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.సమైక్య రాష్ట్రం లో తెలంగాణ ప్రాంత విద్యార్థులకు విద్య ఉద్యోగ అవకాశాలలో సరైన గుర్తింపులను పొందలేకపోయారన్నారు. స్వరాష్ట్రంలో ఎన్నో అవకాశాలు మెరుగు పడ్డాయి. ఆయా అవకాశాలు సద్వినియోగం చేసుకోవడానికి ప్రణాళిక ప్రకారంగా చదువుకోవాలన్నారు. ఈ సమావేశం లో విజేతలకు భాహు మతులు అందచేశారు.అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక వృత్యాలతో పలువురిని  ఆకట్టుకున్నాయి.  ఈ కార్యక్రమం లో ఎం పి పి సంజీవు కుమార్, జెట్ పి టి సి బాబురావు,సర్పచ్ కేసర్ వెంకటమ్మ, సి ఐ మదన్ లాల్,ఏ ఎం సి కుందారపు శంకరమ్మ,నాయకులూ సుదర్శన్ గౌడ్,శ్రీధర్ రెడ్డి, చిన్న సోమా శేఖర్,రాపర్తి అశోక్, కరస్పాడెంట్ ఇప్ప పోచయ్య,ఉపాధ్యాయులు భారతి, జబీన్, సంగీత కుమారి,శేఖర్,ప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


పార్టీ బలోపేతానికి అందరు కృషి చేయాలి ;జె పి పొడేల్

      పార్టీ బలోపేతానికి అందరు కృషి చేయాలి ;జె పి  పొడేల్

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం ప్రతినిధి)  ఏప్రిల్  19 ; ప్రజల సమస్యలు తెలుసుకుంటూ గ్రామస్థాయి బూత్ కమిటీలను నియమిస్తున్నాం అని  బి జె పి  బలోపేతానికి నాయకులూ అందరు  కృషి చేయాలని  జె పి పొడేల్  అన్నారు.   రెబ్బెన మండలం లోని తక్కలపెల్లి  గ్రామంలో బూత్ లెవల్ కమిటీని వేయడం జరిగిందని అయన తెలిపారు. సమావేశంలో అయన మాట్లాడుతూ గ్రామాల వారీగా కమిటీలు వేస్తూ భాజపా నాయకులూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలి అన్నారు. తక్కలపెల్లి   బూత్ అధ్యక్షులుగా ఆకుల గోపాల్, ఉపాధ్యక్షులుగా ఎలగల భీమేష్,కోట రాఘవేందర్, ప్రధాన కార్యదర్శిగా ఏడేదినేని చందు,కార్యదర్శులుగా కోట సురేష్,కోట సంతోష్ లను ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బి జె వై ఎం జిల్లా కార్యదర్శి అరిగేలా శేఖర్,రెబ్బెన మండల కార్యదర్శి బి జె వై ఎం కోట రాజేష్, నాయకులూ డి.పుల్లయ్య, సాయి, రాంబాబు, అశోక్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

Monday, 17 April 2017

ప్రభుత్వ విద్యాను పరిరక్షించాలి ; వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు

ప్రభుత్వ విద్యాను పరిరక్షించాలి.
వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) ఏప్రిల్  17 ;  రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలని ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్,ఎ.ఐ.ఎఫ్.డి.ఎస్. జిల్లా ఇంచార్జ్ చంద్రశేఖర్,పి.డి.యస్.యు. జిల్లా ఇంచార్జ్ పాపారావు డిమాండ్ చేశారు. సోమవారం రోజున వామపక్ష విద్యార్థి సంఘాల ఆద్వర్యంలో "ప్రభుత్వ విద్యా పరిరక్షణకై" అనే అంశం పైన ఎస్.వి. పాఠశాలలో రౌండ్ టెబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది.అనంతరం వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాను నిర్వీర్యం చేసి కార్పొరేట్ విద్యను రాష్ట్రంలో ప్రవేశ పెట్టి విద్యను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని అన్నారు. రెసిడెన్సియల్ పేరిట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను మూసివెసెందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్ రీయంబర్స్ మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బాడిబాట కార్యక్రమం తూతు తూతు మంత్రంగా కొనసాగిందని అన్నారు.సంక్షేమ వసతి గృహలపై సవతి ప్రేమ చూపించి ఇప్పటికే వసతి గృహలను మూసివేశారని అన్నారు. రాష్ట్రంలో ఉన్న కార్పొరేట్ విద్యాసంస్థలను రద్దు చేసి ప్రభుత్వ విద్యను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆద్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చెపాడాతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఏఫ్ డివిజన్ కార్యదర్శి పుదారి సాయి,మండల కార్యదర్శి సాయి,నాయకులు కమలకర్,సురేందర్ తదితరులు పాల్గొన్నారు.                                     

హలో నిరుద్యోగి ఛలో ఉస్మానియా.. ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్


హలో నిరుద్యోగి ఛలో ఉస్మానియా..
ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) ఏప్రిల్  17 ;  రాష్ట్రంలో విద్యార్థులు,యువకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని విద్యార్థి సంఘాల ఆద్వర్యంలో నేడు జరిగే ధర్మయుద్ధం ఉస్మానియాలో బహిరంగ సభ నిర్వహిస్తున్నమని ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ తెలియజేశారు. రెబ్బెనలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్స్ ను వెంటనే విడుదల చేయాలని,ఉద్యోగ నియామకాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ ను రూపొందించి అమలు చేయాలని,రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలలో టీచింగ్ ,నాన్ టీచింగ్ సిబ్బందిని వెంటనే భర్తీ చేయాలని,ఉద్యోగ ఉపాధి అవకాశాలను విస్తృత పరచాలని,ప్రైవేట్ రంగంలో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి,యువజన సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆద్వర్యంలో ఈ నెల 18న ఉస్మానియాలో ధర్మయుద్ధం పేరిట బహిరంగ సభ నిర్వహిస్తున్నమని ఈ కార్యక్రమానికి విద్యార్థులు,యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఏఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు కస్తూరి రవికుమార్,డివిజన్ కార్యదర్శి పుదారి సాయి,మండల అధ్యక్షుడు మహిపాల్,కార్యదర్శి సాయి తదితరులు పాల్గొన్నారు.