Saturday, 30 July 2016

యూ పిఎస్ స్కూల్ లో విద్య కమిటీ ఎన్నిక

యూ పిఎస్ స్కూల్ లో విద్య కమిటీ ఎన్నిక
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలం లోని పాఠశాలలో శనివారం విద్యాకమిటీ ఎన్నికలు జరిగాయి . ఈ ఎన్నికలలో కమిటీ చైర్మన్ గా షైక్ నిజామొద్దీన్ ఎన్ని కయ్యారు .ఉప చైర్మన్ గా కొండగుర్ల భావన ,కో ఆప్షన్ మెంబెర్ గ శ్రీ బొమ్మినేని శ్రీధర్ ,సత్రపు సత్తయ్య గా ఎన్నుకొన్నారు . ఈ సందర్బంగా ఈ ఎన్నికలో సమావేశం లో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సోమశేఖర్  , విద్యార్థులు తల్లి తండ్రులు తదితరులు పాల్గొన్నారు 

ఉపాధ్యాయ మండల స్థాయి కార్యవర్గం ఎన్నిక

 ఉపాధ్యాయ   మండల స్థాయి కార్యవర్గం ఎన్నిక 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  రెబ్బన మండలోని  ఉపాధ్యాయ ఉద్యోగ  కార్యావర్గ ఎన్నికలు శనివారం జరిగాయి. సి పి ఎస్ ఉపాధ్యాయ  తెలంగాణ రాష్ట్ర సహాధ్యక్షులు యం శ్రీనివాస్, ఆదిలాబాద్ తూర్పుజిల్లా ప్రధాన కార్యదర్శి జి మహిపాల్ మరియు ఆర్ సత్యం ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గంలో అధ్యక్షులుగా యస్ అనిల్ కుమార్, ఉపాధ్యక్షులుగా టి రాంమోహన్ రావు , ఆర్గనైజింగ్ సేకరేటరీ జి విజయ్ రావు , ప్రధాన కార్యదర్శి జె జ్ఞానేశ్వర్, మహిళ అధ్యక్షురాలు యస్ లావణ్య , సంయుక్త కార్యదర్శి యస్ సత్యనారాయణ మూర్తి, కార్యదర్సులుగా జాఖీర్ , అరుణాదేవి, మధుకర్, రోజారమని లను ఉపాధ్యాయుల సమక్షంలో  ఎన్నుకోవడం  జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు  సిపిఎస్ కు వ్యతిరేకంగా మండలస్థాయి కార్యక్రమాలు కొనసాగిస్తోంది అందుచే మండల కార్యవర్గ ఎన్నికలు జరుపడం జరిగిందన్నారు. ఉపాధ్యాయ సమఃస్యలపై అనునిత్యం పోరాడుతామని అన్నారు. 

ఎం సెట్ -2 లీకేజి కి భాద్యులైన వారిని కఠినంగా శిక్షించాలి - ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్

ఎం సెట్ -2 లీకేజి కి భాద్యులైన వారిని కఠినంగా శిక్షించాలి -
     ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  ఎం సెట్ -2 లీకేజికి భాద్యులైన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ అన్నారు . శనివారం రాష్ట్రీయ రహదారిపై ప్రభుత్వ దిష్టి బొమ్మను  చేశారు . ఆయన మాట్లాడుతూ  తెలంగాణ ,అంటూ  అక్రమాలు లేవంటూ గొప్పలు చెప్పుకుంటున్న  రాష్ట్ర ముఖ్య మంత్రి కె సి ఆర్ ఇప్పుడు మాట్లాడడం  ఎందుకు లేదని పేర్కొన్నారు . లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని శిక్షణ తీసుకొన్నారని కో, ఇప్పుడు కొంతమంది తప్పు చేయడముతో ఎంతో మంది విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని తెలిపారు . మల్లి పరీక్షలు నిర్వాహిస్తే రాంకులు వస్తాయో లేదో అని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని అన్నారు . ఎంసెట్ -2 కు భాద్యులైన ఎంసెట్ కన్వీనర్ రామన్న రావు , రాజగోపురం పై క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు . రెండు సార్లు ప్రవేశ పరీక్షలు పెట్టి టి ఆర్ ఎస్ ప్రభుత్వం విఫలమైందని తెలిపారు . నిర్లక్ష్య ధోరణి ప్రభుత్వం ప్రవేశ పరీక్షలు నిర్వహించడముతో ప్రతిభావంతులైన విద్యార్థులు నష్టపోతున్నారని అన్నారు . విద్యార్థుల జీవితాలతో ఆటలాడు కోవడం ప్రభుత్వాలకు మంచిది కాదని హితవు పలికారు . ఈ కార్య క్రమములో మండల కార్యదర్శి పుదారి సాయి , నాయకులూ శ్రీకాంత్ . మహేష్ , సాయి , శ్రీనివాస్  , నాగరాజు లు ఉన్నారు.   

Friday, 29 July 2016

ఎన్ స్ యూ ఐ చలో క్యాంపస్ యాత్రను విజయవంతం చేయండి ; దుర్గం భరద్వాజ్

ఎన్  స్ యూ ఐ  చలో క్యాంపస్ యాత్రను విజయవంతం చేయండి ; దుర్గం భరద్వాజ్

రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  విద్య సంస్థల సమస్యల ఫై చేపట్టిన చలో క్యాంపస్ యాత్రను విజయ వంతం చేయాలనీ ఎం స్ యూ ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం భరద్వాజ్ అన్నారు. రెబ్బెన జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో కరపత్రాలను విడుదల చేసి అనంతరం మాట్లాడారు. విద్యాసంస్థల సమస్యలపై ప్రభుత్వం విఫలం అయ్యేందని కేజీ టూ పిజి పాఠశాలలో అమలు చేయుటకు మరియు మొదలగు విద్య సంస్థల సమస్యలు ఎన్ స్ యూ ఐ ద్వారానే పరిష్కారం అవుతుంది అని అన్నారు. ఈ నెల 27 తేదీ నుంచి మొదలైన చలో క్యాంపస్ యాత్ర 1తేదీ వరకు మంచిర్యాలకు చేరుతుంది . విద్య సమస్యలపై పోరాడే యాత్ర ఆగస్టు 7 తేదీన ఓ యూ ఆర్ట్స్ కాలేజీలో ముగుస్తుంది . అయితే  ఈ యాత్రకు ప్రతి ఒక్కరు సహకరించి విజయ వంతం చేయాలనీ పిలుపు నిచ్చారు. ఈ కార్య క్రమంలో ఎన్ స్ యూ ఐ మండల అధ్యక్షులు ముజాయిద్ , జుబేర్ నాయకులూ రజిని కాంత్ ,లింగయ్య ,శ్రీకాంత్ ,రాజశేఖర్ ,తదితరులు పాల్గొన్నారు. 

. మత్స్యకారులను ఆదుకోవాలి అధికారులకు వినతి

. మత్స్యకారులను ఆదుకోవాలి అధికారులకు  వినతి 




రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని మత్స్యకారులు 30  సంవత్సరాల నుండి మండలంలో ఉన్న చిన్నచిన్న చెరువులలో చేపలు వేసి వాటిని పెంచి వాటినే జీవనాధారంగా చేసుకొని బ్రతుకుతున్నామని కొందరు అడ్డు పడుతూ పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తున్నారని నంబాల గ్రామానికి చెందిన మత్స్యకారులు రెబ్బెన తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించచారు. ఉప తహసీల్దార్ రాంమోహన్ రావుకు వినతి పత్రము అందజేశారు. మత్స్యకారసంఘం అధ్యక్షుడు బి సత్యనారాయణ మాట్లాడుతు చెరువులలోచేపలు వేసి పెంచి వాటిపై మత్స్య కారుల కుటుంబాలు  జీవనోపాధి పొందుతున్నామని ప్రభుత్వం 2011 లోనే మమ్ములను మత్స్యకార సంఘం సొసైటీగా గుర్తించింది .  అలాగే 30సంవత్సరాల నుండి గ్రామా పంచాయితీకి రుసుములు చెల్లిస్తూ ఉండగా కొందరు అక్రమంగా పెత్తనం చెలాయిస్తూ మాకు  జీవనోపాధి లేకుండా చేస్తున్నారని అన్నారు , కావున ఉన్నత అధికారులు మత్స్యకారుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు .  వీరికి నంబాల యం పి టి సి కొవూరి శ్రీనివాస్ మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో మత్స్య కార సంఘం ఉపాధ్యక్షులు బి బాను ప్రసాద్ కార్యదర్శి బి పోచయ్య , మరియు కార్యవర్గ సభ్యులు సురేష్ , పోచయ్య , లక్ష్మణ్ , పోచం , రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సుద్ద క్వారీలో హరితహారం

సుద్ద క్వారీలో హరితహారం 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బన మండలంలో రాళ్లపేట గ్రామ చివారిలో ఉన్న సుద్ద క్వారీలో శుక్రవారం బావాని గిరిజన వెల్ ఫైర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు . తహసిల్దార్ బండారు రమేష్ గౌడ్ , మైన్నింగ్ ఎ డి ప్రతీప్ కుమార్ లు మొక్కలు నాటి అనంతరం మాట్లాడారు జీవకోటికి మొక్కలు మూలానధారమని ప్రతి ఒక్కరు మొక్కలు నాటి ప్రకృతి వైపరీత్యాలను దూరం చేయాలనీ సకాలంలో వర్షాలు కురువాలంటే మొక్కలు నాటి వాటి సంరక్షించడం  మన అందరి  బాధ్యత అని అన్నారు ఈ  కార్యక్రమంలో అసిస్టెంట్ జ్యూయాలాజిస్టు రగుబాబు , ఎనిరంజన్ , డి టి ఎఫ్ ఆర్ ఒ  కారం శ్రీనివాస్ , టిఆర్ ఎస్ నాయకులు మోడెం సుదర్శన్ గౌడ్ , రవి , శంకర్ నాయక్ , మొగిలి , తిరుపతి గౌడ్ , శరత్ తదితరులు పాల్గొన్నారు  

Wednesday, 27 July 2016

దేవులగుడ లో పోలీస్ హరితహారం

దేవులగుడ లో పోలీస్  హరితహారం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండల కేంద్రం లోని దేవులగుడ   గ్రామంలో  జన మైత్రి కార్యక్రమంలో  బుధవారం  గ్రామ పోలీస్  అధికారి సంతోష్ కుమార్  హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు పచ్చదనం పరిశుభ్రత లో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. సమస్యలు పరిష్కరించడానికి నిత్యం  పోలీసుల మీ చెంత  ఉంటారని  అన్నారు ప్రజలు భయాన్ని విడి  సమాచారం అయినా అందించాలని,  గ్రామ అభివృద్ధి,   ప్రజల సమస్యలను, శాంతి భద్రతలను   నిత్యము కాపాడతామన్నారు.  ప్రజలకు  చట్టాల గురించి అవగాహన కల్పించారు   ఈ కార్యక్రమంలో పోలీస్ సిబంది ,  గ్రామా ప్రజలు తదితరులు  పాల్గొన్నారు.

Tuesday, 26 July 2016

వ్యాధుల పట్ల అప్రమత్తం గా వుండాలి;సేవా అధ్యషురాలు అనురాధరవిశంకర్

వ్యాధుల పట్ల అప్రమత్తం గా వుండాలి;సేవా అధ్యషురాలు అనురాధరవిశంకర్
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); వర్ష కాలంలో వచ్చే వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా వుండాలని బెల్లంపల్లి ఎరియా సేవా అధ్యక్షురాలు అనురాధ రవిశంకర్ సూచించారు.బెల్లంపల్లి  ఏరియాలో రెబ్బెన మండలంలోని గోలేటి గల సింగరేణి పాఠశాలలో సింగరేణి అధ్వర్యంలో వ్తెద్య శిభిరం ఏర్పాటు చేశారు.ఈ వ్తెద్య శిభిరాన్ని సేవా అధ్యక్షురాలు అనురాధ రవిశంకర్ ప్రారంభించారు. అనంతరం ఆమే మాట్లాడుతూ  వర్షకాలంలో పరిసరాలను పరిశుభ్రంగా వుంచుకోవడం తో పాటు వ్యక్తిగత. పరిశుభ్రత పాటించాలని పరిశుభ్రమైన ఆహారం,నీటిని వాడలని సూచించారు వ్యాధులు  ప్రబలితే వేంటనే డాక్టర్‌ ను సంప్రదించాలని సూచించారు.ఈ కారక్రమంలో ఏరియా జియం కే. రవిశంకర్ పాఠశాల కరస్పాండెంట్ జే.చిత్తరంజన్ కుమార్ ఏరియా అసుపత్రి డాక్టర్లు  అదినారయణ,శారద యునియన్ నాయకులు యస్.తిరుపతి,సదాశివ్ పాఠశాల HMపాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Monday, 25 July 2016

మద్యం దుకాణం సీజ్ తో మందుబాబులు విలవిలా

మద్యం దుకాణం సీజ్ తో మందుబాబులు విలవిలా   

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని  గోలేటిలో  మద్యం దుకాణం సీజ్ అవడంతో మద్యం వినియోగ దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ స్పెషల్ ఫోర్స్ ఈ నెల 18 వ తేదీన ఆకస్మిక తనిఖీలో మద్యంలో నీళ్లు కలిపి  కల్తీ చేస్తుండగా ప్రత్యేక బృందం వారు పట్టుకొని సీజ్ చేశామని ఆప్కారి సిబంది తెలిపారు. కల్తీ మద్యం  త్రాగటం  వల్ల ప్రజల ఆరోగ్యాలు పాడైపోతున్నాయని మద్యంను శాశ్వతంగా దూరం చేయాలని సామూహిక శాస్ర్తవేత్తలు కోరుతున్నారు.

Sunday, 24 July 2016

కేటీఆర్ జన్మదిన సందర్భంగా మొక్కలు నాటిన సేవా సంస్ధ

కేటీఆర్  జన్మదిన సందర్భంగా మొక్కలు  నాటిన  సేవా సంస్ధ

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); కేటీఆర్  జన్మదిన సందర్భంగా స్నేహ కల్చరల్ ఆర్ట్స్ &సేవా సంస్ధ వారు  రెబ్బెన మండలం లోని గోలేటి గ్రామపంచాయితీ లో ఆదివారము  రోజున  ఐ టి డిఎ  ప్రాధమిక పాఠశాల అవరణలో మొక్కలు  నాటారు. అనంతరం పాఠశాల విద్యార్థులు  మిఠయిలు పంచుకోని వేడుకలు జరుకున్నారు. ఈ సందర్భంగా  అసిపాబాద్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్, స్నేహ కల్చరల్  సంస్ధ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ   మాట్లాడుతు ఈ రోజున కేటీఆర్ జన్మదిన సందర్భంగా మొక్కలు నాటామ్మన్నారు విద్యార్థలకు చిన్నతము నుంచే పర్యావరణాన్ని కాపాడేవిధంగా మొక్కలు నాటే అలవాటు చేసుకోవాలని  అవగాహన కలిపించారు. అనంతరం విద్యార్థులు పచ్చదనం ప్రగతికి మెట్లు అని నినాదాలు చేస్తూ ప్రధాన వీధులగుండా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  అధ్యక్షులు బి గోపాలకృష్ణ , బానోత్ దేవయ్య , బోయిని శంకరమ్మ , యల్ ప్రభాకర్ , రమేష్ , నాగయ్య , స్వామి తదితరాలు పాల్గొన్నారు.

చేపల వేటకు వెళ్లి వాగులో చిక్కుకున్న యువకులు

చేపల వేటకు వెళ్లి వాగులో చిక్కుకున్న యువకులు 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలో పల్లవి గుండాల వాగు వద్ద ముగ్గురు యువకులు చేపలు వేటకు వెళ్లి వాగులో చిక్కున్నారు బాధితుల వివరాల ప్రకారం  ఆదివారం మధ్యాహ్నం తాండూరుకు చెందిన యువకులు యండి జఫ్ఫార్ హుసేన్ , యండి యునాఫ్ , జంపాల రాకేష్  చేపల వేటకోసం వచ్చామని హట్టాతుగా ఒకేసారి వాగు  ఉపొంగి రావడం వలన నీటి ప్రవాహం లో కొట్టుకు పోయి చెట్ల పొదలలో చిక్కుకున్నారు . ప్రాణ భయంతో సహాయం కోసం ఎదురు చూస్తుండగా స్థానికులు గమనించి పోలీసు వారికి సమాచారం అందించగా సిఐ కరుణాకర్ ఘటన స్థలానికి చేరుకొని అసిపాబాద్ అగ్ని మారాక బృందానికి తెలియజేయగా వారు సహాయక పరికరఃతో బాధితులను రక్షించి స్థానిక ఆసుపత్రికి తరలించారు . ఈ సంఘటలో అగ్నిమాపక సిబంది లక్ష్మణ్ , బానయ్య , విజయ్ , మహేందర్ తదితరాలు ఉన్నారు . 

రెబ్బెనలో కేటీఆర్ జన్మదిన వేడుకలు

రెబ్బెనలో  కేటీఆర్  జన్మదిన వేడుకలు 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ఐ టి మరియు పంచాయిచిరాజ్, పురపాలక మంత్రి వర్యులు కలువకుంట్ల తారక రామరావు జన్మదిన సందర్భంగా రెబ్బెన అతిధి గృహంలో తెరాస తూర్పుజిల్లా ఉప ధ్యక్షుడు నవీన్ కుమార్ జైశ్వాల్ ఆధ్వర్యంలో మండల ఎంపిపి సంజీవ్ కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొని కేక్ కోసి మిఠాయిలు పంచుకొని  జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు . ఈ కార్యక్రమంలో  సర్పంచ్ వెంకటమ్మ, అసిపాబాద్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ కుందారపు శంకరమ్మ, ఉపసర్పంచ్ బి శ్రీధర్ కుమార్ , మార్కెట్ డైరెక్టర్ పల్లె రాజేశ్వర్ , టౌన్ అధ్యక్షులు రాపర్తి అశోక్ , వెంకటేశ్వర్ గౌడ్, సోమశేఖర్ , సుదర్శన్ గౌడ్, చోటు, బి శ్రీనివాస్ , రవినాయక్ , ప్రవీణ్ ,రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి హరితహారం -తెలంగాణ హరితహారం


                  సింగరేణి హరితహారం -తెలంగాణ హరితహారం 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి);   ప్రతి ఒక్కరుమొక్కలు నాటి కాపాడాల్సిన సామాజిక భాద్యత అందరిపై ఉందని  బెల్లంపల్లి జెనరల్ మేనేజర్ కె రవి శంకర్ అన్నారు . సోమవారం  సింగరేణి హరితహారం -తెలంగాణ హరితహారం   లోభాగంగా  ఖైరి గూడా ఓ సి పి లో మొక్కలను నాటారు . ముందుగా గోలేటి లోని జెనరల్ మేనేజర్ కార్యాలయము నుండి మహా ర్యాలీ నిర్వ హించారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్త్వకంగా తీసుకొని చేపడుతున్నా హారితహారం లో  సింగరేణి ఆధ్వర్యములో బెల్లంపల్లి ఏరియా లో  మొక్కలను  నాటామని అన్నారు  ప్రతి ఒక్కరు ఇంటికి 5 మొక్కలు నాటితే ఆ గ్రామమే ఉద్యాన వనంగా మారుతుందని ఆయన అన్నారు .    సామాజిక భాద్యతగా ప్రతి ఒక్కరు మొక్కలు  నాటి కాపాడాల్సిన భాద్యతగ అందరిపై ఉందని తెలిపారు .  . రాబోయే కాలములో అడవిలో తెలంగాణ ను ముఖ్య మంత్రి కె     సి ఆర్ చూడాలి అని , ఈ నాటి మొక్కలే భావి తరాలకు జీవనాధారమని దానికోసం మొక్కలను పెంచాలని పేర్కొన్నారు . ఈ కార్య క్రమములో ఎస్ ఓ టు జి  కొండయ్య , డి జి ఎం చిత్తరంజన్ , సేవ సమితి అధ్యక్షురాలు అనురాధ , టి బి జి కె ఎస్ సెంట్రల్ కార్యదర్శి ఎంశ్రీనివాసరావు , మార్కెటింగ్ వైస్ చైర్మల్ కుందారపు  శంకరమ్మ , ఏ ఐ టి సి బ్రానుంచి కార్య దర్శి ఎస్ తిరుపతి , పర్య వరణ అధికారి కృష్ణా చారీ , ఏ జి ఎం రామ రావు , ఐ ఈ డి యోహాన్ , తది తరులు  ఉన్నారు.

నిరుద్యోగ యువతి ,యువకులకు ఇంటర్వ్యూ లు

 నిరుద్యోగ యువతి ,యువకులకు ఇంటర్వ్యూ లు. .. 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  సింగరేణిలో పనిచేయుచున్న మరియు దిగిపోయిన కార్మికుల యెక్క పిల్లలు [నిరుద్యోగ యువతి ,యువకులు ]కొరకు బోట్ చీని వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కాలేజ్ ,వరంగల్ వాల్క్ ఇంటర్వ్యూ లు 22.. 6రోజున కలవని  పర్సనల్ మేనేజర్ చిత్తరంజన్ ఒక్క ప్రకటనలో  తెలిపారు. కావాల్సిన  అర్హతలు ఇంటర్ ఒకేషనల్ అప్రెంటిస్ సిర్టిఫికెట్ ,దరఖాస్తు ఫారం ,ఒరిజినల్ సర్టిఫికెట్లు తో ఇంటర్వ్యూ కు రావాలి ,సమయం ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 1:30వరకు ఒకేషనల్ ఇంజనీరింగ్ కోర్సుస్ వారు మరియు మధ్యాహ్నం 1:30నుండి 4:30వరకు ఒకేషనల్ పారామెడికల్ వారూ దరఖాస్తు చేసుకో గలరు .

జన మైత్రి సదస్సు లో మొక్కలు నాటిన ఎస్ ఐ

 జన మైత్రి సదస్సు లో  మొక్కలు నాటిన ఎస్ ఐ 




రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  రెబ్బెన లో అర్డ్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో  పోలిసు వారు  ఏర్పాటు చేసినా జనమైత్రి అవగాహన సదస్సులో హరితహారం భాగంలో కళాశాల ఆవరణలో ఎస్ ఐ శ్రీకాంత్ మొక్కలు నాటారు అనంతరం ఆయన మాట్లాడుతూ పచ్చదనం పరిశుభ్రత సమాజ శ్రేయష్షుకు కోశం ఎంతో ఉపయోగపడుతాయని నేటి మొక్కలే రేపటి వృక్షాలు అవుతాయని వాటిని సంరక్షించుకోవడం మనందరిబాధ్యత అని అన్నారు, అలాగే జనమైత్రి అవగాహన కలిపిస్తూ పోలీసులు అందరితో స్నేహపూర్వకంగా ఉంటారని ఎలాంటి సమస్యలు ఎదురైన వెంటనే దర్యంగా సమాచారం ఇస్తే అందుబాటులో ఉంటామని అన్నారు, అలాగే విద్యార్థులు చెడు వేషణలకు బానిసలు కకుండా విద్యా పై దృష్టి సారించి ఉన్నత స్థానానికి చేరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అమీర్ ఉస్మాని ,కో ఆప్షన్ మెంబెర్ జాకీర్ ఉస్మాని,అధ్యాపకులు v .ఫణి కుమార్ ,v .నవీన్ కుమార్ ,దేవాజి,స్వప్న ,మల్లేష్ ,షాలిని , గణేష్ ,విద్యార్థిని ,విద్యార్థినిలు పాల్గొన్నారు . 

18 న చలో కొత్తగుడెం విజయవంతం చేయాలి

18 న చలో కొత్తగుడెం విజయవంతం చేయాలి
 
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ఈ నెల 18 న సోమవారం రోజున కొత్త గుడెంలో హెడ్ ఆఫ్ సు ముందు ఏ ఐ టి యూ సి ఆద్యారంలో సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్టు కార్మికులు ఎదురుకొంటున్న సమస్యలపై ధర్న నిర్యహించడం జరుగుతుందని ఏరియా లోని కాంట్రాక్టు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయంతం చేయాలని ఎస్ సి డ్ల్యూ బ్రంచి ప్రెసిడెంట్ బోగే ఉపేందర్ పిలుపునిచ్చారు శనివారం రెబ్బెన మండలంలో గోలేటిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిస్కరంచడంలో టి బి జి కె ఎస్ విఫలం అయిందని కార్మికులను శ్రమదోపిడి ని సారి చేసుతున్న పట్టించుకోవడంలేదని కాంట్రాక్టు కార్మికులతో జెండాలు మోపించారు. కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేస్తామని, అధికారంలోకి వచ్చిన  బి జి కె ఎస్ ఆ తర్వాత పట్టించుకోవడం లేదని అన్నారు కేవలం ఆర్థిక లావాదేవీలకె పరిమితమైందన్నారు. ఈ కార్యకరంలో బ్రాంచ్ కార్యదర్శి చల్లూరి అశోక్ ఉపాధ్యక్షులు ఎల్ సుధాకర్ నాయకులు మల్లేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

హరిత హారంలో భాగంగా మొక్కలు నాటిన అధికారులు


హరిత హారంలో భాగంగా మొక్కలు నాటిన అధికారులు


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని తక్కెళ్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పలు కాలనీల్లో హరితహారం రెండవ విడతలో భాగంగా గ్రామ ప్రజలతోపాటు స్థానిక ఎం ఆర్ ఓ బండారి రమేష్ గౌడ్ మొక్క లను నాటారు ఈ సందర్బంగా ఎం ఆర్ ఓ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం వల్ల పచ్చదనం పరిమళిస్తుందాని ,దింతో ప్రజలు కరువు కాటకాలను  అధిగమిస్తారని అన్నారు . ప్రతి గ్రామపంచాయితీలో 40 వేల మొక్కలను నాటి హరిత తెలంగాణకు పాటుపడాలని ఆయన తెలిపారు. మరియు ఈకార్యక్రమంలోమండలవిద్యాశాఖఅధికారి వెంకటస్వామి,దోనెబాపుతో పాటు పలువురు సర్పంచులు,ప్రజలు పలుగున్నారు.

సింగరేణిలో బొగ్గు రవాణా చేయుటకు టెండర్లు

    సింగరేణిలో బొగ్గు రవాణా చేయుటకు టెండర్లు 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); బెల్లంపల్లి ఏరియా లోని ఉపరితలగనియెనా ఖైరుగూడ ఓపెన్ కాస్ట్ నుండి శ్రీరాంపూర్ సి ఎహ్ పి కి బొగ్గు రవాణా చేయుటకు టెండర్ల కోరడం జరిగిందని పర్సనల్ మేనేజర్ చిత్తరంజన్ ఒక్క ప్రకటనలో  తెలిపారు . టెండర్ల దరకాస్తు కొరకు బెల్లంపల్లి జి యం కార్యాలయంలో సంప్రదించగలరని అన్నారు . టెండర్ దరకాస్తు ఫారమ్స్ 18/07/2016 తేదీ సాయంత్రం 4గం"వరకు ఇవ్వబడుతాయని తెలిపారు . మరియు టెండర్ ఫారలను కొటేషన్ తేదీ 19/07/16 మద్యాహ్నం 12గం"లలోపు స్థానిక జి యం కార్యాలయంలో అందించవల్సిందిగా అన్నారుఅదేరోజుమద్యాహ్నం 3 గం "లకు టెండర్ ఫారాలను తెరువబడుతాయని మరియు పూర్తి వివరాల కొరకు పర్చేస్ డిపార్టుమెంటును సంప్రదించగలరని తెలిపారు.

Friday, 15 July 2016

విద్యార్థుల ఆధ్వర్యంలో హరిత హారం

   విద్యార్థుల ఆధ్వర్యంలో హరిత హారం 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు శుక్ర వారం రోజున  ప్రధాన రోడ్డు పై హరిత హారంలోని మొక్కల ప్రత్యేకత పై ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాళి స్థలాల్లో మొక్కలు నాటారు. మండలంలో 12 గ్రామాలు ఉన్నాయని ప్రతి గ్రామానికి 40 వేల మొక్కలు నాటాలని పూర్తి మండలం లో 2.40.000 మొక్కలను నాటాల్సిందిగా అధికారుల ఆదేశాలు ఉన్నాయని ఈ సందర్బంగా స్థానిక సర్పంచ్ పెసరు  వెంకటమ్మ అన్నారు. ప్రతి గ్రామంలోని వారు ఇంటింటా కనీసం 5 మొక్కలు నాటుతే మానవాళికి రక్షణ కలుగుతుందని ప్రధాన ఉపాద్యాయురాలు స్వర్ణలత తెలిపారు . ఇందులో భాగంగా పలు విద్య సంస్థల విద్యార్థులు  చెట్లు పెట్టి పచ్చదనాన్ని నింపారు ఈ  కార్యకరంలో విద్య బోధకుడు సదనందం,దేవేందర్,రవి,తోపాటు విద్యార్థులు పలుగున్నారు.

రెబ్బెన లో హరిత హారం

రెబ్బెన లో హరిత హారం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  రెండొవ విడత హరిత హారం రెబ్బెన మండలంలో పలు కార్యాలయలలో  మొక్కలు నాటారు. స్థానిక ఆంధ్ర బ్యాంక్ ఆవరణంలో మేనేజర్ భూషి కిషోర్ కుమార్ ,విద్య బోధకురాలు శాంత ,వనమాల ,ఆనంద్,మొక్కల నాటి  పచ్చదనా ప్రగతిగూర్చి తెలియజేశారు . ఈ సందర్బంగ బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ మొక్కలతో సమస్త జీవకోటికి ఉపయోగకరంగా ఉంటుందని, మొక్కల పెంపకం వల్ల కరువు కాటకాలు అధిగమించవచ్చని అన్నారు .

Thursday, 14 July 2016

మొక్కలతో జీవకోటి మానవాళికి ప్రాణవాయువు ; మంత్రి జోగు రామన్న

మొక్కలతో జీవకోటి మానవాళికి ప్రాణవాయువు ; మంత్రి జోగు రామన్న



 రెబ్బెన: జులై 14 (వుదయం ప్రతినిధి); మొక్కలతో సమస్త జీవకోటి మానవాళికి ప్రాణవాయువు లభిస్తుందని అందుచే మనం అందరం మొక్కలు నాటాలని మంత్రి జోగు రామన్న అన్నారు. గురువారం  రెండో విడత హరిత హర కార్యక్రమంలో భాగంగా కాలేజి ప్రాంగణంలో మొక్కలు నాటారు.రాష్ట్ర ముఖ్యమంత్రి తలపెట్టిన బృహత్తర కార్యక్రమాన్ని  ప్రతి ఒక్కరు తమ వంతు భాద్యతగా మొక్కలు నాటుతూ సమాజ శ్రేయస్సు కు పాటుపడాలన్నారు.ఇప్పుడు నాటిన మొక్కలను సంరక్షిస్తే రేపటికి వృక్షాలు అవుతాయని  . వాటితో  ప్రాణవాయువు లభిస్తుందని తెలిపారు , భూగర్భ జలాలు కాపాడుకునే వారిమి అవుతామన్నారు . అలాగే అడవిని పెంచినట్లయితే వన్యప్రాణుల ను సంరక్షి చించిన వారమౌతాము. మొక్కలు మనిషి జననం నుండి మరణం వరకు ప్రత్యక్షంగానూ,పరోక్షంగానూ ఉపయోగపడుతున్నాయి అన్నారు. తెలంగాణ జూన్ 2 ఆవిర్భావదినోత్సవం ముందు పోడు భూములు సాగుచేస్తున్న సన్నకారు చిన్నకారు రైతులు ఆర్హతాలిస్తామని 5ఎకరాలు మంజూరు చేస్తామన్నారు అదే పోదు భూములు అడ్డు పెట్టుకుని భూస్వాములు రిలెస్టేట్ చేసేవారికి చర్యలు తీసుకుంటామని అన్నారు . ఆదిలాబాద్ జిల్లా మొత్తం 86వేల మొక్కలు నటి ముందు వున్నాం అన్నారు .   నేటి మొక్కలే రేపటి వృక్షాలైతే వాటి నీడలో జీవ ప్రాణులు సేద తిర్చుకోవచ్చని ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్  అన్నారు. హరిత హారం లో నాటిన మొక్కలను సంరక్షిస్తే రేపటి వృక్షాలై మన తెలంగాణ హరిత తెలంగాణ మారుతుందని ఎం ఎల్ ఏ కోవా లష్మి అన్నారు .  ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ,మార్కెట్ చైర్మెన్ గంధం శ్రీనివాస్ ,డి ఎఫ్ ఓ వెంకటేశ్వర్లు,యం పిపి కార్నతం సంజీవ్ కుమార్, జడ్ పిటిసి బాబురావు  , సర్పంచ్ పెసరు వెంకటమ్మ ,  వైస్ యం పిపి గొడిసెల రేణుక , తహసీల్దార్ బండారి రమేష్ గౌడ్, యంపిడిఓ లక్ష్మి నారాయణ , మార్కెట్ కమిటీ వైస్ చేర్మెన్ కుందారపు శంకరమ్మ ,టిఆర్ యస్ జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ కుమార్ జైశ్వాల్ ,   ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ కుమార్ ,   టి ఆర్ ఐ జిపి ఎపియం రాజ్ కుమార్ ,ఎం ఈ ఓ వెంకటేశ్వర్లు, టిఆర్ యస్ మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి , మండల,సర్పంచులు ,ఎం పి టి సి లు ,విద్యార్థులు , నాయకులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి

పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి 

రెబ్బెన: జులై 14 (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని పుంజుమ్మెరా గూడ గ్రామంలో ప్రథామిక పాఠశాలలో మౌలిక వసతులు సరిగ్గా లేవాని జె యం బి గిరిజన  ఆసిఫాబాద్ డివిజన్  కన్వినర్ చౌహన్ సంతోష్ పత్రిక ప్రకటనలో అన్నారు  పాఠశాల ఆవరణలో  విద్యార్థులు తీవ్ర ఇబ్బందికి  అవుతున్నారు మరియు నీటి వసతులు సరిగ్గా లేనందుకు విద్యార్థులు    చేసుకుంటున్నారు పాఠశాలలోని పాడుబడిన  బావి నీళ్లు   తాగుతున్నారు  ప్రభుత్వ అధికారులు స్పందించి తక్షణమే బోరుబావి వేయించాలని   అని అన్నారు అదే విదంగా గంగాపూర్ లోని కస్తూర్భా  గాంధీ బాలికల విద్యాలయం లోని పాఠశాలల చుట్టూ కంపౌండ్ వాల్ నిర్మించాలని అదే విదంగా పిల్లలకు ఇచ్చే కాస్మొటిక్ చార్జీలు 50 నుండి 150 కు పెంచాలని జె యం బి గిరిజన సేవా సంఘం కోరారు.

విద్యా సమస్యలపై బంద్ విజయవంత చేయండి -పుదారి సాయికిరణ్

విద్యా సమస్యలపై బంద్ విజయవంత చేయండి -పుదారి సాయికిరణ్  


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ప్రభూత్వ విద్యారంగ సమష్యలు పరిష్కరించాలని వామపక్ష విద్యార్ధ సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన విద్యాసంస్థల బందును  విజయవంతం చేయాలని రెబ్బెన ప్రభుత్వ పాఠశాలలో బుధవారం గోడపత్రాలు విడుదల చేశారు. నేడు జరగ బోయే బంద్ ని విజయవంతం చేయాలని ఏఐఎస్ఎఫ్  మండల అధ్యక్షుడు పుదారి సాయి మాట్లాడారు. పాఠశాల లో ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తి చేయకపోవడం తో విద్యార్థుల సంఖ్య తగ్గు ముఖం పడుతుందని , కావున ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తి చేయాలని అన్నారు. మధ్యాహ్న భోజనం, సంక్షేమ వసతి గృహాలలో పిల్లలకు పెడుతున్న భోజనం లో నాణ్యత లోపం ఉందన్నారు.  వామపక్ష విద్యార్ధ సంఘాల ఆధ్వర్యంలో నేడు విద్యాసంస్థల బందును   విజయవంతం చేయాలని కోరారు.  ఈ సమావేశం లో మహిపాల్, సాయి,చరణ్, ప్రేమ్ సాగర్ ,అశోక్, రవి, శేఖర్, రాజు,  తదితరులు పాల్గొన్నారు.

హరిత హారంలో పచ్చదనం పై విద్యార్థుల ఆవగాహన

 హరిత హారంలో పచ్చదనం పై విద్యార్థుల ఆవగాహన 
రెబ్బెన: (వుదయం ప్రతినిధి);    హరిత హారంలో భాగంగా బుధవారం రెబ్బెన ప్రభుత్వ కళాశాల యూవతి యువకులు చెట్లు నాటలంటూ ప్రధాన విధుల గుండా  నినాదాలు చేస్తూ  కాలినడకన ర్యాలీ నిర్వహించి పచ్చదనం పై ఆవగాహన కల్పించారు.అనంతరం కళాశాల ప్రిన్స్ పాల్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ  హరిత రాష్ట్రం కావాలంటే ప్రతి ఒక్కరు చెట్లు నటి ఇంటికి 5 మొక్కలు పూలు, పండ్లు,నీడ ను ఇచ్చే మొక్కలు నాటాలని  ప్రతి గ్రామం పచ్చదనంతో నిండి రాష్ట్రమంతటా హరిత వనంకావాలని విద్యార్థులు నినాదాలు చేస్తూ ఆవగాహన కల్పించారు   ఈ  కార్యకరంలో విద్యా బోధకులు రాజకుమార్, ప్రవీణ్, గంగాధర్, ప్రకాష్, అమరేందర్ రెడ్డి, శ్రీనివాస్, రామారావ్, జాన్సీ , మంజుల, మల్లీశ్వరి, సంధ్య రాణి, శాంత మరియు విద్యార్థులు పాలుగోన్నారు.

సంక్షేమ వసతి గృహాలపై చిన్నచూపు ;పుదారి సాయికిరణ్

సంక్షేమ వసతి గృహాలపై చిన్నచూపు ;పుదారి సాయికిరణ్


తెలంగాణ ప్రభుత్వంసంక్షేమ వసతి గృహాలపై చిన్నచూపు చూస్తూ విద్యాకాలం మొదలైన ఇంతవరకు వసతి గృహాల విద్యార్థులకు పుస్తకాలు తగు సామాగ్రి అందజేయకుండా నిర్లక్ష్యo  వహిస్తున్నారని  ఏ ఐ  ఎస్ ఎఫ్ మండల కార్యదర్శి  పుదారి సాయికిరణ్  మంగళవారం రెబ్బెన లోని బి సి వసతి గృహంలో ధర్నా నిర్వహించి  అడిగి తెలుసుకుని  మాట్లాడురు.   ప్రభుత్వం సంక్షేమ వసతి వసతి గృహాల్లో సమస్యలు  ఉన్నాయని సమస్యలు పరిష్కరించకపోవడం వలన విద్యార్థులు సంఖ్య  క్రమంగా తగ్గి హాస్టళ్లు మూసివేయుటకు దారి తీస్తున్నాయని అన్నారు.  రెబ్బెన లోని  బి సి  వసతి గృహంలో చివరి సంవత్సరం వరకు ఎస్ సి  హాస్టల్ కొనసాగించారని చుట్టపు చూపు ప్రదర్శిస్తూ  వసతి గృహానికి రావడం లేదని అన్నారు.  విద్యార్థులను రాత్రి సమయములో ఉండాల్సిన వార్డెన్ వాచ్  మెన్ లేకపోవడం వలన విద్యార్థులు బిక్కు బిక్కు మంటూ సమయం వెల్లడిస్తున్నారు నిరుపయోగం గా వున్న మరుగుదొడ్లను పట్టించుకునే వారే లేరని దాని వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్నారని అన్నారు.  జిల్లా వ్యాప్తంగా వున్న వసతి గృహాల్లో వార్డెన్ వాచ్ మేం వంటి పోస్ట్లు ఖాళీగా ఉన్నాయని దాని వల్ల హాస్టల్ విద్యార్థుల సంఖ్య తగ్గి హాస్టళ్లు మూసి వేటకు దారి తీస్తున్నాయని అన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే వసతి గృహ సమస్యలు పరిష్కరించాలని కోరారు .  ఈ కార్యక్రమంలో ,నాయకులు తిరుపతి, కిషోర్ కుమార్ అభిలాష్ ,సాయి ,సుభాష్ ,నవతేజ, తదితరులు  పాల్గొన్నారు.

మాదిగ మహాధర్నాను విజయవంతం చెయండి;జిల్లా కో ఆడ్రినేటర్ మల్లేష్

మాదిగ మహాధర్నాను విజయవంతం చెయండి;జిల్లా కో ఆడ్రినేటర్ మల్లేష్

ఈ నెల 26న ఢిల్లీ జంతర్ మంతర్  వద్ద జరుగు మాదిగ ప్రజా ప్రతినిధుల మహాధర్నాను విజయవంతం చేయలని మాదిగ ప్రజా ప్రతినిధుల జిల్లా కో ఆడ్రినేటర్ మంత్రి మల్లేష్ కోరారు మంగళ వారం రెబ్బెన అతిధి ఘృహ ఆవరణలో పోస్టర్స్ విడుదల చేసి మాట్లాడారు.  భారత రాజ్యాంగ నిర్మాత డా బి ఆర్ అంబెడ్కర్ సాధించినా రేజర్వేషన్ 15%ను ఎస్ సి లోని 59కులాలు తమ తమ జనాభా  ప్రకారం విద్య, ఉద్యోగ ,రాజకీయ మరియు ఆర్థిక రంగాలలో అభివృద్ధి చెందాలని వుద్దేశంతో బాబా సాహెబ్ అంబెడ్కర్ బ్రిటిష్ పాలనలో రేజర్వేషన్ల కోసం అగ్ర వర్గాలతో పోటీపడి సంపాదించిపెట్టిన ఆ సంపాధనచే అన్నదమ్ములుగా  సమాన పంపిణీ కోసం ఏ బి సి డి వర్గీకరణ మాదిగ ఉపకులాల పంపకాలు చేయాలని ఎం ఆర్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం లో 2సం లుగా ఉద్యమించి వర్గీకరణ సమస్యను చివరి ఘట్టానికి తీసుకురావడం జరిగింది అన్నారు  బి జె పి ప్రభుత్వం ఎన్నో సందర్భాలలో వర్గీకరణ సమారిస్తూ మద్దతు పలికిన పార్టీ వర్షాకాల  పార్లిమెంట్ సమావేశంలో ఎస్ సి వర్గీకరణ బిల్లు పెట్టి చట్ట బద్రత  కలిపించాలి ఎస్సి  వర్గీకరణ పై అసెంబ్లీ లో తీర్న్మానం చేసి అఖిల పక్షాన్ని ఢిల్లీ కి తీసుకెళ్లకుండా తేలే విదంగా  రాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ఆర్ మాదిగల పట్ల నిర్లక్షంగా వ్యవహరిస్తున్నదని మాదిగలు మాదిగ ఉపకులాల ఈ నెల 19న ముఖ్యమంత్రి కె సి ఆర్ ఇంటి వద్దకు ర్యాలీగా వెళ్ళడానికి సిద్ధపడ్డారు ఈ నెల 19 వ తేదినుండి వచ్చేనెల 12వ తేదీవరకు చలో ఢిల్లీ కార్యక్రమాలు దశల వారీగా ప్రదర్శనలు దీక్షలు ధర్నాలు జంతర్ మంతర్ వద్ద జరుగును అందులో బాగంగా మాదిగ జాతిలో పుట్టి ప్రజల ఓట్ల చే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు వార్డుమెంబర్ నుండి మొదలు పార్టీలవారు మాదిగ ప్రజా ప్రతినిధులు  మాజీ ప్రతిపాదినులు  జాతి కోసం మేము సైతం ఒక్క రోజు దీక్షలో పాల్గొని విజయవంతం చేయలని కోరారు.  ఈకార్యక్రమంలో ఎం ఆర్ పి ఎస్   తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పొన్నాల . నారాయణ మాదిగ ఎం ఆర్ పి స్  జిల్లా ప్రధానకార్యదర్శి లింగంపల్లి . నాగరాజు మాదిగ  ఎం ఆర్ పి స్  జిల్లా ఉపదక్షులు లింగంపల్లి. ప్రభాకర్ మాదిగ ఎం ఆర్ పి స్  మండలధక్షులు బొంగు. నర్సింగరావు మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Monday, 11 July 2016

కార్మికుల సమస్యలపై పోరు యాత్ర - సీతా రామయ్య

కార్మికుల సమస్యలపై పోరు యాత్ర - సీతా రామయ్య 




 రెబ్బెన: (వుదయం ప్రతినిధి); సింగరేణి  కార్మికుల సమస్యల పోరు యాత్ర కొనసాగిస్తున్నట్లు ఏ ఐ టి యు సి ప్రధాన కార్యదర్శి వాసి రెడ్డి సీత రామయ్య అన్నారు . బెల్లంపల్లి ఏరియా రెబ్బెన మండలంలోని గోలేటి  లోని డోర్లి గని  నుండి సంగరేణిలో పోరుయాత్ర సభలో సోమవారం ఆయన మాట్లాడారు. సింగరేణిలో గుర్తింపు సంఘం కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. టీబీజీకేఎస్‌ గుర్తింపు సంఘంగా ఎన్నికై నాలుగు సంవత్సరాలు పూర్తి కావస్తున్నప్పటికి కార్మికులకు సంబంధించిన ప్రధాన సమస్యల్లో ఏ ఒక్కటి పరిష్కరించలేకపోయిందని అన్నారు. చిన్నచిన్న సమస్యలను పరిష్కరించి తామేదో గొప్పలు సాధించినట్లుగా ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్నారని పేర్కొన్నారు. మరో ఆరునెలల్లో సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో ప్రభుత్వం కార్మికులను మాయచేసేందుకు కుట్రపన్నుతుందని విమర్శించారు. సకల జనుల సమ్మె వేతనాలు ఇవ్వడములో , కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు ఇవ్వడములో టి బి జి కె ఎస్ పూర్తిగా విఫలమైందని తెలిపారు . కార్మికుల సమస్యలను తెలియజేయడం కోసం ఈ పోరు యాత్ర ను సాగిస్తున్నట్లు , ఈ నెల 17 వరకు ఉంటుందని 18 న కొత్తగూడెం హెడ్ ఆఫీస్ లో మాహా సభ ఉంటుందని పేర్కొన్నారు . కార్మికులంతా ఒక్కటేనని , కార్మిక భలం తెలియ జేయాలన్త్వే అందరూ పెద్దస మొత్తములో తరలి వఛ్చి జయప్రదం చేయాలని అన్నారు . అనంతరం  పోరు యాత్ర వాహనాన్ని ప్రారంభిచి ,  గోలేటి లో మోటారు సైకిళ్లపై ర్యాలీ నిర్వహించారు .ఈ సమావేశములోరాష్ట్ర నాయకులు యై గట్టయ్య , అడిషనల్ ప్రధానకార్యదర్శి రంగయ్య , సి పి ఐ  జిల్లా ప్రధాన కార్యదర్శి కలవేణి శంకర్ , గోలేటి బ్రాఞ్చ కార్యదర్శి ఎస్ తిరుపతి , నాయకులు బయ్యా మొగిలి , జగ్గయ్య , చిప్ప నర్సయ్య , శేషు , సంపత్ , శోకాలు శ్రీనివాస్ , రామారావు తదితరులు ఉన్నారు.

Sunday, 10 July 2016

14న విద్యాసంస్థల బందును విజయవంతం చేయండి; దుర్గం రవిందర్

14న  విద్యాసంస్థల బందును  విజయవంతం చేయండి; దుర్గం రవిందర్
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ప్రభూత్వ విద్యారంగ సమష్యలు పరిష్కరించాలని , ప్రైవేటు విద్యాసంస్థల ఆగడాలను అరికట్ట్టాలని వామపక్ష విద్యార్ధ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 14న  తలపెట్టిన విద్యాసంస్థల బందు విజయవంతం చేయాలని ఎ ఐ యస్ యఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవిందర్ అన్నారు రెబ్బెన మండలం గోలేటి కె యల్ మహేందర్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు . టి ఆర్ యస్ ప్రభుత్వ ప్రభుత్వ విద్యారంగంలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలం అయిందన్నారు . అలాగే పాఠశాల లో ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తి చేయకపోవడం తో విద్యార్థుల సంఖ్య తగ్గు ముఖం పడుతుందని , కావున ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తి చేయాలని అన్నారు. మధ్యాహ్న భోజనం, సంక్షేమ వసతి గృహాలలో పిల్లలకు పెడుతున్న భోజనం లో నాణ్యత లోపం ఉందన్నారు, అలానే వసతి గృహాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తి చేయాలన్నారు.  ప్రైవేట్ పాఠశాలలో కనీస వసతులు లేకుండా ఫిజుల పేరులతో వేలాది రూపాయలు వసులు చేస్తున్నారని అన్నారు మండల విద్యార్థి అదికారులు పరోక్షంగా ప్రైవేట్ పాఠశాలలకు మద్దతు పలుకుతూ ప్రభుత్వ పాఠశాలలను మరుగున పడేస్తున్నారు ప్రైవేట్ స్కూళ్లలో పుస్తకాల సామాగ్రిలా పేరుతో దండుకుంటున్నారు. వామపక్ష విద్యార్ధ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 14న  తలపెట్టిన విద్యాసంస్థల బందు  విజయవంతం చేయాలని కోరారు.  ఈ సమావేశం లో కె సాయి,చరణ్ ,ప్రేమ్ సాగర్ ,అశోక్,పుదారి సాయి,కస్తూరి రవి ,మహిపాల్ ,శేఖర్ ,రాజు, సంపత్  తదితరులు పాల్గొన్నారు.

కార్మికులు సమస్యల పరిష్కారానికై పోరుయాత్ర మద్దతు పలకండి ; గోలేటి బ్రంచ్ కార్యదర్శి యస్ తిరుపతి


కార్మికులు సమస్యల పరిష్కారానికై పోరుయాత్ర మద్దతు పలకండి ; గోలేటి బ్రంచ్ కార్యదర్శి యస్ తిరుపతి

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏ ఐ టి యు సి ఆధ్వర్యంలో నేటి నుంచి  జరిగే పోరుయాత్ర ను  కార్మికులు సమస్యల పరిష్కారానికై  మద్దతు పలకాలని ఏ ఐ టి యు సి గోలేటి బ్రంచ్ కార్యదర్శి యస్ తిరుపతి అన్నారు. ఆదివారం రెబ్బెన మండలం గోలేటి ఏ ఐ టి యు సి కార్యాలయంలో   ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. నేటి నుంచి  జరిగే పోరుయాత్ర ను కార్మికుల ఏరియా లో  తిరుగుతూ కార్మికుల సమస్యలను తెలుసు కుంటు వారి సమస్యల పరిష్కారానికై  ఏ ఐ టి యు సి ముందుంటుందన్నారు  18 న కొత్తగూడెం ప్రధాన కార్యాలము ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు . ఈ ధర్నాను పార్టీలకు అతీతంగా అధిక సంఖ్యలో పాల్గొనాలని అన్నారు . ఈ కార్య క్రమములో నాయకులు బయ్యా మొగిలి , సంపత్కుమార్ , సత్యనారాయణ ,రాజేష్ నర్సింగరావు   తదితరులు పాల్గొన్నారు .

జోరు వానలో పోలీసుల హరిత హారం


జోరు వానలో పోలీసుల హరిత హారం 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); మన రాష్ట్ర ప్రభూత్వం ఉద్యమంల చేపట్టిన  హరిత హారం రెబ్బెన పోలీసులు జోరు వానలో శుక్రవారం తుంగడ గ్రామపంచాయతీ లో చెట్లను నాటి ఘనతను చాటారు ఈ సందర్భంగా సిఐ కారుణాకర్ మాట్లాడుతూ నేటి మొక్కలే రేపటి వృక్షాలు అవుతాయని అవి భావితరాలకు ఎంతో ఉపయోగ పడుతాయి వర్షానికి సైతం మా పోలీసు సిబంది మరియు గ్రామప్రజలు హరిత విప్లవంలా మొక్కలను నాటారన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ ఎస్ ఐ శ్రీకాంత్  తుంగడ సర్పంచ్ జుమీడి  లక్ష్మిబాయి, మాజీ సర్పంచులు పర్వతాలు, భగ్వాన్ తదితర గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

చినుకు చినుకు వానకు ఇల్లు కూలి ఆస్తినష్టం

చినుకు చినుకు వానకు ఇల్లు కూలి ఆస్తినష్టం 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన లో శనివారం ఉదయం ఓ ఇళ్లకూలి ఆస్తినష్టం జరిగింది వ్యాపారనిమిత్తం దుకాణానికి వెళ్లగా ఇంట్లో ఎవరూలేని సమయం లో కూలిపోయినాట్లు కమలాబాయి జైశ్వాల్, సంతోష్ జైశ్వాల్, శంకర్ లాల్ జైశ్వాల్ తెలిపారు. గత రెండు రోజులుగా చినుకు చినుకు వానకు ఇల్లు  పాతగోడల మూలాన తడిసి కూలినట్లు పేరుకొన్నారు. అధికారులు గుర్తించి నష్టపరిహారం చెల్లించాలని వారు కోరారు.

Saturday, 9 July 2016

మొక్కలతో ప్రాణవాయువు లభిస్తుంది ; యం ఎల్ ఎ కోవ లక్ష్మి


మొక్కలతో ప్రాణవాయువు లభిస్తుంది ; యం ఎల్ ఎ కోవ లక్ష్మి 

మొక్కలతో  ప్రాణవాయువు లభిస్తుందని యం ఎల్ ఎ కోవ లక్ష్మి అన్నారు రెబ్బెన గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణంలో రెండో విడత హరిత హర భాగంగా  మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి తలపెట్టిన మహాత్సర కార్యాన్ని ప్రతి ఒక్కరు తమ వంతు భాద్యతగా మొక్కలు నాటుతూ సమాజ శ్రేయస్సు కు పాటుపడాలన్నారు ఇప్పుడు నాటిన మొక్కలను సంరక్షిస్తే రేపటి వృక్షాలు అవుతాయి . వాటితో సమస్త జీవకోటి మానవాళికి ప్రాణవాయువు , భూగర్భ జలాలు కాపాడుకునే వారిమి అవుతామన్నారు . అలాగే అడవిని పెంచినట్లయితే వన్యప్రాణుల ను సంరక్షి చించిన వారమౌతాము . మొక్కలు వృక్షాలైతే వాటి నీడలో ప్రాణులు సేద తిర్చుకోవచ్చని అన్నారు . ఈ కార్యక్రమంలో యం పిపి కార్నతం సంజీవ్ కుమార్ , జడ్ పిటిసి బాబురావు  , సర్పంచ్ పెసరు వెంకటమ్మ ,   వైస్ యం పిపి గొడిసెల రేణుక , తహసీల్దార్ బండారి రమేష్ గౌడ్ , యంపిడిఓ లక్ష్మి నారాయణ , మార్కెట్ కమిటీ వైస్ చేర్మెన్ కుందారపు శంకరమ్మ ,టిఆర్ యస్ జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ కుమార్ జైశ్వాల్ ,   ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ కుమార్ ,   టి ఆర్ ఐ జిపి ఎపియం రాజ్ కుమార్ ,  టిఆర్ యస్ మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి , కోఆఫ్సన్ సభ్యుడు జాకిర్ ఉస్మాని , టౌన్ అధ్యక్షుడు రాపర్తి అశోక్ , నాయకులు చిరంజీవి గౌడ్ , సుదర్శన్ గౌడ్ , డి భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు . 

మొక్కలు నాటడడి పర్యావరణాన్ని కాపాడండి ; సి ఐ కరుణాకర్

 మొక్కలు నాటడడి పర్యావరణాన్ని కాపాడండి ; సి ఐ కరుణాకర్  
 
రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  మొక్కలు నాటడముతో పర్యావరణాన్ని కాపాడిన వారము అవుతామని అది అందరి భాద్యత అని రెబ్బెన సి ఐ కరుణాకర్ అన్నారు .  విద్యార్థులకు మొక్కలను పంపిణీ చేశారు . వారు మాట్లాడుతూ నేటి మొక్కలే మనకు ప్రాణ రక్షణ ఇస్టసాయని  వాటిని కాపాడు కునే భాద్యత మన అందరిపైనా ఉందని అన్నారు.  శుక్రవారం మండలములోని  కొండపల్లి , ఖైరిగాం  గ్రామాలలో 2 వ  విడుత హరిత హారం లో కార్య క్రమములో భాగంగా చెట్లను నాటారు . ప్రతిగ్రామములో ఇంటికో  2 మొక్కలు  నాటాలని అప్పుడే మొత్తం ఊరుపచ్చ్చదనం అవుతుందని అన్నారు. విద్యార్థులు ప్రజలు ఉన్నారు. ఈ కార్య క్రమములో తహశీల్ దారి రమేష్ గౌడ్ , ఎం ఈ  ఓ వెంకటేశ్వర్ స్వామి , ఎస్ ఐ దారం , సురేష్ శ్రీకాంత్ , ఆసిఫాబాద్ మార్కెటింగ్ వైస్ చైర్మెన్  కుందారపు శంకరమ్మ , టి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పోటుశ్రీధర్రెడ్డి   , ఏ పి ఓ , కల్పన , సీనియర్ అసిస్టెంట్  వేణు , నాయకులు చిరంజీవి గౌడ్ , సంజీవ్ గౌడ్ లు ఉన్నారు .

మొక్కలను పెంచడం మన భాద్యత- ఎం పి పి

మొక్కలను పెంచడం మన భాద్యత- ఎం పి పి 
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); మొక్కలను పెంచడము మన అందరి భాద్యత  అని ఎం పి పి కార్నాథం సంజీవ్ కుమార్ అన్నారు . శుక్రవారం మండలములోని  కొండపల్లి , ఖైరిగాం  గ్రామాలలో 2 వ  విడుత హరిత హారం లో కార్య క్రమములో భాగంగా చెట్లను నాటారు . ప్రతిగ్రామములో ఇంటికో  2 మొక్కలు  నాటాలని అప్పుడే మొత్తం ఊరుపచ్చ్చదనం అవుతుందని తెలిపారు . ఊరిలో మొక్కలను నాటారు , పంచారు ఈ కార్య క్రమములో తహశీల్ దారి రమేష్ గౌడ్ , ఎం ఈ  ఓ వెంకటేశ్వర్ స్వామి , ఎస్ ఐ దారం , సురేష్ శ్రీకాంత్ , ఆసిఫాబాద్ మార్కెటింగ్ వైస్ చైర్మెన్  కుందారపు శంకరమ్మ , టి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పోటుశ్రీధర్రెడ్డి   , ఏ పి ఓ , కల్పన , సీనియర్ అసిస్టెంట్  వేణు , నాయకులు చిరంజీవి గౌడ్ , సంజీవ్ గౌడ్ లు ఉన్నారు .

మొక్కలే మానవాళికి జీవనాదారం - జీఎం రవిశంకర్

మొక్కలే మానవాళికి జీవనాదారం - జీఎం  రవిశంకర్ 



 రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  ఈ నాటి మొక్కలే భావి తరాలకు జీవనాధారమని బెల్లంపల్లి జెనరల్ మేనేజర్ కె రవి శంకర్ అన్నారు . శుక్రావారం తెలంగాణ హరిత  లోభాగంగా  ఖైరి గూడా ఓ సి పి లో మొక్కలను నాటారు . ముందుగా గోలేటి లోని జెనరల్ మేనేజర్ కార్యాలయము నుండి మహా ర్యాలీ నిర్వ హించారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్త్వకంగా తీసుకొని చేపడుతున్నా హారితహారం లో  సింగరేణి ఆధ్వర్యములో బెల్లంపల్లి ఏరియా లో సుమారు రెండు యాక్టరుల విస్తీర్ణము లో  30, 800 మొక్కలను మొదటి విడత లో నాటామని అన్నారు .   ఈ రోజు మనం తినే ఆహారం, నీరు కలిసితం అవుతున్నాదని, గాలి ని కలుషితం కాకుండా చూసుకోవాల్సిన భాద్యత మన  ఉందని అన్నారు . ప్రతి ఒక్కరు ఇంటికి 2 మొక్కలు నాటితే ఆ గ్రామమే ఉద్యాన వనంగా మారుతుందని ఆయన అఞ్ఞార్రు. ముఖ్య మంత్రి కె సీఆర్ రాష్ట్రాన్నే  హరితం చేయాలనే కోరికతో ఉద్యమముల తీసుకెళుతున్నారని అన్నారు . సామాజిక భాద్యతగా ప్రతి ఒక్కరు మోకాలు నాటి కాపాడాల్సిన భాద్యతగ అందరిపై ఉందని తెలిపారు . మొత్తం 6 లక్షల     మొక్కలను బెల్లంపల్లి ఏరియా లోనాటుతున్నట్లు ఆయన తెలిపారూ . రాబోయే కాలములో అడవిలో తెలంగాణ ను ముఖ్య మంత్రి కె     సి ఆర్ చుడాలీని , దానికోసం మొక్కలను పెంచాలని పేర్కొన్నారు . ఈ కార్య క్రమములో ఎస్ ఓ టు జి  కొండయ్య , డి జి ఎం చిత్తరంజన్ , సేవ సమితి అధ్యక్షురాలు అనురాధ , టి బి జి కె ఎస్ సెంట్రల్ కార్యదర్శి ఎంశ్రీనివాసరావు , ఏ ఐ టి సి బ్రానుంచి కార్య దర్శి ఎస్ తిరుపతి , పర్య వరణ అధికారి కృష్ణా చారీ , ఏ జి ఎం రామ రావు , ఐ ఈ డి యోహాన్ , తది తరులు  ఉన్నారు

Thursday, 7 July 2016

పర్యావరణాన్ని కాపాడడం అందరి భాద్యత

పర్యావరణాన్ని కాపాడడం అందరి భాద్యత 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); మొక్కలు నాటడముతో పర్యావరణాన్ని కాపాడిన వారము అవుతామని అది అందరి భాద్యత అని రెబ్బెన ఎస్ ఐ లు దారం సురేష్ , శ్రీకాంత్ లు అన్నారు . గురువారం మండలములోని లక్ష్మీ పూర్ గ్రామంలో విద్యార్థులకు మొక్కలను పంపిణీ చేశారు . వారు మాట్లాడుతూ నేటి మొక్కలే మనకు ప్రాణ రక్షణ ఇస్టసాయని  వాటిని కాపాడు కునే భాద్యత మన అందరిపైనా ఉందని అన్నారు . ప్రతి ఇంటికి 2 మొక్కలు నాటితే గ్రామమే పాచ్చ్చదనంగా మారుతుందని అన్నారు . ఈ కార్య క్రమములో గంగాపూర్ సర్పంచ్ రవీందర్ తో పాటు విద్యార్థులు ప్రజలు ఉన్నారు.

మంత్రి జోగు రామన్న ను పరామర్శించిన మార్కెట్ వైస్ చైర్మెన్

మంత్రి జోగు రామన్న ను పరామర్శించిన మార్కెట్ వైస్ చైర్మెన్ 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ను ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ కుందారపు శంకరమ్మ పరామర్శించారు .మంత్రి  జోగు రామన్న తండ్రి మరణించడముతో ఆదిలాబాద్ లోని దీపాయి గూడా కు వెళ్లి ప్రత్యకంగా కలిశారు . ఈమె తో పాటు టి ఆర్ ఎస్ రాష్ట్ర మహిళా కార్య దర్శి ఈ  జె సి ప్రమిల, సోమగూడెం అధ్యక్షురాలు యాచక భాగ్య లష్మి , టి బి జి కె ఎస్ నాయకులు దాసరి శంకర్ లు ఉన్నారు 

రెబ్బెన లో రంజాన్ సంబరాలు

రెబ్బెన లో రంజాన్ సంబరాలు 
రెబ్బెన లో రంజాన్ సంబరాలు 



రెబ్బెన: (వుదయం ప్రతినిధి); నెలరోజుల ఉపవాసాల అనంతరం నెలవంక కనిపించిన అనంతరం పవిత్ర రంజాన్‌  పర్వదినం ను పురస్కరించుకుని  గురువారం నాడు రెబ్బెన మండలంలోని ఈద్గా వద్ద ప్రార్థనలు చేశారు. ఈ  సందర్భంగాముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో ఈద్గాల వద్ద చేరుకొని ప్రార్థనలు చేశారు.సర్వ మానవాళి క్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ప్రత్యేక ప్రార్థనల కోసం చేసిన ఏర్పాట్లను ముస్లిం మత పెద్దలు  ముస్లింలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ ఏర్పాట్లు చేశారు. పండుగ రోజు బంధువు, మిత్రులను కలిసి ముస్లిం సోదరులు ఆలింగనము చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు.ఈసందర్బంగా ముస్లీం సోదరులకు రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ఈద్గాల వద్దకు వెళ్లి రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఈద్గాల వద్ద హరిత హారములో భాగంగా మొక్కలు నాటారు . 

మ్యారేజ్ బ్యూరో వారు ముస్లిం మహిళాలకు చీరల పంపిణీ

మ్యారేజ్ బ్యూరో వారు ముస్లిం మహిళాలకు చీరల పంపిణీ



 రెబ్బెన: (వుదయం ప్రతినిధి); మంచిరియాల్; రంజాన్ సందర్భముగా రాష్ట్ర మ్యారేజ్ బ్యూరో  అధ్యక్షుడు దాసరి ధర్మేందర్ ముఖ్య అతిధి గా హాజరు అయి ముస్లిం మహిళా సోదరి మానులకు చీరల పంపిణీ చేశారు తెలంగాణ ఆల్  మ్యారేజ్ బ్యూరోస్  అసోసియేషన్ వారు బుధవారం మంచిరియాల్  లో   ఎరుపాక  బుచ్చిబాబు అధ్యక్షతన ఆదిలాబాద్ జిల్లా సర్వ సభ సమావేశం ఏర్పాటు చేశారు  వారు మాట్లాడుతూ మ్యారేజ్ బ్యూరోలో కుల మతాలకు అతి హితముగా అన్ని వర్గాల వారికి జీవితాన్ని పంచుతున్నాం అలాగే ముస్లిం మహిళా సోదరి మానులకు చీరల పంపిణీ చేశాము అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సాంబ లక్మి ,జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిపెల్లి తిరుపతి, రాష్ట్ర సహాయ కార్యదర్శి మేకల నరేష్ యాదవ్ సభ్యులు పాల్గొన్నారు 

Wednesday, 6 July 2016

హరిత హారంలో అందరూ పలు పంచుకోవాలి -జెడ్ పి టి సి అజ్మీర బాబురావు

హరిత హారంలో అందరూ పలు పంచుకోవాలి

-జెడ్ పి టి సి అజ్మీర బాబురావు


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); తెలంగాణ ప్రతిష్టాత్మకంగా  చేపట్టిన హరిత హారం కార్యక్రమం ఈ నెల 8 నుంచి 23 వరకు జరగబోయే హరితహారం కార్యక్రమంలో అధికారులు,స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు  అందరూ పలు పంచుకోవాలి అని,ముఖ్య అతిధిగా జెడ్ పి టి సి అజ్మీర బాబురావు  అన్నారు.  రెబ్బెన మండలం స్థానిక ఎమ్ పి డి ఓ కార్యాలయం  హరిత హారం కార్యక్రమం లో   జెడ్ పి టి సి అజ్మీర బాబురావు,  రెబ్బెన తహసీల్దార్ రమేష్ గౌడ్,ఎమ్ పి డి ఓ లక్ష్మినారాయణ మాట్లాడారు    చెరువుల గట్ల మీద ఈత చెట్లను నాటాలి రోడ్లకి ఇరువైపులా చెట్లు నాటాలి శాఖం భూములలో దేవాలయాలలో, పాఠశాలలో , మసీద్ లలో,  చర్చిలలో, ఇంటి చుట్టుపక్కలలో నీడని ఇచ్చే చెట్లు పూల మొక్కలు , పళ్ల మొక్కలు ,నాటాలి అన్నారు ఈ యొక్క చెట్లు నాటే  బాధ్యత గ్రామ సర్పంచ్,ఎమ్ పి టి సి లు ,వార్డు మెంబర్లు ,అంగన్ వాడి కార్యకర్తలు ,విద్యార్థులు , ఈ జి ఎస్ ప్రజల పైన ఉంది అని అన్నారు . ప్రతి గ్రామా పంచాయితీ  కి 40,000 మొక్కలు నాటి వాటికి పోషణ చేపట్టి నట్లయితే లక్ష రూపాయల బహుమతి అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో  ఏ  పి ఓ కల్పన, ఆ పి ఎమ్ రాజకుమార్, ఎమ్ ఈ ఓ వెంకటస్వామి, అంగన్ వాడి కార్యకర్తలు, సర్పంచ్ లు  పాల్గొన్నారు 
మ్యారేజ్ బ్యూరో