Wednesday, 31 January 2018

హరినామస్మరణతో హోరెత్తిన గంగాపూర్

అత్యంత భక్తి  శ్రద్దలతో స్వామివారి   రథోత్సవం
ఆనందోత్సాహాలతో  జాతర 

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 31 ; మాఘ శుద్ధ పౌర్ణమి సంధర్బంగా బుధవారం  నాడు కుమురం భీమ్ జిల్లా రెబ్బెన మండలం గంగపూర్ లో గల శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామీ రధోత్సవం   భక్తజన సంద్రోహం మధ్య ఘనంగా జరిగింది. ప్రతి ఏట నిర్వహించే ఈ జాతరకు భక్తులు భారీ సంఖ్యాలో పాల్గొన్నారు.భక్తుల సౌకర్యర్ధం ధర్మ దర్శనము,ప్రత్యేక దర్శనము, విఐపి దర్శనములు ఏర్పాటు చేశారు. స్వామీ వారిని దర్శించుకునేందుకు విచ్చేసిన  భక్తుల సౌకార్యార్ధం  కొంతమంది భక్తులు, వ్యాపారులు, కలసి  అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదే విధంగా త్రాగునీటి సమస్య ఏర్పడకుండా వివిధ స్వచ్చంధ సంస్థలు,జిల్లా గ్రామీణ నీటి సరఫరా సంస్థ ఆధ్వర్యంలో  త్రాగు నీరు అందించారు.. వైద్య ఆరోగ్య శాఖ మరియు రెబ్బెన ప్రభుత్వ వైద్య సిబ్బంది  ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. వ్యవసాయ శాఖ,అంగన్వాడీ వారి అద్వర్యం లో స్టాల్స్ ఏర్పాటు చేశారు. జాతరకు హాజరైన భక్తులు మాట్లాడుతూ సౌకర్యాలను మరింత మెరుగు పరచాలని, గంగపూర్ ను పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని కోరారు.అదే విధంగా  రెబ్బెన నుండి గంగపూర్ వెళ్లే తారు రొడ్డును రెండు వరసల రహదారిగా నిర్మించాలని అన్నారు.జాతరలో ఏర్పాటు చేసిన జైంట్  వీల్ ,వివిధ ఆటలు భక్తులను ఆకట్టుకున్నాయి.జాతరలో ఈ జాతరలో ఎలాంటి అవాంఛనీయ  సంఘటనలు,ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండ డిఎస్పీ సత్యనారాయణ మరియూ రెబ్బెన సిఐ పురుషోత్తం అద్వర్యం లో 270 మంది పోలీస్ తో విధులు నిర్వహించారు.  మధ్యాహ్నం రెండు గంటలనుండి  చంద్రగ్రహణం   ఉన్నందున  సాయంకాలం జరగాల్సిన స్వామివారి రధోత్సవం  ఉదయం పదకొండు  ఒంటిగంట మధ్య  జరిగినది .  ఆలయన్న్ని కూడా మధ్యాహ్నం 2 గంటల నుండి ఉదయం 3 గంటల వరకు మూసివేయనున్నారు తిరిగి ఉదయం 4 గంటలకు ఆలయాన్ని శాస్త్రీయముగా శుద్ధిపరచి భక్తుల దర్శనార్థం తెరవనున్నామని దేవాలయ సిబ్బంది మరియు అర్చకులు తెలిపారు.

Tuesday, 30 January 2018

కన్నులపండుగగా గంగాపూర్ శ్రీనివాసుడి కళ్యాణం

కన్నులపండుగగా  గంగాపూర్ శ్రీనివాసుడి కళ్యాణం  ప్రారంభమైన గంగాపూర్ జాతర 
స్వామి వారి కల్యాణం
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 30 ; కన్నులపండుగగా  రెబ్బెన మండలంలోని గంగాపూర్ గ్రామా శివారులో వెలిసిన బాలాజీ వెంకటేశ్వరస్వామి వారి కళ్యాణం మంగళవారం నాడు  కడురమణీయంగా  వైభవంగా వేదమంత్రాల నడుమ వెలది  భక్తుల   మద్య   జరిగింది.  భక్తులు స్వామి వారి మండపంలో వేదపండితులచే  వేదమంత్రోచ్చారణలతో స్వామివారి కల్యాణాన్ని జరిపించారు. రెబ్బెనమండలంలోని వివిధ గ్రామాలనుంచి భక్తులు తరలి వచ్చి స్వామివారి కల్యాణాన్ని తిలకించి పరవశించారు.  కళ్యాణం అనంతరంకొందరుభక్తులుఅన్నదానకార్యక్రమం నిర్వహించారు.మండలంలోని వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో భక్తులకు భద్రతా, త్రాగునీటి సదుపాయం, కల్పించారు. ఈ కార్యక్రమంలో వ లంటీర్లు సేవలు అందించారు.  రేపు జరిగే రధోత్సవమునకు వే లాది  భక్తులు  తరలి  వస్తారని నిర్వాహకులు తెలిపారు. 

జాతిపితకు శ్రద్ధాంజలి

జాతిపితకు  శ్రద్ధాంజలి 
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 30 ;  జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం ఉదయం 11 గంటలకు కొమురంభీం జిల్లాలోని అన్ని మండలాల్లో రెండు నిముషాలు మౌనం పాటించి భారత స్వతంత్ర సంగ్రామంలో అమరులైన వీరులకు శ్రద్ధాంజలి  ఘటించారు. జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్లో జిల్లా పాలనాధికారి కార్యాలయం ఎదుట అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు రెండు నిముషాలపాటు మౌనం పాటించి నివాళు లర్పించారు.   .  రెబ్బెన మండలం కేంద్రంలో ప్రధానకూడలిలో రెండు నిముషాలు   మండల తహసీల్దార్, రెబ్బెన స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో గ్రామస్తులు మానవహారంగా ఏర్పడి మౌనం పాటించి బాబుజీ కి నివాళులు  అర్పించారు. 

సాంకేతిక కారణాలతో నిలిచిన పాట్నా ఎక్సప్రెస్

సాంకేతిక కారణాలతో నిలిచిన పాట్నా ఎక్సప్రెస్ 


కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 30 ;  సికింద్రాబాద్ నుండి దానాపూర్ వెళ్తున్న  పాట్నా ఎక్సప్రెస్  మంగళవారం ఆసిఫాబాద్ రైల్వే స్టేషన్ సమీపాన గల గంగాపూర్ రైల్వే గేట్ వద్ద మధ్యాహ్నం మూడు గంటల పది నిముషాళ్ళనుండి సుమారు అర్ధగంట పటు సాంకేతిక కారణంతో నిలిచిపోయినది. అనధికారిక సమాచారం ప్రకారం ఒక పశువును ఢీ  కొనడంతో దాని అవశేషాలు బ్రేక్ లైనర్లను పనిచేయనివ్వకపోవడంతో రైలుబండి నిలిచిపోయిందని ,అవశేషాలను  తొలగించిన తరువాత తిరిగి బయల్దేరింది  అన్నారు

ఈ పాస్ విధానంలో రేషన్ సరకుల సరఫరా

ఈ పాస్ విధానంలో రేషన్ సరకుల  సరఫరా 
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 30 ;   కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో  ఫిబ్రవరి నెల నుండి తెల్ల రేషన్ కార్డు దారులకు ఈ - పాస్ విధానంలో రేషన్ సరకులను  సరఫరా చేయనున్నట్లు సహాయ పౌర సరఫరా అధికారి ఏ  స్వామి కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి నెలనుంచి ఈ - పాస్ పరికరంలో కుటుంబ సభ్యుని వేలి ముద్ర సేకరించి సరుకులను సరఫరా చేస్తారని అంన్నారు.

పశువులకు నట్టల మందు పంపిణి

పశువులకు  నట్టల మందు పంపిణి 

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 30 ;  కొమురం భీం జిల్లాలోని రెబ్బెన మండలం ఇందిరానగర్ గ్రామంలో గొర్రెలకు, మేకలకు సామూహికంగా జిల్లా పశు  వైద్యాధికారి డాక్టర్ కుమారస్వామి ఆధ్య్వర్యంలో  నట్టల నివారణ మందును పంపిణి చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఇందిరానగర్ గ్రామంలో 330  గొర్రెలకు, 71 మేకలకు మందును  అందించడం జరిగిందన్నారు.  ప్రభుత్వం సబ్సిడీ పై అందచేసిన గొర్రెలను సరైన యాజమాన్య పద్దతిలో పెంచుకొని ఆర్ధికంగా లబ్ది పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  రెబ్బెన సర్పంచ్ పెసర వెంకటమ్మ ,మండల పశు వైద్య సిబ్బంది డాక్టర్ సాగర్  తదితరులు పాల్గొన్నారు. 



Monday, 29 January 2018

పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుల పట్ల తక్షణం స్పందిచాలి – జిల్లా ఎస్పి కల్మేశ్వర్ సింగెనవార్

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 29 ;  పోలీసు స్టేషన్ కు వచ్చే బాధితుల ఫిర్యాదుల పట్ల సత్వరం స్పందించాలి అని అధికారులే స్వయముగా ఫిర్యాదు దారుల యొక్క ఫిర్యాదులను తెలుసుకోవాలని జిల్లా ఎస్పి కల్మేశ్వర్ సింగెనవార్  తెలిపారు. సోమవారం స్థానిక జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పి అద్వర్యం లొ ప్రజా ఫిర్యాదుల విబాగం ను నిర్వహించి,వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుల ను జిల్లా ఎస్పి స్వయముగా స్వీకరించారు, ప్రజా ఫిర్యాదు లో నజిజ్ అహ్మద్  జనకాపూర్ ఆసిఫాబాద్ మరియు  బొమ్మినేని గిరిబాబు రెబ్బెన లు తమ తమ భూములను అన్యులు అక్రమము గా ఆక్రమించుకొని తమకు అన్యాయం చేస్తున్నారని ఫిర్యాదు చేసారు.వరంగల్ కు చెందిన సంగీత్ రావు తన చెల్లెలి కి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసి మోసం చేశారు అని జిల్లా ఎస్పీ కు ఫిర్యాదు చేశారు.ఇంకా   జిల్లా లోని  పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ తమ ఫిర్యాధులను జిల్లా ఎస్పి కు విన్నవించారు సమస్యల పైన స్పందించిన జిల్లా ఎస్పి ఫిర్యాదు దారులకు సాంత్వన చేకురేలా చర్యలు తీసుకుంటానని ఫిర్యాదుదారులకు హామీ ను ఇచ్చారు, తగు సూచనలతో సంబందిత అధికారులను ఫిర్యాదులు పరిష్కారం అయ్యేలా ఆదేశించారు. ఈ కార్యక్రమం లో  అడ్మినిస్ట్రేషన్ అధికారి భక్త ప్రహలద్,ఎస్బి సీ ఐ సుధాకర్, డిసీఆర్బీ ఎసై రాణాప్రతాప్,సీనియర్ అసిస్టెంట్ ఇంతియాజ్ , అజయ్ వర్మ ,ఫిర్యాదుల విభాగం అధికారిని సునీత మరియు పీ ఆర్ ఓ మనోహర్ లు  పాల్గొన్నారు.

వికలాంగులందరికి ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందచేయాలి

వికలాంగులందరికి ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందచేయాలి
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 29 ;   వికలాంగులందరికి ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందచేయాలని  మండల వికలాంగ సమాఖ్య ఆధ్వర్యం లో సోమవారం రెబ్బెన మండల  వికలాంగులందరికి ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందచేయాలి కార్యాలయంలో వి ఆర్ ఓ రవి కి వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు వి గోపాలకృష్ణ మాట్లాడుతూ వికలాంగులందరికి ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందచేయాలని, వికలాంగులకు బ్యాంకుల్లో  అధికారికంగా ఖాతాలను తెరిపించి  ప్రత్యేక రుణాలు అందించి   ప్రతి వికలాంగుడికి ఆర్థికంగా ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేశారుఈ కార్యక్రమంలో  జె  బి వినోద్, రాకేష్, ప్రభాకర్ సరిత  తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వప్రాధమిక పాఠశాలలో వాటర్ ఫిల్టర్ వితరణ




కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 29 ;   రెబ్బెన మండలం ఖైర్గుడా గ్రామంలోని ప్రభుత్వప్రాధమిక   పాఠశాల  విద్యార్థుల కు రక్షిత మంచినీరు అందించే ఉద్దేశంతో  అదే గ్రామానికి చెందిన పాఠశాల పూర్వ విద్యార్థి షేక్  అజీమ్ సోమవారంనాడు వాటర్  ఫిల్టర్ ను విరాళంగా అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదే పాఠశాలలో చదువుకున్నానని ఆ అభిమానంతో విద్యార్థుల ఉపయోగం కోసం  రక్షిత మంచినీటి పరికరాన్ని అందించినట్లు తెలిపారు. ఈ  కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి, ఉపాధ్యాయులు, తది తరులు పాల్గొన్నారు.   

Sunday, 28 January 2018

కోరిన వరాలిచ్చే గంగాపూర్ బాలాజీ



కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 28 ;  రెండవ తిరుపతిగా తెలంగాణాలో పేరొందిన  శ్రీ బాలాజీ  వేంకటేశ్వరస్వామి  దేవాలయం కొమురం భీం  అసిఫాబాద్  జిల్లా    రెబ్బన మండలం లోని గంగాపూర్ గ్రామ శివారులో గల గుట్ట పై  కొలువై ఉన్నాడని భక్తుల ప్రగాఢనమ్మకం.  ప్రీతి ఏటా  మాఘశుద్ధ పౌర్ణమి నాడు తిరుపతిలో కొలువైన భగవానుడు గంగాపూర్ కి వస్తాడని తిరుపతి లో  కొన్ని ఘడియలు పాటు దేవస్థాన సింహద్వారాలు మూసివేస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకం.శ్రీ వేంకటేశ్వరస్వామి సతీసమేతంగా కొలువై ఉండడంతో పాటు శివాలయం ,హనుమంతుని విగ్రహలు కొలువై ఉన్నాయి కావున ఇట్టి దేవాలయం ను  రెండవ  తిరుపతిగా  ప్రజలు భావిస్తారు.  ఈ దేవాలయం 13వ శతాబ్దానికి ముందు వెలిసినది అని చారిత్రక ఆధారాల ప్రకారం గంగాపూర్ గ్రామానికి చెందిన ముమ్మడి పొతాజి విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు అతడికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఫై అమితమైన భక్తి కలిగి ఉండేది దీనితో ప్రతి ఏటా అతను తిరుమల తిరుపతి దేవస్థానానికి కాలిబాటన వెళ్లి మొక్కులు తీర్చుకునేవాడు.   అతని వయస్సు  ఫై బడడం తో  స్వామి వారి వద్దకు వెళ్లే పరిస్థితి  లేక పోవడం తో మనస్థాపానికి గురయ్యాడు దీనితో స్వయంగా శ్రీ  వెంకటేశ్వరా స్వామి కనిపించి నీవు చింత చెందవలసిన అవసరం లేదని గంగాపూర్ శివారులోని గుట్టపై ప్రకృతి ఒడిలో దర్శనం ఇచ్చి వెలిసాడు  అప్పటినుండి  ప్రతి సంవ్సతరం మాఘశుద్ధ పౌర్ణమి కి మూడు రోజులపాటు జాతర ఘనంగా నిర్వహిస్తారు మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరలో రెండవ రోజును భక్తులు పవిత్ర దినంగా భావిస్తారు కొత్తగా ఏర్పాటైన కుమరంభీమ్ జిల్లాలో అతిపెద్ద జాతరగా జరగనుంది.   గంగాపూర్ జాతరలో మరో ప్రత్యేక త రథోత్సవం కార్యక్రమం జాతరలో రెండో రోజున శ్రీవెంకటేశ్వర స్వామి సతిసమేతంగా రథోత్సవంలో వేలాది భక్తులు పాల్గొంటారు . ఈ జాతరకు ఆసిఫాబాద్ మరియు మంచిర్యాల డిపోల నుండి బస్సు సౌకర్యం కలదు    . ఈ నెల 30,31 లలో  జరిగే  కళ్యాణం మరియు జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని దేవాలయ కార్యనిర్వహణాధికారి బాపి రెడ్డి, స్వచ్చంద  సంస్థలైన వెంకటేశ్వర యూత్ సంఘం అధ్యక్షులు విలాస్ తెలిపారు.

గంగాపూర్ దేవాలయంలో 30న కళ్యాణం లడ్డు వేలం

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 28 ;  రెబ్బెన:  కొమురం భీం జిల్లా రెబ్బెన మండలం లోని గంగాపూర్ గ్రామంలో రెండవ తిరుపతి గా  పేరొందిన శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జనవరి  ,30,31 తేదీలలో జరిగే కళ్యాణం,రధోత్సవం,జాతరను పురస్కరించుకొని 30 వ తారీఖున స్వామివారం కళ్యాణంరోజున కళ్యాణం లడ్డు వేలంపాట నిర్వహించి మూడురోజులపాటు పూజాదికాలు నిర్వహించి వేలం పాటలో విజేతగా నిలిచినా భక్తునికి 1 వ తేదీ సాయంత్రం అందచేయబడునని ఆలయ కార్య నిర్వహణ అధికారి బాపి రెడ్డి, గంగాపూర్ శ్రీ వెంకటేశ్వర యూత్ అసోసియేషన్ అధ్యక్షులు విలాస్  ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లడ్డు చాల విశిష్టమైనది, పొందినవారికి ఆయురారోగ్యములు , ఐశ్వర్య సిద్ది కలుగునని భక్తుల విశ్వాసం. కావున భక్తులు పెద్ద సంఖ్యలో 30 వ తారిఖున స్వామివారి కల్యాణ మహోత్సవానికి ముందు వేలం పాట ఉంటుందని భక్తులు గమనించి విజయ వంతం చేయగలరని అన్నారు. 

నాలుగో విడత మిషన్ కాకతీయ పనులు ప్రారంభం

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 28 ;  రెబ్బెన: తెలంగాణ రాష్ట్రము లో రైతులు పండించే పంటలకు ఎల్లకాలం పుష్కలంగా సాగునీరుని అందించే ఉద్ధ్యేశంతో  రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టిన చెరువుల పూడిక తీత మిషన్ కాకతీయ ఫేజ్ -4 పనులను ఆదివారం  రెబ్బెన మండలంలోని పలు గ్రామాలలో జిల్లా  ఆసిఫాబాద్ నియోజకవర్గం  ఎమ్మెల్యే కోవా లక్ష్మి ప్రారంభించారు. సందర్బంగా మండలంలోని  గ్రామాల్లో పలు చెరువుల పూడిక తీత పనులకు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. అనంతరాం మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్  ఎంతో ముందుచూపుతో  రైతులకు సాగు నీరు అందించలానే ముఖ్య ఉద్దేశంతో చెరువుల మరమత్తుల పనులు చేపట్టడం ఒక గొప్ప బృహత్తర కార్యక్రమం అని వారు  అన్నారు. ప్రతి రైతుకు సాగు నీరు అందించడమే ప్రధాన అంశంగా మిషన్ కాకతీయ పనులు కొనసాగుతున్నాయని అన్నారు.తెలంగాణా ప్రభుత్వం వచ్చిన  తర్వాతే ప్రజా సౌకర్యాలు మేరుగుపడ్డాయని మిషన్ కాకతీయ చెరువుల పునరుద్దరన,మరమత్తుల వల్ల సాగు భూములకు మేలు జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అజమీర బాబు రావు, ఎంపీటీసీ కర్నాధం సంజీవ్ కుమార్,  ,మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ, డి ఈ రవీందర్, ఈ ఈ గుణవంత రావు, తెరాస మండల అధ్యక్షులు పోటు  శ్రీధర్ రెడ్డి,తెరాస నాయకులూ చెన్న  సోమశేఖర్,,,మల్రాజ్ శ్రీనివాస్, పోతు రెడ్డి, దుర్గం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.   

రెండు వేల పందొమ్మిది ఎన్నికలలో గెలుపు బీజేపీదే : జేబి పౌడెల్

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 28 ;  రెబ్బెన: ప్రధానమంత్రి నరేంద్రమోడీ అమలు చేస్తున్నప్రజా సంక్షేమ పథకాలు, అవినీతి  రహిత పాలనను దృష్టిలో పెట్టుకొని   రెండు వేల పందొమ్మిదిలో  జరిగే ఎన్నికల్లో బీజేపీ  గెలుపే లక్ష్యం గ పనిచేయాలని కార్యాలకర్తలకు  జిల్లా అధ్యక్షుడు  జెపి పడేల్ పిలుపునిచ్చారు. .  ఆదివారం రెబ్బెన మండలం  గోలేటి భారతీయ జనతా పార్టీ  జిల్లా కార్యాలయంలో ఆయన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమితులైన డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ ని  సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి పేద ప్రజలకు ఎన్నో నిధులు ప్రధాని  నరేంద్రమోడీ కేటాయిస్తున్నారని  ఏ పార్టీ ఎలాంటిదో ప్రజలకు తెలుసు అని   రెండు వేల పందొమ్మిదిలో  జరిగే ఎన్నికల్లో బిజెపి పై స్థానంలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో  జిల్లా ప్రధాన కార్యదర్శి కేసరి ఆంజనేయులుగౌడ్. టాకుర్ విజయ్ సింగ్. జిల్లా ఉపాధ్యక్షులు వై క్రుష్ణ కుమారి. జిల్లా కార్యదర్శి అన్నపూర్ణ సుదర్శన్ గౌడ్ ఆసిఫాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గుల్బం చక్రపాణి. సిర్పూర్ కాగజ్ నగర్ అసెంబ్లీ కన్వీనర్ కోంగ సత్యనారాయణ. తదితరులు  పాల్గొన్నారు.

దొంగ నోట్ల చలామణి చేసేతున్నముఠా అరెస్ట్

  • 4,06,100 /- రూపాయలు, 6 మొబైల్ ఫోన్ లను  స్వాదినంకొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 28 ;  కుమ్రం భీమ్ జిల్లా కాగజ్ నగర్ ప్రాంతం లో గత కొంతకాలంగా  దొంగ నోట్లను చలామణి చేసే ముఠాను ఆదివారం అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పి కల్మేశ్వర్ సింగేనవార్ మీడియా ప్రతినిదులకు వెల్లడించారు. జిల్లా లోని స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్ నందు గల పోలీస్ సమావేశ మందిరము లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో   జిల్లా ఎస్పి మాట్లాడుతూ 6 గురు నిందితులు గల ముఠా జిల్లా లోని కొన్ని ప్రాంతాలలో నఖిలి నోట్లు  చలామణి చేస్తుండగా పక్కా   సమాచారం తో వారిని పట్టుకోవడం జరిగిందని తెలిపారు. విలాసవంతమైన జీవితం కోసం నిందితులు ఒక ముఠా గా ఏర్పడి 100 దొంగనోట్లకు 30 అసలు నోట్లు గా  చలామణి చేసేలా ఒప్పందం తో  4,06,100/- తో   కాగజ్ నగర్ వచ్చి  1,72,300/-  ఇచ్చి   మిగితా నకిలీ  నోట్లుతో   బస్సు లో అక్కడ నుంచి వెళ్లి పోయారు . 27.01.2018  నాడు నమ్మదగిన సమాచారం మేరకు కాగజ్ నగర్ పోలీసులు , స్పెషల్ బృందం తో పక్క ప్రణాళిక తో వల పన్నిముగ్గురు   నిందితులను  రైల్వే స్టేషన్ ఏరియా  నందు, మిగతా ముగ్గురిని  బస్సు స్టేషన్ సమీపమందు పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు.   మరియు వారి దగ్గర గల మొత్తం నకిలీ నోట్లవిలువ 4,06,100 /- రూపాయలు, 6 మొబైల్ ఫోన్ లను  స్వాదినం చేసుకొని వారిని అదుపులోకి కేసు నమోదు చేయడం చేయడం జరిగిందన్నారు. 

Saturday, 27 January 2018

నేడు పల్స్ పోలియో కార్యక్రమం 



కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 27 ;   జాతీయ పోలియో నిర్ములన కార్యక్రమంలో భాగంగా నేడు జరిగే పల్స్ పోలియో కర్తక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని డిప్యూటీ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సీతారాం  చెప్పారు. రెబ్బెన మండలం ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన సమీక్షలో మాట్లాడుతూ మండలంలో ఉన్న అన్ని గ్రామాలలో ఉన్న 0 నుండి 5 సంవత్సరాల పిల్లలకు తప్పని సరిగా పోలియోచుక్కలు వేయించాలని, ఇంటింటికి వైద్య సిబ్బంది వచ్చే ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రధాన బస్టాండ్లలో కూడా సిబ్బంది అందుబాటులో ఉంటారంన్నారు.

 తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం జెండా ఆవిష్కరణ   

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 27 ;   తెలంగాణ బొగ్గు గని  కార్మిక సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని  శనివారం బెల్లంపల్లి ఏరియా గోలేటిలోని తెలంగాణ భవన్ లో  జండాను ఎగురవేసి సంఘం ఏరియా ఉపాధ్యక్షులు సదాశివ్  మాట్లాడుతూ టి బి జి కే ఎస్ ఆవిర్భవించి నేటికీ పదిహేనేళ్ళైందని, ఈ సంఘం  కార్మికుల  సంక్షేమం కోసమేనని ,ఈ సంఘం ఆహర్నిశలు కార్మికుల సంక్షేమంకోసం పాటుపడుతున్నదని, ఈ విషయాన్నీ గమనించి  మొన్న జరిగిన సింగరేణి  ఎన్నికలలో కార్మికులు ప్రధాన గుర్తింపు సంఘంగా ఎన్నుకొన్నారన్నారు. ఈ సందర్భంగా అన్నిబావులవద్ద,  ఓపెన్ కాస్ట్ ల వద్ద  సంఘం జండాలను ఎగురవేసి కార్మికులు తమ ఆనందాన్ని వ్యక్త పరిచారన్నారు.  ఈ కార్యక్రమంలో నాయకులు  ప్రకాష్ రావు , శంకర్ తదితరులు పాల్గొన్నారు. 

రెబ్బెన మండల తహసీల్దార్ గా సాయన్న

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 27 ;   రెబ్బెనమండల తహసీల్దార్ గ  ఎస్ సాయన్న పదవీబాధ్యతలు స్వీకరించారు. గత కొన్ని నెలలుగా డిప్యూటీ తహసీల్దార్ విష్ణు ఇంచార్జి తహసీల్దారుగా వ్యవహిరిస్తున్నారు. శనివారం ఆసిఫాబాద్ రెవిన్యూ డివిషనల్ కార్యాలయంలో డివిషనల్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా పనిచేస్తున్న సాయన్నను బదిలీపై రెబ్బెన మండల తహసీల్గ్దర్ గ నియమిస్తూ ఉత్తరువులు రావడంతో సాయన్న  రెబ్బెన మండల కార్యాలయంలో పదవీబాధ్యతలు స్వీకరించారు.

Thursday, 25 January 2018

ఘనంగా జాతీయ ఓటర్ దినోత్సవం

 కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 25 ;   జాతీయ ఓటర్ దినోత్సవం  సందర్బంగ గురువారం రెబ్బెన తహసీల్దార్ కార్యాలయం ఎదుట  ప్రభుత్వ కళాశాల, పాఠశాల విద్యార్థులతో మానవహారం నిర్వహించి ఓటర్ ప్రతిజ్ఞ చేసారు. ఈ సందర్భంగా రెబ్బెన తహసీల్దార్ విష్ణు,  ఏఎంసీ  వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ లు  మాట్లాడుతు  18 సం"రాలు వయసు నిండిన యువతీ యువకులు తమ  ఓటు  హక్కు పొందటానికి విధిగ దరఖాస్తు  చేసుకోవాలని అన్నారు. జనవరి 25 న ఓటర్ దినోత్సము సదర్బంగా యువకులు ఓటు హక్కు పొందడానికి ప్రతేకంగా  పోలింగ్ కేంద్రలను  ఏర్పాటు చేయడం జరిగిందని,కేంధ్రాలలో దరఖాస్తులు తీసుకొని కొత్త ఓటర్లను నమోదు చేసుకోవడం జరుగుతుందని అన్నారు.పరిసర ప్రాంతాలలో నివాసం వుండే చదువుకోని ప్రజలు నమోదు చేసుకోకుండా ఉంటె వారికీ అవగాహన కల్పించి నమోదు చేసుకునేందుకు విద్యార్థులు సహకరించిగలరని కోరారు.ప్రతి ఒక్క విద్యార్థిని  విద్యార్థులు వయోజనులు కాగానే విధిగా ఓటు హక్కునిపొంది మంచి నాయకున్ని ఎన్నుకొని అవినీతి రహిత సమాజాన్ని రూపుదిద్దాలని వారు విద్యార్థులకు సూచించారు.ఓటు హక్కు పొందిన తర్వాత స్వేచ్ఛగా దానిని ఉపయోగించుకోవాలని,డబ్బులకు,మందు విందులకు ఓటును అమ్ముకోవడం నేరమని అన్నారు.భారత పౌరులమైన మేము,ప్రజాస్వామ్యం పై విశ్వాసంతో,మన దేశ ప్రజాస్వామ్య సాంప్రాదాయాలను,స్వేచ్చయుత,నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల  వాతావరణాన్ని నిలబెడాతామని,మతం,జాతి,కులం,వర్గం,బాష, ప్రాంతం  వంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము అని విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజలు   ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో రెవిన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ చౌహన్, కళాశాల ఉపాధ్యాయులు అమరేంద్రనాథ్, ప్రకాష్, గంగాధర్, రెబ్బెన మండల రెవిన్యూ కార్యాల ఉద్యోగులు ఊర్మిళ, బాపు, మల్లేష్, ఉమ్లాల్ ,శ్రీనివాస్,  అంగన్వాడీ కార్యకర్తలు ప్రమీల, తిరుపతమ్మ, స్థానిక ప్రజలు పాల్గొన్నారు

గంగాపూర్ జాతర ఏర్పాట్ల పై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 25 ;   రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామ శివారులోని బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో  9 తేదీనుండి  11 తేది వరకు  నిర్వ హించే  జాతర నిర్వహణలో  అధికారులు అప్రమత్తంగ ఉండాలని  ఎం ఎల్ సి పురాణం సతీష్  కుమార్,ఎమ్మెల్యే కోవా లక్ష్మిలు  సూచించారు.గురువారం  గంగాపూర్ దేవాలయం వద్ద జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ   మండలంలోని  అన్ని శాఖల  అధికారులతో సమీక్ష   నిర్వహించారు.   ,ఎమ్మెల్సీ ,ఏమ్మెల్యే  మాట్లాడుతూ వైద్యసదుపాయం,త్రాగునీరు,ఆ ర్. టి . సి .బస్సు సౌకర్యం,విద్యుత్ సౌకర్యం పారిశుధ్యం, ట్రాఫిక్ కంట్రోల్, ఎన్ఎస్ఎస్ సేవల  అంశాలపై నిరంతరం పర్యవేక్షించాలని అన్ని శాఖల అధికారులను   ఆదేశించారు.భక్తులకు ఇబ్బంది  కలగకుండా చర్యలు   చేపట్టాలన్నారు.అదే విధంగా త్రాగునీరు నిరంతరం అందించాలని గ్రామీణ నీటి పారుదల శాఖను ఆదేశించారు.జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ వారు  అప్రమత్తంగా  ఉండాలని సూచించారు.అన్ని శాఖల అధికారులు,ప్రజాప్రతినిధులు,ప్రజలు జాతర విజయవంతానికి సహకరించాలని కోరారు,ఈ సమావేశంలో రెబ్బెన సిఐ పురుషోత్తం, , జడ్పిటిసి  బాబురావు, ఎంపీటీసీ కర్నాధం సంజీవ్ కుమార్  ఎంపిడిఓ సత్యనారాయణసింగ్, , సింగరేణి బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ రవిశంకర్, గంగాపూర్ సర్పంచ్ రవీందర్, ఆలయ కమిటీ అధ్యక్షులు లక్ష్మణ్,, ఐ సి డి ఎస్ పీడీ సావిత్రి, పీడీ శంకర్, ఏపీఎం వెంకటరమణ శర్మ, ఏ  పి  ఓ కల్పన, పంచాయితీ సెక్రటరీ మురళీధర్,  పాక్స్ చైర్మన్ మధునయ్య, రెబ్బెన ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, ఆలయ ఎగ్జిక్యూటువే ఆఫీసర్ బాపి రెడ్డి ,   తెరాస నాయకులూ పోటు   శ్రీధర్ రెడ్డి, చిరంజీవి గౌడ్ , అరున్ , తదితరులు పాల్గొన్నారు. 

Wednesday, 24 January 2018

మహిళా మృతికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ అరెస్ట్

   కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 24;  తిర్యాణి మండలం విరసం ఘాట్ రోడ్డులో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో మహిళా మృతికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ ఆత్రం భీం రావు నుఅరెస్ట్ చేసి రేమండ్ కు తరలించినట్లు  రెబ్బెన సర్కిల్ ఇన్స్పెక్టర్ పురుషోత్తమ చారి బుధవారం  విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ నెల 18న ట్రాక్టర్ నెంబర్ టి ఎస్ 19 టి 2027 ట్రాక్టర్లో 15 మందిని ఎక్కించుకొని నిర్లక్ష్యంగా  ట్రాక్టర్ ను నడపడంతో  ట్రాక్టర్ బోల్తాపడి     దేవు బాయి అక్కడి కక్కడే మరణించగా, 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతురాలి భర్త జలపాతి ఫిర్యాదు మేరకు కేసు బుక్  చేసి  నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్  కు తరలించినట్లు తెలిపారు. 

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ కు ఎంపికైన విద్యార్థులు

నేషనల్ మీన్స్  కం మెరిట్ స్కాలర్షిప్ కు ఎంపికైన విద్యార్థులు 


 కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 24;  రెబ్బెన మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల  నుండి ఇద్దరు నేషనల్ మీన్స్  కం మెరిట్ స్కాలర్షిప్ కు ఎన్నికైనట్లు పాఠశాల  ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణలత ఒక తెలిపారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న బిర్సా శ్రావణి, మోడెమ్ అజయగౌడ్లు ఈ మెరిట్ స్కాలర్ షిఫ్కు ఎన్నికయ్యారని, ప్రభుత్వ పాఠశాలలో స్వేచ్చాయుత వాతావరణంలో విద్యార్థులకు ప్రతిభావంతమైన విద్యనందించడం జరుగుతుందన్నారు. ఇతర విద్యార్థిని,విద్యార్థులు ఈ విరినీ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయులు విజయలక్ష్మి, సీమ, ఆలిస్ అహ్మద్, రోజా రమణి, కవిత,పార్వతి ఈ ఇద్దరు విద్యార్థులకును అభినందించారు. 

వేకువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు

 కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 24;  వేకువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు  రెబ్బెనలోని జిల్లా పరిషత్ పాఠాశాల  9,10 వ తరగతి   విద్యార్థులకు  ఏకాగ్రత,జ్ఞాపకశక్తి, లక్ష్యం ,సమయపాలన మరియు  మానవతా విలువలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో ప్రముఖ సైకాలజిస్ట్ డి శ్రీనివాసులు విద్యార్థులనుద్దేశించి పై విషయాలను విశదీకరించారు. ప్రధానోపాధ్యారాలు శ్రీమతి సి స్వర్ణలతమాట్లాడుతూ శ్రీనివాసులు చెప్పిన విషయాలు విద్యార్థుల జీవితాలను ఎంతగానో ప్రభావితం చేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విజయలక్ష్మి, సీమ, ఆలిస్ అహ్మద్, రోజా రమణి, కవిత,పార్వతి తదితరులు పాల్గొన్నారు. 

సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు

 కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 24;  రెబ్బెన మండలం వృత్త పర్యవేక్షణాధి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో   ఆసిఫాబాద్ డిప్యూటీ సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ సత్యనారాయణ మాట్లాడుతూ నేరాల అదుపునకు నిఘా కెమెరాలు ఎంతగానో ఉపకరిస్తాయని అన్నారు. రెబ్బెన  పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని వాణిజ్య సముదాయాలు తప్పని సరిగా 15 రోజులలో నిఘా కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఎవరైనా సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే  సహించబోమని, చట్ట పరంగా కఠిన చర్యలు తప్పవన్నారు. కిరానా,టీ స్టాళ్లలో నిషేదిత గుట్కాలు తదితర వస్తువులు వ్యాపారులు అమ్మరాదన్నారు. రెబ్బెన పరిధిలో ప్రధాన రహదారిపై ఉన్నడా బాలు  తదితర హోటళ్లు రాత్రి 10  వరకే వ్యాపారాలు నిర్వహించాలన్నారు. ఎవరైనా అపరిచితులు వస్తే వారి పేరు, మొబైల్ నెంబర్ ప్రయాణించిన వాహనం నెంబర్ ఒక రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు.  ఈ కార్యక్రమంలో రెబ్బెన  సర్కిల్ ఇన్స్పెక్టర్ పురుషోత్తమ చారి, సుబ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ మరియు ఇతర అధికారులు, రెబ్బెన వ్యాపారస్తులు  పాల్గొన్నారు. 

Tuesday, 23 January 2018

గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఉత్తమ కార్మికులకు సన్మానం

  కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 23;  బెల్లంపల్లి ఏరియా గోలేటి  టౌన్షిప్ లోని  భీమన్న స్టేడియం లో ఈ నెల 25న గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని ఏరియా డీజీఎం  పర్సనల్ జి  కిరణ్  మంగళవారం ఒక ప్రకటనలో   తెలిపారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏరియాలోని అన్ని గనులలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన కార్మికులకు జనరల్ మేనేజర్ జి   రవిశంకర్ సన్మానిస్తారని తెలిపారు. 

సర్పంచ్ ఎన్నికలు ప్రత్యక్ష ఎన్నిక ద్వారానే జరపాలి

 కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 23; తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు మంగళవారం రెబ్బెన మండల కాంగ్రెస్  అధ్యక్షులు ముంజం రవీందర్ ఆధ్వర్యంలో సర్పంచ్ ఎన్నికలను పరోక్ష పద్దతిలో కాకుండా ప్రత్యక్ష ఎన్నిక విధానంలో నిర్వహించాలని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పంచాయితీ రాజ్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం పంచాయితీ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి మాత్రమే తెలంగాణ ప్రభుత్వం నూతన పంచాయితీ చట్టం ద్వారా సర్పంచ్ ఎన్నికను పరోక్ష పద్దతిలో నిర్వహించడానికి కుట్రపన్నుతుందన్నారు. ఏఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నంబాల కోవూరి  శ్రీనివాస్, పాక్స్ చైర్మన్ గాజుల రవీందర్, నాయకులూ దుర్గం రాజేష్, వెంకటేశం చారి, వెంకన్న, దుర్గం దేవాజి, పూదరి హరీష్, జాడి మోహన్ తదితరులు పాల్గొన్నారు.

సింగరేణిలో పదోన్నతులపై ఖాళీల భర్తీకి వ్రాత పరీక్షల నిర్వహణ

 కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 23;  బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి జనరల్ మేనేజర్ కార్యాలయములో మంగళ వారంనాడు సర్వే  మజ్దూర్, అసిస్టెంట్ ఛైన్మన్,హెడ్ ఛైన్మన్ ఖాళీల భర్తీకి వ్రాత పరీక్ష మరియు టెక్నికల్ పరీక్ష  నిర్వహించినట్లు ఏరియా డీజీఎం  జె కిరణ్ తెలిపారు.    ఈ  సందర్భంగా జనరల్ మేనేజర్  రవిశంకర్   మాట్లాడుతూ పదోన్నతులపై  ఖాళీల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షలలో మౌఖిక పరీక్షలేకుండా పూర్తి పారదర్శకతతో నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ పరీక్షా నిర్వహణలో ఎస్ ఓ టు జీఎం  ఎం శ్రీనివాస్, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ రామకృష్ణ ,డిప్యూటీ పర్సనల్ మేనేజర్ సుదర్శనం. ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Monday, 22 January 2018

నిరుపేద బ్రాహ్మణులకు ప్రభుత్వం చేయూత ; ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్


 నిరుపేద బ్రాహ్మణులకు ప్రభుత్వం చేయూత ; ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 22;    బ్రాహ్మణులకు ప్రభుత్వం అన్ని విధాలా  చేయూతనిస్తుందని  ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ అన్నారు . సోమవారం కొమురం భీం జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్ లో బ్రాహ్మణ పరిషత్ సాధికార సహాయత కేంద్రం ను  ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో బహిర్గతమైన చేదు నిజం ఏమిటంటే 90 శాతం మంది బ్రహ్మాంలు కటిక దారిద్యంలో జీవనం సాగిస్తున్నారని , అందుకు ముఖ్య మంత్రి కెసిఆర్ తెలంగాణ   బ్రాహ్మణ కుటుంబాలకు చేయూతనిచేటట్లుగా బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేసి 200 కోట్ల నిధులను కేటాయించారు. ఇందుకు గాను బ్రాహ్మణా కుటుంబాలుఆర్దికంగా ఎదగడానికి స్వయం ఉపాధి పొందేందుకు రుణ సహాయాన్ని అందేచేయుటకు దరఖాస్తు చేసుకోవాలన్నారుఅం దుకు ఈ కేంద్రం సహాయ పడుతుందన్నారు. బ్రాహ్మణులూ కేవలం పౌరోహిత్యానికే పరిమితం కాకుండా సామాజికంగా, ఆర్ధికంగా ,రాజకీయంగా ఎదగాలని కెసిఆర్ ఆకాంక్ష అన్నారు. ఎం ఎల్ ఏ  కోవలక్ష్మి  మాట్లాడుతూ జిల్లాలోని బ్రాహ్మణా సమాజానికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయ.ని , బ్రాహ్మణా పరిషత్ ద్వారా పేద బ్రాహ్మణ ఆడపిల్లల పెళ్ళికి 3 లక్షల రూపాయలు అందచేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ దామోదర్ రెడ్డి,  జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ గంధం శ్రీనివాస్, పాక్స్ చైర్మన్ అలీ బిన్ అహ్మద్,  తెరాస నాయకులూ సోమశేఖర్, బొమ్మినేని శ్రీధర్, గాడివేణి మల్లేష్, అజయ్,    స్థానిక తహసీల్దార్, బ్రాహ్మణ పరిషత్ నాయకులూ శ్రీనివాస్, సోను, తదితరులు పాల్గొన్నారు. 

సేవాలాల్ మహారాజ్ జయంతిను ప్రభుత్వం అధికారికంగా చేపట్టాలి

సేవాలాల్ మహారాజ్ జయంతిను ప్రభుత్వం  అధికారికంగా  చేపట్టాలి 



   కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 22;  సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం  అధికారికం గ చేపట్టాలని సేవాలాల్ కొమురం భీం  జిల్లా కమిటీ అధ్యక్షులు బి శివప్రసాద్ డిమాండ్ చేసారు. కొమురం భీం జిల్లా  రెబ్బెన మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో  సేవాలాల్ జిల్లా కమిటీ సమావేశం బి  శివప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు.  ఈ సమావేశంలో మాట్లాడుతూ  లంబాడీల  డిమాండ్ల సాధనకు  స్టీరింగ్ కమిటీ ని ఎన్నుకున్నట్లు తెలిపారు.  లంబాడీల ఆరాధ్య దైవమైన సంత్ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ జన్మదిన వేడుకలను ఫిబ్రవరి 15 నుండి 23 తేదీవరకు ప్రభుత్వమే అధికారకంగా నిర్వహించాలని, ఫిబ్రవరి 15 న సెలవు దినంగా ప్రకటించాలని, జయంతి ఉత్సవాల నిర్వహణకు జిల్లాకు 10 లక్షల చొప్పున 3 కోట్లు విడుదలచేయాలని,లంబాడి  తండాలను రెవిన్యూ పంచాయితీలుగా గుర్తించి జీవో  జారీచేయాలని ,లంబాడీలకు 10 శాతం రేజర్వేషను కల్పించాలని, తెలంగాణలోని ప్రతి తండాకు  ఏజెన్సీ హోదా కల్పించాలని అన్నారు. ఆదివాసీలు తమపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని కోరారు. లంబాడీలపై ప్రభుత్వం పెట్టిన కేసులను బె షరతుగా ఎత్తివేయాలన్నారు. ఈ నెల 29న ఈ సమస్యలపై ప్రతి మండల తహసీల్దార్లకు పై డిమాండ్లతో వినతి పత్రం అందచేయడం జరుగు తుందన్నారు. ఫిబ్రవరి 5 న అన్ని జిల్లాల కలెక్టర్లకు సేవాలాల్ సేవ నాయకులూ అందచేయడం జరుగు తుందన్నారు.   ఈ కార్యక్రమంలో సేవాలాల్ రాష్ట్ర అధ్యక్షులు దారావత్ ప్రేమ్ చాంద్ నాయక్,రాష్ట్ర ఉపాధ్యక్షులు జీవంత్ నాయక్,  ప్రధాన కార్యదర్సులు ఆర్ రాథోడ్, జాదవ్, బాపు రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ రాము నాయక్, రెబ్బెన జడ్పీటీసీ అజ్మీరా బాబు రావు, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు సురేష్ నాయక్,ఆత్మారాం నాయక్, నాయకులూ భరత్ బాబు, కిషన్, రాంకుమార్, మోహన్, తిరుపతి, శంకర్ నాయక్ తదిత రులు పాల్గొన్నారు. 

నిరుపేదలకు 3 ఎకరాల భూమికై వినతి

నిరుపేదలకు 3 ఎకరాల భూమికై  వినతి 
  కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 22;  ప్రభుత్వ భూమిని నిరుపేదలైన లబ్దిదారులకు ఇప్పించాలని ఎం ఎల్ ఏ  కోవలక్ష్మి కి సోమవారం ఆసిఫాబాద్ లోని స్వగృహంలో  తెరాస  జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెబ్బెన ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ ల  ఆధ్వర్యంలో వినతిపత్రం అందచేశారు. అనంతరం మాట్లాడుతూ రెబ్బెన మండలం కొమురవెల్లి గ్రామస్తులు 16 మంది తమ గ్రామా శివారు లోని సర్వే నెంబర్ 189 లోగల 17 ఎకరాల ప్రభుత్వ భూమిని నిరుపేదలైన లబ్దిదారులకు  3 ఎకరాల  చొప్పున భూమిని పంపిణి చేయాలనీ కోరారు.  ఈ కార్యక్రమంలో   ,మాజీ  ఉప సర్పంచ్  పరకాల శ్రీనివాస్ గౌడ్ ,  తెరాస నాయకులూ వాడ్నల   రమేష్, పెద్దింటి మధుకర్, పరకాల సాగర్ గౌడ్ తదితరులు   పాల్గొన్నారు. 

కుమ్మరి(శాలివాహన) సంఘం రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి

కుమ్మరి(శాలివాహన) సంఘం రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి 

 కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 22;   కొమురం భీం జిల రెబ్బెన మండలం గోలేటిలో జరిగిన జిల్లా కమ్మరి(శాలివాహన) సంఘం కార్యవర్గ సమావేశంలో జిల్లా అధ్యక్షులు కుమ్మరి మల్లేష్, ప్రధానకార్యదర్శి కటికనపల్లి మొండిలు మాట్లాడుతూ కుమ్మరిసంఘం రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని సూచించారు. బీసీ సహకార కుమ్మరి సంఘం రిజిస్ట్రేషన్లు అంతర్జాలంలో చేసుకోవాలని కనీసం 11 మంది గరిష్టంగా 15 మంది సభ్యులు ఉండేటట్లు చూసుకోవాలన్నారు. ఇంటికి ఒకరు 18 సంవత్సరాలపైబడి 58 సంవత్సరాల లోపు వ్యక్తులు అర్హులని, సభ్యులు తమ ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, ఒక ఫొటోతో పాటు మీ సేవ , ఈ సేవ కేంద్రాలలో 31 లోపు దరఖాస్తు చేయవచ్చన్నారు. 

ఘనంగా వసంత పంచమి పూజలు

ఘనంగా వసంత పంచమి పూజలు 

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 22;  రెబ్బెన లో శ్రీ సీత రామ ఆంజనేయ ఆలయంలో  వసంత  పంచమి మరియు  ఆలయ వార్షికోత్సవం సందర్భంగా  ప్రత్యేక పూజలు  సోమవారం నిర్వహించారు. వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని       మండలంలోని భక్తులు అధిక సంఖ్యలో విశేషపూజల లో పాల్గొని స్వామివారికి కుంకుమార్చనలు గావించారు. అనంతరం  అన్నదాన కార్యక్రమము  నిర్వహించారు.

Saturday, 20 January 2018

యోగ సమితి ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్సు సౌకర్యం


  కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 19 ;  పేదప్రజల సౌకర్యార్థం కొమురం భీం జిల్లా కేంద్రమైన అసిఫాబాద్లో ఎం ఎల్ ఏ  కోవా లక్ష్మి చేతులమీదుగా అంబులెన్సు సౌకర్యాన్ని  ప్రారంభించినట్లు యోగ సమితి ఇంచార్జి  ఎం కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కోవా లక్ష్మి మాట్లాడుతూ పేదప్రజల సౌకర్యం కోసం అంబులెన్సు సౌకర్యాన్ని యోగ సమితి క\ల్పించడం సంతోషకరం  అన్నారు.  ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం, మరియు తెరాస నాయకులు పాల్గొన్నారు. ఈ ఉచిత సేవను పొందుటకు 7995662108 నెంబర్ కు ఫోన్ చేసి సేవను పొందవచ్చన్నారు.   

మందమర్రి ఏరియాలో 24న ఫిర్యాదుల దినోత్సవం


కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 19 ; రెబ్బెన: బెల్లంపల్లి ఏరియా మందమర్రి జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఈ నెల 24న ఫిర్యాదుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు  ఏరియా డీజీఎం   పర్సనల్ జె  కిరణ్ శనివారం ఒకప్రకటనలో తెలిపారు. కార్మికులు తమ తమ సమస్యలను ధరఖాస్తురూపంలో అందించి  ,  ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 24వ తేదీ ఉదయం 10 గంటల నుండి ఈ కార్యక్రమం ఉంటుదన్నారు. ఈ సారి  అధికారులకు కూడా ఈ సదుపాయాన్ని కల్పించినట్లు తెలిపారు. 

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడుదాం ; టి డబ్ల్యూయు జె (ఐజెయు)


కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 19 ; రెబ్బెన: జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని  టి   డబ్ల్యూ యు జె  (   ఐ జె  యు ) కొమురం భీం జిల్లా కార్యవర్గ సమావేశంలో జిల్లా అధ్యక్షులు అబ్దుల్ రహమాన్, ప్రధాన కార్యదర్శి ఎస్ సంపత్ కుమార్ ,రాష్ట్ర కార్యవర్గ నాయకుల బి  సదానందంలు  పిలుపునిచ్చారు. శనివారం స్థానిక మైనారిటీ ఫంక్షన్ లో . అధ్యక్షులు  అబ్దుల్ రహమాన్ ఆధ్వర్యంలోజరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ  జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో యూనియన్లతో సంబంధం లేకుండా అర్హులైన విలేఖరులందరికి  అక్క్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని, విలేకరులకు డబల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరుచేయాలని చర్చించినట్లు,తదుపరికార్యాచరణ ,యూనియన్ బలోపేతం గురించి చర్చించామని చెప్పారు. ఇకనైనా .ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో    ఉపాధ్యక్షులు కృష్ణం రాజు, అబ్దుల్ జమీల్, సుధీర్ , కోశాధికారి అడపా సతీష్, ఆక్రెడిటేషన్ కమిటీ  మెంబెర్ ప్రకాష్ గౌడ్, జాయింట్ సెక్రటరీ సునీల్ , కార్యనిర్వాహక సెక్రటరీ కొల్లి సునీల్ కుమార్, కార్యవర్గ సభ్యులు రాంబాబు,ఖలీల్ అహ్మద్, రామేశ్వర్, నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Friday, 19 January 2018

నేరస్థుల సమగ్ర సర్వే




కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 19 ;   నేరస్థుల సమగ్ర సర్వేలో భాగంగా శుక్రవారం రెబ్బన పోలీస్ స్టేషన్  పరిధిలో ని గోలేటి లో ఎస్ ఐ నరేష్ కుమార్ సర్వే నిర్వహిచారు. ఈ సందర్భంగా ఎస్ ఐ నరేష్ కుమార్ మాట్లాడుతూ డి.జి.పి.మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు పలు నేరస్తుల పై సమగ్ర సర్వే చేస్తున్నట్లు తెలిపారు. 

రెబ్బెనలో మురుగు కాల్వల శుద్ధి కార్యక్రమం


 కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 19 ; రెబ్బెన:  కొమురం  భీం జిల్లా రెబ్బెన మండలం రెబ్బెన గ్రామ పంచాయితీ పరిధిలో శుక్రవారం పంచాయితీ సానిటరీ విభాగం వారు సర్పంచ్ పేసరి వెంకటమ్మ ఆధ్వర్యంలో గ్రామంలోని మురుగు నీటి కాల్వల శుద్ధి కార్యక్రమం చేపట్టారు. ఈ  సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మురికి కాల్వలలో చెత్త  చెదారం నిండిపోవడంవల్ల మురుగు నీరు సరిగా పారక  నిల్వఉండి  దోమలు వృద్ధి చెందుతున్నాయని, గ్రామస్తులు మురుగు కాల్వలలో ప్లాస్టిక్ సీసాలు  తదితర చెత్త వేయకుండా గ్రామ పరిశుభ్రతకు తోడ్పడాలని  అన్నారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన సింగల్ విండో చైర్మన్  పెసరి   మధునయ్య,గ్రామా పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు. 

Thursday, 18 January 2018

సీఆర్పీ రాష్ట్ర సదస్సు గోడ ప్రతులు ఆవిష్కరన


కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 18 ; రెబ్బెన: సీఆర్పీ రాష్ట్ర సదస్సుకు సంబందించిన గోడప్రతులను  గురువారం రెబ్బెన  మండలం  ఎం ఈ ఓ కార్యాలయం ఎదుట జరిగిన ఒక కార్యక్రమంలో సీఆర్పీ కుమురం భీం జిల్లా ప్రధాన కార్యదర్శి యం రాజేష్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ  విద్యారంగం అభివృద్ధిలో సి ఆర్ పి  ల పాత్ర ఎంతో  ఉన్నదని  , తమకు ఉద్యోగ భద్రతా కల్పించాలని, సమన పనికి సమన వేతనం ఇవ్వాలని, తమ వేతనాలను కనీసం 28940 గ నిర్ణయించాలని,పి  ఎఫ్ సౌకర్యం కల్పించాలని, 2014 నుండి నష్టపోయిన జీతాలను   చెల్లించాలని తదితర డిమాండ్లతో సదస్సు నిర్వహిస్తున్నామన్నారు.   ఈ నెల  21 న వరంగల్ లో  నిర్వహిస్తున్న.విద్యా రంగం-సీఆర్పీల  పాత్ర  రాష్ట్ర సదస్సును అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలనీ కోరారు. ఈ కార్య క్రమంలో  విద్యాధికారి యం వెంకటేశ్వర స్వామి, సీఆర్పీ యం దేవెందర్ తదితరులు పాల్గొన్నారు. 

20న టి యు డబ్ల్యూ జె (ఐజె యు)జిల్లా కార్యవర్గ సమావేశం

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 18 ; రెబ్బెన: కొమురం భీం జిల్లా కేంద్రంలో ఈ నెల 20న టి యు డబ్ల్యూ జె (ఐజెయు) జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షులు అబ్దుల్ రహమాన్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ సంపత్ కుమార్ లు  ఒక ప్రకటనలో తెలిపారు . జిల్లాలో యూనియన్ బలోపేతానికి  సంబంధించి  కార్యాచరణ ప్రణాళిక చర్చించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి నాయకులూ, సభ్యులు అధిక సంఖ్యలో విచ్చేసి  జయప్రదం చేయాలనీ కోరారు. 

యన్ టీ ఆర్ 22వ వర్దంతి పురస్కరించుకొని పూలాభిషేకం

 యన్ టీ ఆర్ 22వ వర్దంతి పురస్కరించుకొని పూలాభిషేకం 
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 18 ; రెబ్బెన: స్వర్గీయ యన్ టీ ఆర్ 22 వ వర్దంతి పురస్కరించుకొని గురువారం రోజున  రెబ్బెన  మండల  కేంద్రంలో మండల తే.దె.పా ఆద్వైర్యంలో ఎం టి ఆర్ విగ్రహానికి ఆసిఫాబాద్ జిల్లా పార్టీ కార్యదర్శి కుడుమేత హన్మంతరావు,  జిల్లా మహిళా అధ్యక్షురాలు సొల్లులక్ష్మి లు  పూలమాలలు వేశారు. పార్టీ జండా ఎగరవేసి అనంతరం పండ్ల పంపిణి చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలుగు దేశం పాలన  హయాంలో తెలంగాణా ప్రాంతం ఎంతో అభివృద్ధి జరిగిందని అన్నారు. బిసి ఎస్సి ఎస్టీ మైనారిటీ లకు హక్కుల సాధనలో ఎం టి ఆర్ వారి కష్ట సుఖాలలో పాలు పంచుకుని  ఎంతో కృషి చేశారన్నారు. తెలుగు దేశం పేదల పార్టీ రాబోయే రోజుల్లో టిడిపి  జెండా ఎగరడం ఖాయమని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమములో మండల అధ్యక్షుడు విజయ్, మండల మహిళా అధ్యక్షురాలు ఏ  విమల, నాయకులూ మనోహర్, గులాబీ, నాందేవ్ తదితరురులు ఉన్నారు .

Wednesday, 17 January 2018

ఘనంగా ప్రారంభమైన సమ్మక్క సారలమ్మ పూజలు

 కొమురం భీం జిల్లా (వుదయం ప్రతినిధి ) జనవరి  17 :  రెబ్బెన మండలంలో బుధవారం నాటినుంచే సమ్మక్క సారలమ్మ పూజలు మండలంలోని ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకొంటున్నారు. మండలంలోని పలు గ్రామాలలో ప్రజలు  తమ ఎత్తు   బంగారాన్ని (బెల్లం) ఇండ్లకు తీసుకొనివెళ్ళి తమ తమ పూజ గదులలో అమ్మవారికి రకరకాల నైవేద్యాలతొ  పాటు  సమర్పించి  పూజలు జరిపి  ప్రార్ధించారు.    అనంతరం బందువులకు విందు భోజనాలు  ఏర్పాటు  చేసారు. 

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షా శిబిరం


కొమురం భీం జిల్లా (వుదయం ప్రతినిధి ) జనవరి  17 :  రెబ్బెన మండలం గోలేటిలో బుధవారం లయన్స్ క్లబ్ గోలేటి స్పోర్ట్స్ మరియు బెల్లంపల్లి కంటి ఆసుపత్రి  ఆధ్వర్యంలో సింగరేణి హై స్కూల్ విద్యార్థులకు ఉచిత్త కంటి పరీక్షలు నిర్వహించటం జరిగిందని  లయన్ ఆర్ నారాయణ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి సింగరేణి  జి ఎం  రవిశంకర్, డిప్యూటీ జి ఎం కిరణ్ లు ముఖ్య అతిధులుగా  హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలు సమాజానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ సందర్భంగా ప్రోగ్రాము   చైర్మన్ తిరుపతి రెడ్డి, లయన్ సీ  వినోద్  ప్రైమరీ పాఠశాల విద్యార్థులకు  300 వాటర్ బాటిళ్లను అందచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా లయన్స్ క్లబ్ చీఫ్ కో ఆర్డినేటర్ టి వెంకటేశ్వర్లు, కార్యదర్శి భాస్కర్, కోశాధికారి శంకర్, మెంబర్షిప్ చైర్మన్ జె  సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి శ్రీధర్, మూర్తి, తదితరులు పాల్గొన్నారు. 

కేంద్ర రాష్ట్ర వివిధ పథకాలలో పనిచేస్తున్న ఉద్యోగుల ఒక రోజు సమ్మె



కొమురం భీం జిల్లా (వుదయం ప్రతినిధి ) జనవరి  17 :    కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు దేఅవ్యాప్తంగా వివిధ కేంద్ర, రాష్ట్ర  పథకాలలో పనిచేస్తున్న ఉద్యోగులు  బుధవారం ఒక రోజు సమ్మెలో పాల్గొన్నారు. రెబ్బెన మండల తహసీల్దార్ కార్యాలయమున కు   ఊరేగింపుగా వచ్చి జూనియర్ అసిస్టెంట్ లక్ష్మి  నారాయణకు   సి ఐ టి యు జిల్లా అధ్యక్షులు అల్లూరి లోకేష్   వినతి పత్రం అందచేసి అనంతరం మాట్లాడుతూ  ప్రధానంగా తమను కార్మికులుగా గుర్తించాలని, కనీస వేతనం 18000 గ నిర్ణయించాలని, 41 వ లేబర్ కమిషన్ సిఫార్సులను  అమలు చేయాలనీ కోరుతూ ఒక రోజు సమ్మె చేయటం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రెబ్బెన మండలంలో ఆశ,మధ్యాన్న  భోజన ,స్కూల్ స్వీపర్లు, ఐ కే పి  మారియు  వివిధ స్కీం లలో పని చేస్తున్న ఉద్యోగులు పాల్గొన్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ  జిల్లా ఉపాధ్యక్షులు దినకర్, మండల అధ్యక్షులు చంద్రకళ, నాయకులూ రాజేశ్వరి, ప్రమీల, అనిత, సుకన్య, సుధారాణి,  విజయ,తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు. 

Tuesday, 16 January 2018

తెరాస ప్రభుత్వ వైఫల్యాల పై తెలుగు దేశం పల్లెబాట ; గుల్ల పల్లి ఆనంద్





కొమురం భీం జిల్లా (వుదయం ప్రతినిధి ) జనవరి  16:  తెరాస పార్టీ తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి పల్లె పల్లెకు తెలుగుదేశం కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు టీడీపీ జిల్లా అధ్యక్షులు గుళ్ళపల్లి ఆనంద్ అన్నారు. మంగళవారం ఆసిఫాబాద్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి ఐన జనవరి 18 నుండి టీడీపీ ఆవిర్భావ దినోత్సవం  27మార్చ్  వరకు 70 రోజుల పటు పల్లె పల్లెకు తెలుగు దేశం పల్లెబాట కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.   ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాన్ని సామాన్య ప్రజలకు వివరిస్తూనే తెలుగు దేశం పార్టీ వ్యవస్థను పల్లె పల్లెల బలపరచాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల టీడీపీ ఉపాధ్యక్ష్యులు బొన గిరి  మురళి, ప్రధాన కార్యదర్శి పి  ఆత్మారాం, జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు సొల్లు  లక్ష్మి , తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు ఎం సుధాకర్, జిల్లా మైనారిటీ అధ్యక్షులు బాపు, నాయకులూ తాజ్ బాబా, డెలత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. 

బ్రాహ్మణులకు సంక్షేమ పథకాల ఏర్పాటు : రాష్ట్ర బ్రాహ్మణ సంఘ ప్రధాన కార్యదర్శి



  కొమురం భీం జిల్లా (వుదయం ప్రతినిధి ) జనవరి  16: తెలంగాణ ప్రభుత్వం  బ్రాహ్మణ  కులస్తులకు చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాలను వినియోగించుకొవడానికి  బ్రహ్మాణులు  తమ కుల , ఆదాయ ధ్రువీకరణ  పత్రాలకు ధరఖాస్తుచేసుకోవాలని రాష్ట్ర బ్రాహ్మణ సంఘ ప్రధాన కార్యదర్శి మొగులూరి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం రెబ్బెన  మండలకేంద్రంలోని అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  తెలంగాణ లోని  బ్రాహ్మణ  కులస్తుల సంక్షేమేం కోసం సంవత్సరానికి 100 కోట్ల నిధులు  కేటాయించడం జరిగిందని తెలిపారు. ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఎం ఎల్ ఏ  కోవ లక్ష్మి చేతుల మీదుగా కొమురం భీం జిల్లా కేంద్రం అసిఫాబాద్లో ఈ నెల 22 న  హెల్ప్ సెంటర్  ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా లోని బ్రాహ్మణ కులస్తులందరు ఈ కార్యక్రమానికి  అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలనీ కోరారు. ఈ కార్యజక్రమంలో మోడెమ్ సుదర్శన్ గౌడ్, బొమ్మినేని శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. 

Friday, 12 January 2018

సి ఎస్ పి రైల్వే లైన్ పనుల ను పరిశీలించిన రైల్వే డి ఆర్ ఎం


 కొమురం భీం జిల్లా (వుదయం ప్రతినిధి ) జనవరి  12:   గోలేటి  క్రాస్  నూతనంగా నిర్మిస్తున్న సి ఎస్ పి  రైల్వే  శుక్రవారం రైల్వే డి ఆర్ ఎం  అమిత్ వర్ధన్ శుక్రవారం  పరిశీలించారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు పనులను మరింత వేగంగా పూర్తి చేయాలనీ సూచించారు. అంతకు ముందు ఆసిఫాబాద్ రైల్వే స్టేషన్లో రెబ్బెన తెరాస నాయకులూ మరియు గ్రామస్తులు  స్టేషన్లో  మౌలిక వసతులు  కల్పించాలని, ఫుట్ ఓవర్  బ్రిడ్జి నిర్మించాలని , గంగాపూర్ రైల్వే గేట్ వద్ద బ్రిడ్జి నిర్మించాలని వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డివిజన్ కో ఆర్డినేటర్ అమిత్ అగ్రవాల్ , సీనియర్ డివిషనల్ సూపరింటెండెంట్ రామ రావు, సీనియర్ డి ఓ ఎం క్రిస్టోఫేర్ ,సీనియర్ డి సీ  ఎం సుమిత్ శర్మ, సీనియర్ డి ఈ ఈ ఆనంద్ చేకిలా , సింగరేణి  బెల్లంపల్లి ఏరియా  జనరల్ మేనేజర్ కిరణ్ ,రైల్వే సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.