కె జి నుంచి పి జి వరకు ఉచిత విద్యను అమలు చేయాలి -
ఎ ఐ ఎస్ ఫ్ నాయకులు
ఎ ఐ ఎస్ ఫ్ నాయకులు
(రెబ్బెన వుదయం ప్రతినిధి) కె.జి నుంచి పి.జి వరకు ఉచిత విద్యను ప్రభుత్వ పాఠశాలలో అమలు చేయాలనీ ఎ ఐ ఎస్ ఫ్ అధ్వర్యంలో రెబ్బెన మండలం తహసిల్దార్ కార్యాలయం ముట్టడి చేశారు అనంతరం తహసిల్దార్ కి వినతి పత్రం అందచేశారు ఈ సందర్బముగా ఎ ఐ ఎస్ ఫ్ మండల కార్యదర్శి పూదారి సాయి కిరణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ విద్య విదానాన్ని నిర్లక్షం చేస్తందని అన్నారు. బేషరతుగా ప్రతి పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ఏర్పాటు చేయాలనీ, మోళిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం పాఠ్య పుస్తకాల పంపిణిలో రాష్ట ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ఎద్దెవ చేశారు. పెండింగ్ లో వున్నా స్కాలర్ షిప్ , ఫీజు రియంబర్స్ మెంట్ లను వెంటనే విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు. ఈ విద్య సంవత్సరంలో పాఠ్య పుస్తకాలు సకాలంలో అందచేయాలని లేని పక్షంలో ఎ ఐ ఎస్ ఫ్ అధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎ ఐ ఎస్ ఫ్ ఉపాధ్యక్షులు వీమునూరి శేఖర్ , మలిశెట్టి మహిపాల్ , నారాయణపూర్ గ్రామ అధ్యక్షుడు ఆత్రం శ్యాం రావు, ఎ ఐ టి యు సి మండల కార్యదర్శి రాయిల్ల నర్సయ్య , పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment