ఘనముగా జగజ్జీవన్ జయంతి వేడుకలు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని రెబ్బెన ఎమ్ పి పి సంజీవ్ కుమార్ అన్నారు. మంగళవారం రెబ్బెన మండలం ఎమ్ పి డి ఓ మరియు తహసిల్దార్ కార్యాలయంలో బాబు జగ్జీవన్‌రామ్ 109వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి ఉత్సవాలను ప్రారంభించారు.ఎమ్ పి పి సంజీవ్ కుమార్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్‌రామ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోని ఉన్నత స్ధితికి ఎదగాలన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం బాబు జగ్జీవన్‌రామ్ ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్ పి డి ఓఎమ్ ఎ ఆలిం, వైస్ ఎమ్ పి పి రేణుక , ఉప తహసిల్దార్ రామమోహన్ రావు ,రెబ్బెన సర్పంచ్ పెసరి వెంకటమ్మ , ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, టి డి పి మండల అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్ , దుర్గం సోమయ్య, వెంకన్న అర్ ఐ అశోక్ ,వి అర్ ఓ లు మరియు కార్యాలయ సిబ్బది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment