విద్యాభివ్రుద్ది తో బంగారు తెలంగాణా - ఎం ఎల్ సి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); విద్యాభి వృద్ది తో బంగారు తెలంగాణా సాదించ వచ్చని ఆదిలాబాద్ ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్ అన్నారు. రెబ్బెన మండలంలోని సాయి విద్యాలయం( ఎస్వి )ఇంగ్లీష్ మీడియం పాటశాల లో ఎనిమిదొవ వార్షికోత్సవానికి బుధవారము ముఖ్య అతిధి గా అయన మాట్లాడారు . విద్య లేక మన జిల్లా వెనుక బడి పోయిందని,పాటశాలలు అంకిత భావముతో పని చేసి ముందజలో తీసుకు రావాలని తెలిపారు . జీవితంలో విద్య కీలక పాత్ర పోషిస్తుంది , ప్రధాన మంత్రి మోడీ నుండి ముఖ్య మంత్రి కె సి ఆర్ వరకు మహా నేతలు చిన్నప్పుడు పాటశాలల నుంచి వచ్చిన వారే అని పేర్కొన్నారు .పాతశాలలో పని చేసే ఉపాధ్యాయులు పోటితత్వం తో పని చేసి నప్పుడు విద్యార్థులకు కూడా పోటితత్వం అలవాడు తుందని అన్నారు . విద్యార్థులకు యోగ తప్పని సరిగా నేర్పించాలని ,యోగాతో మానసిక స్తితి బాగుంటుందని అన్నారు. ఎస్ వి ఇంగ్లీష్ మీడియం పాటశాల యాజమాన్యం దీకొండ సంజీవ్ కుమార్ ప్రయోగాత్మక విద్యను అందిస్తూ పాటశాలను దిన దినాభివృద్ది చేస్తున్నారని తెలిపారు .వచ్చే విద్యా సంవత్సరములో 10 వ తరగతి వరకు విద్యను అందిస్తాననడం సంతోషకరమని , ఏదైనా సహాయం కావాలంటే తప్పకుండ సహాకరిస్త్సామని అన్నారు, అనంతరము ఆసిఫాబాద్ ఎం ఎల్ ఎ కోవా లక్ష్మి మాట్లాడుతూ ఆసిఫాబాద్ నియోజక వర్గములో ప్రైవేటు పాటశాలలు విద్యాభి వృద్దిలో ముందంజలో ఉన్నాయని అన్నారు. రెబ్బెన లోని ఎస్ వి ఇంగ్లీష్ మీడియం పాటశాల యాజమాన్యం సంజీవ్ కుమార్ తక్కువ ఫీజులు తీసు కుంటూ నాణ్యమైన విద్యను ఎస్తున్నారని ఎంతో అభినంద నీయమని తెలిపారు . త్వరలో మెయిన్ రోడ్ నుండి సబ్ స్టేషన్ వరకు ఎంత ఖర్చు ఐన రోడ్ వేయిస్తానని హామీ ఇచ్చారు . పాతశాలకు ఎ సాహాయం క్లావాలా చేస్తామని తెలిపారు . ఎం పి పి ససంజీవ్ కుమార్ , వైస్ ఎం పి పి జి రేణుక, బెల్లం పల్లి ఏరియ జెనరల్ మేనేజర్ కె రవిశంకర్.జడ్ పిటిసి బాబూరావు,తహసిల్దార్ బి రమేష్ గౌడ్ , ఎం పి డి ఓ ఎం ఎ ఆలీం , ఎం ఇ ఓ ఎం వెంకటేశ్వర స్వామీ , మండల టి ఆర్ ఎస్ అద్యక్షులు శ్రీధర్ రెడ్డి తె.ధ.ఫా మండల అధ్యక్షుడు మోడెమ్ సుదర్శన్ గౌడ్,టి ఆర్ ఎస్ జిల్లా ప్రధాన కార్య దర్శి చెన్నా సోమ శేఖర్ , కిలా ఉపాధ్యక్షుడు నవీన్ కుమార్ జైస్వాల్ ,రెబ్బెన ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ , ప్రైవేటు పాటశాలల డివిజన్ నాయాకులు దేవా భూషణం పాటశాల అధ్యక్షా కార్య దర్షులు ఎస్ కె మొహినుద్దిన్ , అలగం తులసి రామ్ , పాటశాల ప్రదానోపాదాయుడు సంజీవ్ కుమార్ , ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లి దండ్రులు పాల్గొన్నారు .
No comments:
Post a Comment