46వ ఎన్ ఎస్ యు ఐ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలం బస్టాండ్ ఆవరణలో ఎన్ ఎస్ యు ఐ46వఆ విర్బావ దినోత్సవ వేడుకలు ఘనముగా నిర్వహించారు ఈ సందర్బముగా స్వర్గీయ ఇందిరా గాంది చిత్ర పటానికి పూలమాలలు వేసి ఎన్ ఎస్ యు ఐ జెండాను ఎగరవేశారు ఈ సందర్బముగా ఎన్ ఎస్ యు ఐజిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం భరద్వాజ్ దుర్గం రాజేష్ మాట్లాడుతూ 1971 ఏప్రిల్ 9 న కేరళ విద్యార్థి సంఘంగా ఉన్న ఎన్ ఎస్ యు ఐ ని దేశ వ్యాప్తముగా విద్యార్థి సంఘం యొక్క సేవలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ కి అండగా ఉంటూ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఉద్దేశ్వంతో ఆనాడు ఇందిరా గాంధీ ఎన్ ఎస్ యు ఐని ఏర్పాటు చేయడం జరిగింది ఆనాటి నుండి నేటి వరకు ఎన్ ఎస్ యు ఐవిద్యార్థుల పక్షాన నిలుస్తు విద్యార్థి సమస్యలు పరిష్కరించడానికి అనేక పోరాటాలు చేయడం జరిగింది నేటి ప్రభుత్వాలు విద్యార్థి వ్యతిరేక విధానమును ఎప్పటికపుడు ఎండగడుతూ ఎన్ ఎస్ యు ఐ మ,ముందుందని ఎన్ డి ఎ ప్రభుత్వం విద్యార్థులకు అర్ ఎస్ ఎస్ బావజాలలు రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నాయి దేశాన్ని రెండుగా విడగొట్టాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ నాయకులూ నికోడే శ్రీధర్ ,ముజ్జ , సాయి కృష్ణ , జుబెద్ , హన్మంతు నరేష్ కుమార్ , రాజన్న తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment