మిషన్ కాకతీయ రెండవ విడత పనుల ప్రారంభం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని మిషన్ కాకతీయ రెండవ విడత పనులకు 7 గ్రామాల చెరువులు ఎన్నికైనాయి. రెబ్బెన, నంబల, నక్కలగూడ, తక్కెళ్ళపల్లి, తుంగేడ, గ్రామాల్లోని పలు చెరువులు రెండవ విడత పనులకు ఆదిలాబాద్ ఎమ్.ఎల్,సి పురాణం సతీష్ మరియు ఆసిఫాబాద్ ఎం,ఎల్,ఏ కొవలక్ష్మి రెండవ విడత మిషన్ కాకతీయ పనులకు భూమి పూజా చెశరు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతీస్టత్మకంగా రైతులకు సాగు నీరు మరియు అందించలానే ముఖ్య ఉద్దేశంగా,, చెరువుల మరమత్తుల పనులు చేపట్టడం ఒక గొప్ప బృహత్తర కార్యక్రమం అని ఎం ,ఎల్ ,సి పురాణం సతీష్ అన్నారు. ప్రతి రైతుకు సాగు నీరు అందించడమే ప్రధాన అంశంగా మిషన్ కాకతీయ పనులు కొనసాగుతునాయని,స్తానిక ఎం ,ఎల్ ,ఏ కొవలక్ష్మిఅన్నరు. తెలంగాణా ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రజా సౌకర్యాలు మేరుగుపడ్డాయని మిషన్ కాకతీయ చెరువుల పునరుద్దన ,మరామత్తుల వల్ల సాగు భూములకు మేలు కలుగుతుందని ఎం ఎల్ ఏ అన్నారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన మండల్ ఎం పి పి సంజీవ్ ,జడ్ పి టి సి బాబురావు ,సర్పంచ్ పెసరు వెంకటమ్మ ,మండల టి ఆర్ ఎస్ అద్యక్షులు శ్రీధర్ రెడ్డి,నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment