రెబ్బెనలో ఘనంగా అంబేద్కర్ 125 జయంతి 


(రెబ్బెన వుదయం ప్రతినిధి) అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని రెబ్బెన మండలకేంద్రంతోపాటు గోలేటి టౌన్‌షిప్, గంగాపూర్, కిష్టాపూర్, నారాయణపూర్, తుంగెడ, పోతపెల్లి, రాంపూర్లలో అంబేద్కర్ 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా మండలకేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పంచశీల జెండాను రెబ్బెన రెబ్బెన మండల అంబేద్కర్ అద్యక్షులు పెరుగు శంకర్ ఆవిష్కరించారు. ఎం పి డి ఓ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపతనికి పూలమాల వేసిఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం కేకు కోసి మిఠాయిలు పంచారు కార్యక్రమాల్లో ఎంపిపి సంజీవ్‌కుమార్, ఎంపిడిఓ ఎంఎ హలీం, తహసీల్దార్ రమేష్ గౌడ్ , బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ రాంనారాయణ, సర్పంచులు పెసరు వెంకటమ్మ, తోట లక్ష్మణ్, వైస్ ఎంపిపి రేణుక, ఎంపిటిసిలు కొవ్వూరి శ్రీనివాస్, వనజ, డిప్యూటీ తహసీల్దార్ రామ్మోహన్‌రావు, , నాయకులు నవీన్‌జైస్వాల్, శంకరమ్మ, చిరంజీవిగౌడ్, దుర్గం దేవాజీ, మొండయ్య, బొంగు నర్సింగరావు, దుర్గం సోమయ్య ,లింగయ్య, అజ్మీర రమేష్ ,రాములు ,బొంగు నర్సింగరావు, బోగే ఉపెందర్, వెంకటేష్ ,దుర్గం రవీందర్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment