గీతా కార్మికులను ఆదు కోవాలి - అన్జనేయులు గౌడ్
(రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలములోని నారాయణ్ పుర గ్రామ శివారులో 3000ఈత చెట్లు కాలి బూడిదయ్యాయని , గీతా కార్మికులను ఆదుకోవాలని తెలంగాణ గౌడ జన హక్కుల సంగం పోరాట సమితి జిల్లా ఇంచార్జి కేసరి ఆంజనేయులు గౌడ్ శనివారము రెబ్బెన తహసిల్దార్ బి రమేష్ గౌడ్ గారికి వినతి పత్రాన్ని అందజేశారు . అనంతరం ఆయన మాట్లాడుతూ 3000 ఈత చెట్లు కాలి పోవడముతో 20 కుటుంబాలు రోడ్డున పడ్డాయని , జీవన ఉపాదిని కోల్పోయయని , ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు ఇవ్వాలని తెలిపారు . ఈత చెట్ల పన్నులు , అబ్కారి లైసెన్సు ఫీజులు మాఫీ చేయాలని అన్నారు . 560 జి ఓ ప్రకారము ఈత వనము పెంచడానికి 5 ఎకరాల భూమి ఇవ్వాలని తెలిపారు . ఈ కార్య క్రమములో గౌడ సంఘం నాయకులు సుదర్శన్ గౌడ్ , ఆర్ రాజు , గీతా కార్మికులు శంకర్ గౌడ్ , పర్ష గౌడ్ , మాల్లా గౌడ్ , రవీందర్ గౌడ్ , తిరుపతి గౌడ్ , వెంక గౌడ్ లు ఉన్నారు
No comments:
Post a Comment