Tuesday, 26 April 2016

నిప్పుల కోళిమిని తలపిస్తున్న ఎండలు

 నిప్పుల కోళిమిని తలపిస్తున్న ఎండలు 
(రెబ్బెన వుదయం ప్రతినిధి); రెబ్బెన మండల కేంద్రంలో  గత ఎడాది కంటే కూడా ఈ ఎడాది అత్యదికంగా ఉష్ణోగ్రతలు నమోదు తో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు , మరో పక్క ఉదయం 8 గంటల ప్రాంతం లోనే నిప్పుల కొలిమినిల  తలపిస్తుంది. దీంతో చిన్న పిల్లలు నుండి వృద్దుల వరకు ఎండా వేడిమికి తట్టుకోలేఖపోతున్నారు.  ఇదిలా ఉండగా ప్రజా ఆరోగ్య శాఖ మాత్రం ప్రజల ఇబ్బందులను పట్టించు కోకుండా గాలికి వదిలేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి .జిల్లాలో ఎండల తీవ్రత 46డిగ్రీలు  మించి కాస్తునాయని వాతావరణ శాకాదికారులు చెబుతున్నారు, గత ఏడాది ఈ మాసంలో ఎండల తీవ్రత తక్కువగా ఉందని అధికారులు అంటులున్నారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి సంభందిత శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు వాపోతున్నారు. మండలం లో సుమారు 25000 వేల జనభా ఉన్నపటికీ వారికి సరిపడు నీటి కోలాయీలు లేక తీవ్ర దహర్తికి గురౌతున్నారని సామజిక షాస్త్రవేత్తలు చెబుతున్నారు.  మరియు ఎండల తీవ్రాతలనుండి రక్షణ పొందు సూచనలు, అవగాహన కార్యక్రమలను చేపట్టాల్సిన శాఖలు నిర్లక్ష వ్యెకరిని అవలంబిస్తున్నాయి.  ప్రజా సౌకర్యాల పట్ల ప్రతి  ఒక్కరు నిబద్దతతో ఉండాల్సిన అవసరం ఎంతయిన ఉంది. ఇకనైన సంబందిత శాఖలు ప్రజల ఇబ్బందుల ను గుర్తు వుంచుకోవాల్సిందిగా సమస్త  జనులు కోరుతున్నారు .

No comments:

Post a Comment