రైతు,ప్రజా సమశ్యలను పరిష్కరించాలి - భారత కమ్యునిష్టు పార్టి సి.పి.ఐ
(రెబ్బెన వుదయం ప్రతినిధి) ఆదిలాబాద్ జిల్లాలో అన్ని మండలాలు కరువు మండలాలుగా ప్రకటించాలని,వర్షాలు సకాలంలో కురియక పోవడం తో పంటలు పండక రైతులు తీవ్ర ఇబంధులకు గురవుతున్నారని, రైతు,ప్రజా సమశ్యలును పరిష్కరించాలని సి.పి.ఐ జిల్లా కార్యవర్గ సబ్యులు యస్ తిరుపతి గురువారం రెబ్బెన తహసిల్దారురమేష్ గౌడ్ కి వినతి పత్రం అందజేసి ప్రధాన రహదారి పై ధర్న నిర్వహించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వర్షాలు సకాలంలో కురియక పోవడంతో పంటలు పండక రైతులు తీవ్ర ఇబంధులకు గురవుతున్నారని జిల్లాలోని అన్నిమండలాలను కరువు మండలాలుగా ప్రకటించి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ప్రతి జిల్లాకు నష్ట పరిహారం రెండు వందల కోట్లు కేటాహించాలని అన్నారు గ్రామలో నీటి ఎద్దడి ఉన్నందున ప్రబుత్వం స్పదింఛి గ్రామలో నీటి సౌకౌర్యం కల్పించాలని, తెరాస ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరుపేద దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమి పంపిణీ చేయలని, రెండు గదుల ఇండ్లు వెంటనే మంజూరు చేయాలనీ ,రైతు,ప్రజా సమశ్యలును పరిష్కరించే వరకు సి.పి.ఐ భారత కమ్యునిష్టు పార్టి అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తుమని అన్నరు ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి బి జగ్గయ్య ఎఐయైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు బోగే ఉపేందర్ ఎఐఎస్ యఫ్ జిల్లా కార్యదర్శి దుర్గం రవీందర్ , గణేష్ ,తిరుపతి,సాయి,రవికుమార్,నర్సయ్య లు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment