Tuesday, 19 April 2016

నిరుపేద దళిత కుటుంబాలకు 3 ఎకరాలు భూ పంపిణి

నిరుపేద దళిత కుటుంబాలకు 3 ఎకరాలు  భూ పంపిణి



(రెబ్బెన వుదయం ప్రతినిధి); రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిస్టాత్మకంగా చేపట్టిన భూ పంపిణి నిరుపేద దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమి పంపిణీ చేయడం అభినందనీయమని శాసన సభ  సభ్యురాలు కోవ లక్ష్మి అన్నారు. మంగళవారం రెబ్బెన తహసిల్దార్ కార్యాలయంలో    భూ పంపిణి  కార్యక్రమం చేపట్టారు. ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఆరుగురికి 17. 37 ఎకరాల నిరుపేద దళిత కుటుంబాలకు రెబ్బెన మండలం లో మొదటిసారిగా పంచడం జరిగింది అని  అన్నారు. తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటు చేసిన భుపంపిని  అధికారుల జప్యం వాల్ల ఆలశ్యం అవుతుందని అధికారులు వెంటనే భూమిని కొనుగోలుచేసి ఎదోరకంగా ప్రభుత్వ భూములను పరిశీలించి  వారం రోజులలో 2000 ఎకరాల భూమి సేకరణ చేసి నిరుపేదలకు పంపిణి చేయాలనీ ఆమె అధికారులను ఆదేశించారు. ప్రస్తుత వేసవి కాలంలో గ్రామాలలో త్రాగునీటి ఎద్దెడి నివారించేందుకుగాను గ్రామా సర్పంచులు, ఎమ్ పి టి సీ లు ,వార్డ్ మెంబర్ లు అధికారులు గ్రామా గ్రామాలకు వెళ్ళి నిటి ఎద్దటి సమస్యలు వుంటే పరిశీలించి సకాలంలో నీరు అందేలా చేయాలనీ అన్నారు. ఎస్సి,ఎస్టి లకు కళ్యాణ లక్ష్మి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుంది  అని, శాసన సభలో నిరు పేద  బి.సి, ఓసి లకు కూడా కళ్యాణ లక్ష్మి వర్తించేలా చర్చలు జరుగుతున్నాయి అని, త్వరలో జి ఓ కూడా వస్తుంది అని   అన్నారు. ఈ కార్యక్రమంలో యం.పి.టి. సి కొవ్వూరి  శ్రీనివాస్,మాట్లాడుతూ భూ పంపిణి లో దళితుడి దగ్గర కొని, మరో దళితునుకి ఇస్తే ఈ రెండు కుటుంబాలకు మేలు చేసిన వాళ్ళం అవుతం అని, అదేవిధముగా రాజకీయ నాయకులకు లబ్ది పొందకుండా నిరు పేద దళితులకు ఉపయోగకారముగా భూపంపిణి చేయాలనీ అన్నారు. గతంలో కుడా 97 మంది రైతులకు భూ సాగు  కింద 300 ఎకరాల భూమి  పట్టా పాసు పుస్తకాలు పంపిణి చేయడం లేదని అన్నారు అధికారులు చర్య తీసుకోని పట్టా పాసు పుస్తకాలు  పంపిణి  త్వరగా చేయాలనీ అన్నారు.  ఈ కార్యక్రమంలో తహసిల్దార్  రమేష్ గౌడ్ మాట్లాడుతూ సకాలంలో వి అర్ ఓ లు అధికారులను భూ సర్వే చేయించి,  నిరు పేద దళిత  కుటుంభాలకు భూ పంపిణి కార్యక్రమం ద్వారా  అందచేసే విధముగా చూస్తామని అన్నారు.  అదేవిధముగా యం పి పి సంజీవ్ కుమార్,జడ్ పి టి సి బాబురావు లు కూడా భూ పంపిణి నిరు పేద  దళితులకు అందే విధముగా చూడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో   సర్పంచులు పెసరు వెంకటమ్మ, గజ్జల సుశీల, చిన్నయ, వెమునురి వెంకటేశ్వర్లు. టి అర్ ఎస్ తూర్ప జిల్లా ఉపాధ్యక్షులు నవీన్ కుమార్ జేశ్వల్, ఉపసర్పంచు శ్రీధర్ కుమార్, చేన్నసోమశేకర్,  ఉప తహసిల్దార్ రామ్మోహన్  రావు మరియు  తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment